కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి


పదవీ కాలం
2018 - 2022 ఆగస్టు 2
నియోజకవర్గం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం

పదవీ కాలం
2016-2018

పదవీ కాలం
2009 - 2014
తరువాత బూర నర్సయ్య గౌడ్
నియోజకవర్గం భువనగిరి

వ్యక్తిగత వివరాలు

జననం (1967-06-01) 1967 జూన్ 1 (వయసు 56)
బ్రాహ్మణవెల్లెంల, నల్లగొండ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు పాపిరెడ్డి - సుశీలమ్మ
జీవిత భాగస్వామి లక్ష్మీ
సంతానం ఒక కుమారుడు
వెబ్‌సైటు www.krgreddy.com

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి శానససభ్యుడిగా ఉన్నాడు.[1][2] శాసన మండలి సభ్యుడిగా, భువనగిరి లోకసభ నియోజకవర్గం నుండి 15వ లోక్ సభ (2009-2014) సభ్యుడిగా పనిచేశాడు.[3]

జననం - చదువు[మార్చు]

రాజగోపాల్ రెడ్డి 1967, జూన్ 1న పాపిరెడ్డి - సుశీలమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లాలోని బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో జన్మించాడు.[4] ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. పట్టా పొందాడు. రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాజీ మంత్రి, ప్రస్తుతం భువనగిరి లోకసభ ఎంపిగా ఉన్నాడు.

వివాహం[మార్చు]

రాజగోపాల్ రెడ్డికి 1994, ఆగస్టు 20న లక్ష్మితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు.

ప్రవృత్తి[మార్చు]

వ్యాపారవేత్తగా ప్రసిద్ధి పొందాడు. ఆ సమయంలోనే అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించాడు. గ్రామీణ ప్రాంతాలలో వైద్య శిబిరాలు, నేత్ర శిబిరాలు నిర్వహించాడు.

రాజకీయరంగం[మార్చు]

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన 2009లో భువనగిరి లోకసభ నియోజకవర్గం నుండి పోటి చేసి భారత కమ్యునిస్టు పార్టీ అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 1,39,978 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5] తరువాత 2016 నుండి 2018 వరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటిచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 22,552 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6] ఆయన 2022 ఆగస్టు 2న కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు.[7]

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 ఆగస్టు 21న మునుగోడులో జరిగిన ఆత్మగౌరవ సభలో కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[8] ఆయన ఆ తరువాత 2022లో జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో ఓడిపోయాడు.[9] రాజగోపాల్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా 2023 జులై 5న బీజేపీ జాతీయ నాయకత్వం నియమించింది.[10] రాజగోపాల్‌రెడ్డి 2023 అక్టోబర్ 25న బీజేపీకి రాజీనామా చేశాడు.[11][12]

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2023 అక్టోబర్ 27న ఢిల్లీలో పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[13] ఆయనను 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన రెండో జాబితాలో మునుగోడు అభ్యర్థిగా ప్రకటించింది.[14][15]

పదవులు[మార్చు]

 • 31.08.2009 - 2014: నీటి వనరులపై కమిటీ సభ్యుడు

ఇతర వివరాలు[మార్చు]

చైనా, ఈజిప్ట్, జెర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, మలేసియా, శ్రీలంక, సింగపూర్, యు.ఎస్.ఏ. మొదలైన దేశాలు సందర్శించాడు.

మూలాలు[మార్చు]

 1. "లోకసభ జాలగూడు". Archived from the original on 2013-02-01. Retrieved 2014-01-19.
 2. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
 3. "Ugly scenes at martyrs meeting - Today's Paper". The Hindu. 2010-11-15. Retrieved 2016-12-01.
 4. "Komatireddy Rajgopal Reddy | MLA | Munugode | Congress | Nalgonda". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-07-28. Retrieved 2021-10-29.
 5. "Members : Lok Sabha". loksabhaph.nic.in. Retrieved 2021-10-29.
 6. "Komatireddy Rajgopal Reddy(Indian National Congress(INC)):Constituency- MUNUGODE(NALGONDA) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-10-29.
 7. Sakshi (3 August 2022). "కాంగ్రెస్‌కు రాజగోపాల్‌రెడ్డి గుడ్‌బై!". Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
 8. 10TV Telugu (21 August 2022). "బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి..కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అమిత్ షా". Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.
 9. BBC News తెలుగు (6 November 2022). "మునుగోడులో టీఆర్ఎస్ విజయం, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటమి, డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్". Archived from the original on 6 July 2023. Retrieved 6 July 2023.
 10. HMTV (5 July 2023). "బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి". Archived from the original on 6 July 2023. Retrieved 6 July 2023.
 11. Eenadu (25 October 2023). "భాజపాకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా". Archived from the original on 25 October 2023. Retrieved 25 October 2023.
 12. Sakshi (25 October 2023). "బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా". Archived from the original on 25 October 2023. Retrieved 25 October 2023.
 13. Sakshi (27 October 2023). "తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలు". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
 14. Andhrajyothy (28 October 2023). "కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
 15. Eenadu (28 October 2023). "ముగ్గురు ఖరారు." Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.