ఉజ్జిని నారాయణరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉజ్జిని నారాయణరావు
ఉజ్జిని నారాయణరావు
ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు
In office
1985-1989, 1989-1994, 1994-1999
అంతకు ముందు వారుపాల్వాయి గోవర్ధన్ రెడ్డి
నియోజకవర్గంమునుగోడు శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1927-05-30)1927 మే 30
గడియగౌరారం, చింతపల్లి మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ
మరణం2016 జూలై 13(2016-07-13) (వయసు 89)
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీభారత కమ్యునిస్టు పార్టీ
సంతానంఉజ్జిని యాదగిరిరావు (కుమారుడు)[1]
నివాసంహైదరాబాదు, తెలంగాణ

ఉజ్జిని నారాయణరావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. భారత కమ్యునిస్టు పార్టీ సీనియర్ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు, రజాకార్లకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన నాయకుడు.[2] నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుంచి 1985-99 కాలంలో సీపీఐ పార్టీ తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[3][4][5]

జననం

[మార్చు]

నారాయణరావు 1927, మే 30న తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, చింతపల్లి మండలంలోని గడియగౌరారం గ్రామంలో జన్మించాడు.[6]

రాజకీయ జీవితం

[మార్చు]

విద్యార్థి దశ నుండి కమ్యూనిస్టు పార్టీ విధానాలతో ప్రభావితుడై ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. 1951లో దేవరకొండ తాలుకా పార్టీ కార్యదర్శిగా ఎన్నికై 12 ఏళ్ళపాటు కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేశాడు. ధర్మభిక్షం, ఎలమందలతో కలిసి భూపోరాటాలు సాగించి పేదలకు భూపంపిణీకి పాటుపడ్డాడు. సకాయి బకాయి పన్ను ఉద్యమం దేవరకొండ తాలుకాలో నారాయణరావుకు గుర్తింపు తెచ్చింది. 1967ఎన్నికల్లో భారత కమ్యునిస్టు పార్టీ తరపున మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చేతిలో ఓటమి చెందాడు. 1985లో కాంగ్రెస్ నేత ఎం. నారాయణరావుపై గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు. 1989, 1994 ఎన్నికల్లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిపై వరుస విజయాలు సాధించి హాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచాడు.[7]

ఎన్నికల వివరాలు

[మార్చు]
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
1994 293 మునుగోడు జనరల్ ఉజ్జిని నారాయణరావు పు భారత కమ్యునిస్టు పార్టీ 55209 పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పు స్వతంత్ర 23655
1989 293 మునుగోడు జనరల్ ఉజ్జిని నారాయణరావు పు భారత కమ్యునిస్టు పార్టీ 51445 పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెస్ 43183
1985 293 మునుగోడు జనరల్ ఉజ్జిని నారాయణరావు పు భారత కమ్యునిస్టు పార్టీ 44733 పుంగల నారాయణరావు పు భారత జాతీయ కాంగ్రెస్ 23950

రైతు బాంధవుడు

[మార్చు]

దేవరకొండ తాలూకాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నారాయణరావు తన జీవితానంతా రైతాంగ ఉద్యమాలకే ధారబోశాడు. రజాకార్లకు, భూస్వాములకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశాడు. భూస్వాముల చెరల్లో ఉన్న భూములను పేదలకు పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కరీంనగర్ జిల్లా పొల్కంపల్లి వెంకటరామారావుతో కలసి ఆంధ్ర మహాసభలో చేరి ప్రజాసమస్యలపై స్పందించడంతోపాటు, భూ పోరాట ఉద్యమాల్లో పాల్గొన్నాడు. సాగునీటి భూములపై అప్పటి ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల బకాయిలు, నీటి తీరువా వసూళ్లను రద్దు చేయించడంలో అలుపెరుగని పోరాటం చేశారు. రైతాంగ, కార్మిక, వ్యవసాయ కూలీల సమస్యలపై నిరంతర పోరాటాలు నిర్వహించి రైతు బంధువుగా పేరు సంపాదించారు. నారాయణరావు దేవాదాయ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.[8]

మరణం

[మార్చు]

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నారాయణరావు హైదరాబాద్‌లోని ఎల్‌బినగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన 90వ ఏట 2016, జూలై 13న మరణించాడు.[9][10]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (28 November 2023). "ఆ తండ్రీ కొడుకులు.. మునుగోడు ఎమ్మెల్యేలు". Archived from the original on 28 November 2023. Retrieved 28 November 2023.
  2. మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు కన్నుమూత Sakshi | July 13, 2016
  3. "Andhra Pradesh Assembly Election Results in 1985". Elections in India. Archived from the original on 2021-03-01. Retrieved 2021-11-07.
  4. "Andhra Pradesh Assembly Election Results in 1989". Elections in India. Archived from the original on 2019-11-16. Retrieved 2021-11-07.
  5. "Andhra Pradesh Assembly Election Results in 1994". Elections in India. Archived from the original on 2021-11-07. Retrieved 2021-11-07.
  6. "కమ్యూనిస్టు యోధుడు ఉజ్జిని ఇకలేరు". Sakshi. 2016-07-14. Archived from the original on 2021-11-07. Retrieved 2021-11-07.
  7. "కమ్యూనిస్టు నేత ఉజ్జిని కన్నుమూత | Andhrabhoomi - Telugu News Paper". www.andhrabhoomi.net. 2016-07-14. Archived from the original on 2021-11-07. Retrieved 2021-11-07.
  8. "కమ్యూనిస్టు యోధుడు ఉజ్జిని నారాయణరావు ఇకలేరు". Archived from the original on 2016-07-15. Retrieved 2016-07-14.
  9. Sakshi (13 July 2016). "మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు కన్నుమూత". www.sakshi.com. Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.
  10. India, The Hans (2016-07-14). "CPI ex-MLA Narayana Rao passes away". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2016-07-17. Retrieved 2021-11-07.

ఇతర లింకులు

[మార్చు]