Jump to content

కామినేని వైద్య విజ్ఞాన సంస్థ

వికీపీడియా నుండి
కామినేని వైద్య విజ్ఞాన సంస్థ
నినాదం"విద్య ప్రాచీన గుప్తధనం"
జ్ఞానం దాచిన ధనం treasure
రకంవైద్య కళాశాల
స్థాపితం1999
అండర్ గ్రాడ్యుయేట్లుప్రతి సంవత్సరం 150 మంది
స్థానంనార్కెట్‌పల్లి, తెలంగాణ, భారతదేశం
కాంపస్గ్రామీణ ప్రాంతం
అనుబంధాలుకాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
జాలగూడు"www.kimsmedicalcollege.com"

కామినేని వైద్య విజ్ఞాన సంస్థ (Kamineni Institute of Medical Sciences; KIMS) ప్రసిద్ధి చెందిన వైద్య కళాశాల. ఇది నల్గొండ జిల్లాలో నార్కెట్‌పల్లి గ్రామంలో ఉంది. ఈ కళాశాలను అనుబంధంగా 1050-పడకల ఆసుపత్రి నడపబడుతున్నది. ఇది జాతీయ రహదారి 9 మీద హైదరాబాద్ పట్టణం నుండి సుమారు 80 కిలోమీటర్లు (50 మైళ్లు) దూరంలో ఉంది. ఇది ఈ ప్రాంత పేదప్రజలను ఉన్నతమైన వైద్య సేవలను అందిస్తున్నది. ఇక్కడకు మన రాష్ట్రం నుండే కాక ఇతర దేశాల నుండి కూడా విద్యార్థులు వైద్యంలో డిగ్రీ (M.B., B.S.) కోసం వస్తారు. ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంకు అనుంబంధంగా పనిచేస్తుంది.

స్థాపన

[మార్చు]

ఈ వైద్య సంస్థను శ్రీ కామినేని సూర్యనారాయణ గారు కామినేని విద్యా సంఘం (Kamineni Education Society) లో భాగంగా 1999 సంవత్సరంలో ప్రారంభించారు. మొదటి దఫా 100 మంది వైద్య విద్యార్థులు ఇందులో నమోదు చేసుకున్నారు. తర్వాత ఈ సంఖ్య 150 కి పెరగడమే కాకుండా కొన్ని శాఖలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించారు.

ప్రధానోపాధ్యాయులు

[మార్చు]
  • డా. రాజేంద్ర బాబు (1999 – 2006)
  • డా. సి. జి. విల్సన్ (2006 – ప్రస్తుతం)

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
  1. "KIMS"/ The website of Kamineni Medical college
  2. "NTR University of Health Sciences"
  3. "Kamineni Education Society"
  4. "Kamineni Hospitals"