రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాల
రకంప్రభుత్వ వైద్య విద్య
స్థాపితం2021
అనుబంధ సంస్థకాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
విద్యార్థులు150
స్థానంరామగుండం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ, భారతదేశం

రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాల అనేది తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, రామగుండం పట్టణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల. గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఔత్సాహిక వైద్య విద్యార్థులకు వైద్య పరిజ్ఞానాన్ని అందించేందుకు తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం 2021లో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించింది. ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ నుండి 2022-23 విద్యా సంవత్సరానికి 150 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లేఖను అందుకుంది.[1]

ప్రాంగణం

[మార్చు]

ఈ కళాశాల నిర్మాణానికి సింగరేణి సంస్థ 21ఎకరాల స్థలం ఇచ్చింది. 510 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ కళాశాల ప్రాగంణంలో ప్రీ & పారా క్లినికల్ డిపార్ట్‌మెంట్‌లు, బాలుర & బాలికల వసతిగీహాలు, అకడమిక్ బ్లాక్, వివిధ రెసిడెన్షియల్ బ్లాక్‌లు మొదలైన వివిధ భవనాలు ఉన్నాయి.

గ్రౌండ్‌ ఫ్లోర్‌లో లెక్చరర్‌ హాల్స్‌, కార్యాలయం, అనాటమీ ల్యాబ్‌, డిసిక్షన్‌ హాల్‌, మ్యూజియం, లాకర్‌రూం, చైల్డ్‌కేర్‌ రూమ్స్‌, డెమో రూమ్స్‌, క్లినికల్‌ రూమ్స్‌, హిస్టాలజీ ల్యాబ్‌, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ రూం, కోల్డ్‌ స్టోరేజ్‌ రూంలు... ఫస్ట్‌ ఫ్లోర్‌లో లైబ్రరీ రూం, ఫొటోకాపీ రూం, ఎలక్ట్రికల్‌ రూం, ఈ లైబ్రరీ, రీడింగ్‌రూం ఫ్యాకల్టీ, రీడింగ్‌ రూం రెసిడెన్సీస్‌, లైబ్రేరియన్‌, స్టాక్‌ రూం, కాలేజ్‌ కౌన్సిల్‌, సర్వర్‌రూం, స్టాఫ్‌రూం, అసిస్టెంట్‌ డైరెక్టర్‌రూం, వైస్‌ ప్రిన్సిపాల్‌ రూంలు... సెకండ్‌ ఫ్లోర్‌లో ఫార్మాకాలేజీ డిపార్ట్‌మెంట్‌, క్లినికల్‌ ఫ్రామా కాలజీ ల్యాబ్‌, కంప్యూటర్‌ అసిస్ట్‌ లర్నింగ్‌ ల్యాబ్‌లు... థర్డ్‌ ఫ్లోర్‌లో ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ టెక్సాలజీ డిపార్ట్‌మెంట్‌, ఫోరెన్సిక్‌, మెడికల్‌ మ్యూజియంలథర్డ్‌ ఫ్లోర్‌లో స్కిల్‌ ల్యాబ్‌లు, హిస్ట్రో పైథాలజీ ల్యాబ్‌, జనరల్‌ ఫొటోగ్రఫీ సెక్షన్‌, సైఫో పైథాలజీ విభాగాలు ఉన్నాయి.[2]

ఆసుపత్రి

[మార్చు]

100 పడకలతో ఉన్న గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని 330 పడకల స్థాయికి పెంచి బోధనాస్పత్రిగా మార్చబడింది.[3]

కోర్సులు - శాఖలు

[మార్చు]
 • అనాటమీ
 • ఫార్మాకాలజీ
 • ఫిజియోలాజీ
 • బయోకెమిస్ట్రీ
 • పాథాలజీ
 • మైక్రోబయోలాజీ
 • ఫోరెన్సిక్ మెడిసిన్
 • జెనరల్ సర్జరీ
 • ఆర్థోపెడిక్స్
 • ఓటో-రైనో-లారిగోలజీ
 • ఆప్తాల్మోలజీ
 • జనరల్ మెడిసిన్
 • టిబి & ఆర్‌డి
 • డివిఎల్
 • సైకియాట్రీ
 • పీడియాట్రిక్స్
 • ఓబిజీ
 • అనస్థీషియాలజీ
 • కమ్యూనిటీ మెడిసిన్
 • రేడియోడియాగ్నోసిస్
 • ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్
 • టీబీసీడీ
 • సీటీ సర్జరీ
 • న్యూరో సర్జరీ
 • న్యూరాలజీ
 • ప్లాస్టిక్‌ సర్జరీ
 • యూరాలజీ
 • గాస్ట్రోఎంట్రాలజీ
 • ఎండోక్రైనాలజీ
 • నెఫ్రాలజీ
 • కార్డియాలజీ
 • ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్
 • ఈఎన్‌టీ
 • ఆప్తల్
 • అనస్తీషియా
 • డెంటల్

తరగతుల ప్రారంభం

[మార్చు]

కళాశాల ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, లెక్చరర్లు, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను నియమించారు. 2022 నవంబరు 2వ తేదీ నుంచే రెండో విడుత కౌన్సెలింగ్‌ ప్రారంభమై డిసెంబరు 14 వరకు విడుతల వారీగా సీట్ల భర్తీ జరగనున్నది. 2022 నవంబరు 15 నుండి ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 8 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించి వైద్యరంగంలో గుణాత్మక మార్పుకు, దేశ వైద్యరంగంలోనే నూతన అధ్యాయానికి నాందిపలికాడు.[4]

ఎనమిది వైద్య కళాశాలలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. reserved, © Ushodaya Enterprises Pvt Ltd All rights (2022-08-26). "Gvt Medical College: రామగుండంలో ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుమతి". EENADU PRATIBHA. Archived from the original on 2022-11-11. Retrieved 2022-11-11.
 2. telugu, NT News (2022-11-03). "రామగుండం మెడికల్‌ కాలేజీ రెడీ". www.ntnews.com. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-11.
 3. "రామగుండం వైద్య కళాశాల సాకారం". EENADU. 2022-08-26. Archived from the original on 2022-11-11. Retrieved 2022-11-11.
 4. telugu, NT News (2022-11-15). "మెడికల్‌ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2022-11-15. Retrieved 2022-11-16.

ఇతర లంకెలు

[మార్చు]