మెడిసిటి వైద్య విజ్ఞాన సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెడిసిటి వైద్య విజ్ఞాన సంస్థ
మెడిసిటి వైద్య విజ్ఞాన సంస్థ లోగో
రకంప్రైవేటు వైద్య కళాశాల
స్థాపితం2002
ప్రధానాధ్యాపకుడుడా. రణ్‌వీర్ సింగ్
స్థానంఘన్‌పూర్, మేడ్చల్, తెలంగాణ, భారతదేశం
కాంపస్గ్రామీణ, 200 ఎకరాలు (40 ఎకరాలు కళాశాల)
అనుబంధాలుకాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం

మెడిసిటి వైద్య విజ్ఞాన సంస్థ (మిమ్స్) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు ముప్పై కిలోమీటర్ల దూరంలోని మేడ్చల్ లో ఉన్న వైద్య కళాశాల.[1] ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది.

చరిత్ర

[మార్చు]

ఇది 1985లో స్థాపించబడిన ఒక ప్రభుత్వేతర సంస్థ సైన్స్ హెల్త్ అలైడ్-రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (షేర్) పరిధిలో ప్రారంభించిన తృతీయ-విద్యా సంస్థ.[2] ఇది 2002లో స్థాపించబడింది. 1992 నుండి ఘన్‌పూర్‌లో పనిచేస్తున్న 300 పడకల మల్టీ-స్పెషాలిటీ (కార్డియో-థొరాసిక్ స్పెషాలిటీ) మెడిసిటి హాస్పిటల్ ఈ మెడిసిటి వైద్య విజ్ఞాన సంస్థతో కలుపబడి, ప్జనరల్-ప్రాక్టీస్ సదుపాయంగా, కళాశాలకు బోధనా ఆసుపత్రిగా పనిచేస్తోంది.

భారత వైద్య మండలి 2020, ఆగస్టు 1న మొదటి బ్యాచ్‌కు అనుమతి ఇవ్వడంతో 2002, అక్టోబరు 17న 100 మంది విద్యార్థులతో 2002-2003 విద్యా సంవత్సరంను ఈ మెడిసిటి వైద్య విజ్ఞాన సంస్థ ప్రారంభించింది. తరువాత భారత వైద్య మండలి సిఫారసుతో భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2007 సంవత్సరం నుండి ఎంబీబీఎస్ డిగ్రీలను ప్రదానం చేసినందుకు మిమ్స్‌ను గుర్తించింది. 2012-13 విద్యా సంవత్సరం నుండి 100 నుండి 150 వరకు సీట్లు పెంచడానికి అనుమతులు వచ్చాయి. 2009లో ప్రీ, పారా, క్లినికల్ విభాగాలలో 50 సీట్లతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ప్రారంభమయ్యాయి.

ప్రాంగణం

[మార్చు]

హైదరాబాదు నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో నాగ్‌పూర్ హైవే నెంబర్ 7లో పచ్చదనం, కొండలు, సరస్సుతో కూడిన మేడ్చెల్ గ్రామీణ ప్రాంతంలో 200 ఎకరాల్లో ఈ మెడిసిటి వైద్య విజ్ఞాన సంస్థ ప్రాంగణం ఉంది. ఇందులో 40 ఎకారాలు కళాశాల కోసం ఉపయోగించబడింది.[3]

కళాశాలలో బోధన, పరిశోధన, ఆసుపత్రి, రోగుల సంరక్షణ కోసం అన్ని సౌకర్యాలు ఉన్నాయి. డిగ్రీ కోర్సులు ఎనిమిది నాన్ క్లినికల్ విభాగాలు పూర్తి స్థాయి ప్రయోగశాలలు, ప్రపంచ స్థాయి లెక్చర్ హాల్స్, ఆడియో విజువల్ తోపాటు తగిన మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నాయి.

ఈ ప్రాంగణంలో కళాశాల వసతి గృహాలు, క్యాంటీన్లు, గ్రంథాలయం, వ్యాయామశాల, ఉద్యానవనం, ఆటస్థలం మొదలైనవి ఉన్నాయి. అంతేకాకుండా, అనేక మంది విద్యార్థులు సమీప ప్రాంతాల నుండి, హైదరాబాదు నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యార్థి బస్సుల ద్వారా ప్రయాణం చేస్తారు.

కోర్సులు - శాఖలు

[మార్చు]

వైద్య విద్య (ఎంబిబిఎస్)

[మార్చు]

ఇది నాలుగున్నర ఏళ్ళ కోర్సు, సెమిస్టర్ విధానం ఉంటుంది.

  • అనాటమీ
  • ఫిజియోలాజీ
  • బయోకెమిస్ట్రీ
  • పాథాలజీ
  • ఫార్మాకాలజీ
  • మైక్రోబయోలాజీ
  • ఫోరెన్సిక్ మెడిసిన్
  • ఆప్తాల్మోలజీ
  • ఓటో-రైనో-లారిగోలజీ
  • కమ్యూనిటీ మెడిసిన్
  • జెనరల్ సర్జరీ
  • పీడియాట్రిక్స్
  • గైనకాలజీ

పిజి కోర్సులు

[మార్చు]

ఇది మూడు సంవత్సరాల కోర్సు.

  • అనస్థీషియాలజీ 3 ఇయర్స్
  • డివిఎల్
  • జనరల్ మెడిసిన్
  • పీడియాట్రిక్స్
  • రేడియో-డయాగ్నసిస్
  • గైనకాలజీ
  • అనాటమీ
  • ఫిజియాలజీ
  • బయోకెమిస్ట్రీ
  • మైక్రో బయాలజీ
  • పాథాలజీ
  • ఫార్మకాలజీ
  • కమ్యూనిటీ మెడిసిన్
  • టిబి, రెస్పిరేటరీ
  • సైకియాట్రీ
  • ఫోరెన్సిక్ మెడిసిన్
  • జనరల్ సర్జరీ
  • ఆప్తాల్మాలజీ
  • ఆర్థోపెడిక్స్
  • ఈ.ఎన్.టి

నర్సింగ్

[మార్చు]
  1. స్కూల్ ఆఫ్ నర్సింగ్: జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీలో డిప్లొమా కోసం మూడేళ్ల కోర్సును ఉంటుంది. మెడిసిటి స్కూల్ ఆఫ్ నర్సింగ్ 1995, జూలైలో ప్రారంభించబడింది. దీనిని తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తించాయి. ఈ కోర్సులో ప్రతి సంవత్సరం అరవై మంది విద్యార్థులు ప్రవేశం పొందుతారు. గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు మెడిసిటి ఆసుపత్రులలో రెండేళ్లపాటు స్టాఫ్ నర్సులుగా పనిచేస్తారు.
  2. కాలేజ్ ఆఫ్ నర్సింగ్: బిఎస్సి నర్సింగ్ 4 సంవత్సరాల డిగ్రీ కోర్సు ఉంటుంది. మెడిసిటి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 2006లో స్థాపించబడింది. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ చేత గుర్తించబడింది.

ఇతర వివరాలు

[మార్చు]
  1. ఇందులోని 13 క్లినికల్ విభాగాలతో ఉన్న ఆసుపత్రిలో అన్ని రకాల వ్యాధులను ప్రీ, పారా క్లినికల్ విభాగాల సహకారంతో చికిత్స చేస్తారు. ప్రయోగశాల, విశ్లేషణలలో ఉన్న అనేక పరికరాలు, రోగలును పరీక్షంచడానికి ఉపయోగించే పరికరాలన్నీ అత్యాధునికమైనవి. ఈ ఆసుపత్రిలో సిటి స్కాన్, ఎంఆర్‌ఐ, మామోగ్రఫీ, కలర్ డాప్లర్స్, 2 డి ఎకో, ట్రెడ్ మిల్, వెంటిలేటర్లు, ఆటో ఎనలైజర్ మొదలైన పరికరాలు ఉన్నాయి.
  2. 2020 నాటికి 18వ సంవత్సరం పూర్తిచేసుకున్న ఈ ప్రాగణంలో 750 మంది యుజి విద్యార్థులు, 150 మంది పిజి విద్యార్థులు, వెయ్యి మంది, అధ్యాపకులు, సహాయక సిబ్బంది ఉన్నారు. సగటున సుమారు 1200-1300 మంది ఔట్ పేషెంట్స్ ఆసుపత్రి ద్వారా సరసమైన, సబ్సిడీ రేటుతో అందించే వైద్య సంరక్షణ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.
  3. 2007 ఆగస్టు 25న లుంబిని పార్క్, గోకుల్ చాట్ వద్ద జరిగిన హైదరాబాదు బాంబు దాడులలో గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స కేంద్రంగా పనిచేసింది.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "View details of college - Mediciti Institute Of Medical Sciences, Ghanpur". Archived from the original on 2016-06-01. Retrieved 2020-09-09.
  2. "MediCiti Institute of Medical Sciences".
  3. mims. "MediCiti Institute of Medical Sciences". mims.edu.in. Archived from the original on 2020-08-03. Retrieved 2020-09-09.
  4. "34 killed as two blasts rock Hyderabad". The Hindu. Hyderabad. 26 August 2007. Archived from the original on 2011-06-06. Retrieved 2020-09-09.
  5. "Terror site was Hyderabad but target India". The Indian Express. Hyderabad. 27 August 2007. Retrieved 2020-09-09.

ఇతర లంకెలు

[మార్చు]