లుంబినీ పార్క్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Lumbini Park
Lumbini Park, Hyderabad.jpg
Lumbini Park
రకముUrban park
స్థానముHussain Sagar, Hyderabad
అక్షాంశరేఖాంశాలు17°24′36″N 78°28′20″E / 17.410°N 78.4722°E / 17.410; 78.4722 (Lumbini Park)Coordinates: 17°24′36″N 78°28′20″E / 17.410°N 78.4722°E / 17.410; 78.4722 (Lumbini Park)
విస్తీర్ణం7.5 acres (3.0 ha)
నవీకరణ1994
నిర్వహిస్తుందిBuddha Purnima Project Authority
స్థితిOpen all year

" లుంబినీ పార్క్ " 7.5 ఎకరాల వైశాల్యం కలిగిన ఒక చిన్న పబ్లిక్ అర్బన్ పార్క్ (నగరోద్యానవనం). ఇది హుస్సేన్ సాగర్ సమీపంలో ఉంది. నగరం కేంద్రస్థానంలో ఉన్న ఈ పార్క్ బిర్లామందిర్ మరియు నెక్లెస్ రోడ్డు మొదలైన ఇతర పర్యాటక ఆకర్షణలకు సామీప్యంలో ఉంది. ఇది సంవత్సరమంతటా అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది. ఇది 1994లో నిర్మించబడింది. ఈ పార్కును తెలంగాణా ప్రభుత్వ డైరెల్టరేట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న " బుద్ధపౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ " నిర్వహిస్తుంది. 2007 ఆగస్టు 25 న 44 మంది ప్రాణాలను బలితీసుకున్న హైదరాబాద్ బాంబింగ్‌లో " తీవ్రవాదులు ఎంచుకున్న కేంద్రాలలో లుంబినీ పార్క్ ఒకటి.[1]

చరిత్ర[మార్చు]

1994 లో లుంబినీ పార్క్ నిర్మాణవ్యయం 2.35 కోట్లు. పార్క్ వైశాల్యం 5 ఎకరాలు. ఇది హుస్సేన్ సాగర్ సమీపంలో ఉంది. 2000 లో హైదరాబాదులో ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన ప్రాంతాలను సంరక్షించేందుకు " బుద్ధ పౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ " స్థాపించబడింది. బుద్ధ పౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ నెక్లెస్ రోడ్డు మరియు ఎన్.టి.ఆర్. గార్డెన్ల నిర్వహణతో లుంబినీగార్డెన్ నిర్వహణకూడా చేపట్టింది.[2] పర్యాటకులను ఆకర్షించడం కొరకు పార్కులో ఉన్న మ్యూజిక్ ఫౌంటెన్, పూలతోటలతో బోటింగ్ మరియు లేజర్ షో వంటి ఆకర్షణలను అభివృద్ధి చేసింది. [2] 2006 లో ముఖ్యమంత్రి అంజయ్య గౌరవార్ధం పార్కుకు " అంజయ్య లుంబినీ పార్కు " అని పేరు మార్చబడింది.[3]

2007 తీవ్రవాద దాడి[మార్చు]

2007 ఆగస్ట్ 25న హైదరాబాదులో జరిగిన వరుస బాంబుదాడులలో 44 మంది మరణించారు 60 మంది గాయపడ్డారు.[1] లుంబినీ పార్కులో జరిగిన దాడి లేజర్ అడిటోరియంలో ప్రదర్శనజరుగుతున్న సామ్యంకాల సమయంలో జరిగింది. ప్రదర్శన సమయంలో అడిటోరియంలో 500 మంది ఉన్నారు. [4] కొద్ది రోజులపాటు కేసు విచారణ కొరకు మూసి వేయబడిన పార్కు మెటల్ డిటెక్టర్ మొదలైన ఏర్పాట్ల తరువాత తిరిగి పర్యాటక సందర్శనకు అనుమతించబడింది.[5]

మల్టీమీడియా ఫౌంటెన్ షో[మార్చు]

లుంబినీ పార్కులో " ఎమోషన్ మీడియా ఫ్యాక్టరీ " మొట్టమొదటి వాటర్ మల్టీమీడియా షో స్థాపించింది. మల్టీమీడియా ఫౌంటెన్ షో చూడడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రదర్శనలో అద్భుతమైన లేజర్ అనిమేషన్, లైవ్ వీడియో, అద్భుతమైన శబ్ధ నాణ్యత, రిథమిక్ మ్యూజికల్ ఫౌంటెన్ మరియు అసాధారణ భీం ఎఫెక్టులు అన్నీ కలిసి ఆశ్చర్యకరమైన చూపరులను మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనను అందిస్తున్నాయి. ఇండియాలోని అతిపెద్ద నీటితెరగా (వాటర్ స్క్రీన్) ఇది వర్ణించబడుతుంది. ఈ ప్రదర్శనలో హైదరాబాదులోని గత, ప్రస్తుత మరియు భవిష్యత్తు సంబంధిత ఆకర్షణీయమైన చారిత్రక, సాస్కృతిక మరియు ఆసక్తికరమైన కధలను తెరకెక్కిస్తుంది. ఈ ప్రదర్శన ప్రతిరాత్రి ప్రేక్షకులను అత్యధికంగా ఆకర్షిస్తుంది.[6]

ఆకర్షణలు[మార్చు]

Water fall at Lumbini Park
Multimedia Show at Lumbini Park
One of the ride at Lumbini Park

పార్కుకు ఆనుకుని ఉన్న 2.5 ఎకరాల భూమిని లేజర్ అడిటోరియం నిర్మించడం కొరకు " ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్టుమెంటును " కోరింది. ఇలాటి అడిటోరియాలలో భారతదేశంలో ఇదే మొదటిదని భావించబడుతుంది. ఈ అడిటోరియంలో 2000 మంది ప్రదర్శన తిలకించే సౌకర్యం ఉంది.ఇక్కడ హైదరాబాదు గురించిన చారిత్రకాంశాలు ప్రదర్శించబడుతుంటాయి.[7][8] పార్కుకు ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా మారింది. అంతేకాక హైదరాబాదుకు గ్లోబల్ అంతస్తు కలిగించిన అంశాలలో ఇది ఒకటి. అంతేకాక ఈ పార్కు నేపాలీ సంస్కృతిని ప్రపంచం అంతటా వ్యాపించజేస్తూ ఉంది.[9]

పనివేళలు[మార్చు]

పార్కు అన్ని రోజులు పర్యాటకుల సందర్శనకు అనుమతి ఇస్తుంది. ఈ పార్కులో వారాంతాలలో మినహా మిగిలిన రోజులలో ప్రతిరోజు సాయంకాలం 7.15 గంటలకు లేజర్ ప్రదర్శన నిర్వహించబడుతుంది. వారాంతాలలో సాయం కాలం 7.30 గంటలకు మరియు 8.30 గంటలకు రెండుమార్లు ప్రదర్శన నిర్వహించబడుతుంది.[10]

చేరుకోవడం[మార్చు]

సెక్రటరియేట్ న్యూ గేట్, హైదరాబాదు, తెలంగాణా 500004.

మూలాలజాబితా[మార్చు]

  1. 1.0 1.1 Kamalapurkar, Shwetal (2007-08-25). "Death toll in Hyderabad serial blasts rises to 44". IBNLive.com. Retrieved 2008-08-17. Cite web requires |website= (help)
  2. 2.0 2.1 "Buddha Purnima Project Authority". Hyderabad Urban Development Authority. మూలం నుండి October 9, 2007 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-08-17. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
  3. "YSR reiterates promise on housing for the poor". The Hindu. 2006-08-17. Retrieved 2008-08-17. Cite web requires |website= (help)
  4. Amin Jafri, Syed (2007-08-25). "Hyderabad: 42 killed, 50 injured in twin blasts". Rediff.com. Retrieved 2008-08-17. Cite web requires |website= (help)
  5. "Lumbini Park reopens today". The Hindu. 2007-08-30. Retrieved 2008-08-17. Cite web requires |website= (help)
  6. Bhatt, Shankarlal C. (2006-01-01). Land and People of Indian States and Union Territories: In 36 Volumes. Andhra Pradesh (ఆంగ్లం లో). Gyan Publishing House. ISBN 9788178353586.
  7. "Trial run of laser show begins today". The Hindu. 2005-01-14. Retrieved 2008-08-17. Cite web requires |website= (help)
  8. Singh, Khurshchev (2007-09-13). "Hyderabad Woes: Mecca Masjid, Lumbini Park..." Institute of Defence Studies & Analysis. Retrieved 2008-08-17. Cite web requires |website= (help)[dead link]
  9. Ramanathan, Gayatri (2003-04-03). "Hi-tech entertainments on the anvil for Hyderabad". The Times of India. Retrieved 2008-08-17. Cite web requires |website= (help)
  10. "Lumbini Park". Journeymart. Retrieved 2015-06-22. Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]

G+ page
GHMC
Tripadvisor