ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల
రకంప్రభుత్వ వైద్య విద్య
స్థాపితం2023, సెప్టెంబరు 15
అనుబంధ సంస్థకాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
విద్యార్థులు100
స్థానంఅంకుశాపూర్, ఆసిఫాబాద్ మండలం, కొమరంభీం జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాలగూడుకళాశాల వెబ్సైటు

ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనేది తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం, అంకుశాపూర్ లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల.[1] గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఔత్సాహిక వైద్య విద్యార్థులకు వైద్య పరిజ్ఞానాన్ని అందించేందుకు తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం 2023లో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించింది. ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ నుండి 2023-24 విద్యా సంవత్సరానికి 100 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లేఖను అందుకుంది.[2]

నిర్మాణం

[మార్చు]

ప్రభుత్వ వైద్య కళాశాలకకు 169 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ 2022 ఆగస్టు 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జీఓ ఎంఎస్ నెంబరు 99) జారీ చేసింది.[3][4]

ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ గ్రామంలో 25 ఎకరాల స్థలంలో 54 కోట్ల రూపాయలతో కళాశాల భవనం నిర్మించారు. మొదట 340 పడకల జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రి కోసం ఉద్దేశించబడిన ఈ భవనం, కళాశాల అవసరాలకు అనుగుణంగా ఎనిమిది బ్లాకులతో నిర్మించబడింది. ఈ కళాశాలకు అనుబంధంగా 330 పడకల ఆసుపత్రి కూడా నిర్మించబడింది.[5]

కోర్సులు - శాఖలు

[మార్చు]
 • అనాటమీ
 • ఫార్మాకాలజీ
 • ఫిజియోలాజీ
 • బయోకెమిస్ట్రీ
 • పాథాలజీ
 • మైక్రోబయోలాజీ
 • ఫోరెన్సిక్ మెడిసిన్
 • జెనరల్ సర్జరీ
 • ఆర్థోపెడిక్స్
 • ఓటో-రైనో-లారిగోలజీ
 • ఆప్తాల్మోలజీ
 • జనరల్ మెడిసిన్
 • టిబి & ఆర్‌డి
 • డివిఎల్
 • సైకియాట్రీ
 • పీడియాట్రిక్స్
 • ఓబిజీ
 • అనస్థీషియాలజీ
 • కమ్యూనిటీ మెడిసిన్
 • రేడియోడియాగ్నోసిస్
 • ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్
 • టీబీసీడీ
 • సీటీ సర్జరీ
 • న్యూరో సర్జరీ
 • న్యూరాలజీ
 • ప్లాస్టిక్‌ సర్జరీ
 • యూరాలజీ
 • గాస్ట్రోఎంట్రాలజీ
 • ఎండోక్రైనాలజీ
 • నెఫ్రాలజీ
 • కార్డియాలజీ
 • ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్
 • ఈఎన్‌టీ
 • ఆప్తల్
 • అనస్తీషియా
 • డెంటల్

తరగతుల ప్రారంభం

[మార్చు]

2023 సెస్టెంబరు 15 నుండి ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 9 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించాడు.[6][7] ఈ కార్యక్రమంలో కళాశాల నుండి కార్మిక శాఖామంత్రి సీహెచ్ మల్లారెడ్డి, ఆసిఫాబాదు ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "Govt medical colleges likely in Asifabad and Nirmal districts". www.deccanchronicle.com. 2022-03-07. Archived from the original on 2022-03-06. Retrieved 2023-09-13.
 2. Mustafa, Gulam (2023-04-10). "Two medical colleges in Kamareddy and Asifabad granted permission for academics". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-04-10. Retrieved 2023-09-13.
 3. Today, Telangana (2022-08-06). "Telangana govt sanctions Rs 1,479 cr to establish 8 more medical colleges". Telangana Today. Archived from the original on 2022-08-07. Retrieved 2023-09-21.
 4. Telugu, 10TV; naveen (2022-08-06). "8 New Medical Collges In Telangana : రాష్ట్రంలో మ‌రో 8 మెడిక‌ల్ కాలేజీలు.. ప‌రిపాల‌న అనుమ‌తులు జారీ చేసిన ప్ర‌భుత్వం". 10TV Telugu (in Telugu). Archived from the original on 2023-09-21. Retrieved 2023-09-21.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 5. Today, Telangana (2023-04-09). "NMC nod for classes at Asifabad medical college cheers students". Telangana Today. Archived from the original on 2023-04-09. Retrieved 2023-09-13.
 6. "KCR: వైద్య విద్యలో నవశకం.. 9 మెడికల్‌ కళాశాలలు ప్రారంభం". EENADU. 2023-09-15. Archived from the original on 2023-09-15. Retrieved 2023-09-21.
 7. telugu, NT News (2023-09-15). "CM KCR | ఒకేసారి 9 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం.. సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ ఘ‌ట్టం ఇది : సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-21.