ఆత్రం సక్కు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆత్రం సక్కు
ఆత్రం సక్కు


పదవీ కాలం
2009–2014, 2018 డిసెంబర్ 11 - ప్రస్తుతం
ముందు కోవ లక్ష్మీ
నియోజకవర్గం ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1973, మార్చి 2
లక్ష్మీపూర్, గిన్నెదారి, తిర్యాని మండలం, కొమరంభీం జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు రాజు - మంకుబాయి
జీవిత భాగస్వామి తులసి
సంతానం ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు (దివ్య లక్ష్మీ, వినోద్‌కుమార్‌, అంకిత్‌, అన్వేశ్‌, హిమ బిందు, జంగుబాయి) [1]

ఆత్రం సక్కు తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి (బి. ఆర్.యస్) పార్టీ తరపున ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3]

జననం, విద్య[మార్చు]

సక్కు 1973, మార్చి 2న రాజు - మంకుబాయి దంపతులకు కొమరంభీం జిల్లా, తిర్యాని మండలం, గిన్నెదారి సమీపంలోని లక్ష్మీపూర్ గ్రామంలో జన్మించాడు. వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం నుండి 1992లో గ్రాడ్యుయేట్ పూర్తిచేశాడు.[4]

వ్యక్తిగత జీవితం[మార్చు]

సక్కుకు తులసితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు (వినోద్‌కుమార్‌, అంకిత్‌, అన్వేశ్‌), ముగ్గురు కుమార్తెలు (దివ్య లక్ష్మీ, హిమ బిందు, జంగుబాయి) ఉన్నారు.

రాజకీయ విశేషాలు[మార్చు]

2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి 13వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.[5] తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మీపై 19వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6][7] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మీపై 171 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[8][9]

మూలాలు[మార్చు]

  1. Sakshi (29 April 2019). "డ్యాన్స్‌ చేస్తా.. డోలు వాయిస్తా.. : ఎమ్మెల్యే". Sakshi. Archived from the original on 7 June 2021. Retrieved 7 June 2021.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-02. Retrieved 2019-05-02.
  3. "Athram Sakku(Indian National Congress(INC)):Constituency- ASIFABAD (ST)(KUMARAM BHEEM ASIFABAD) - Affidavit Information of Candidate".
  4. "Athram Sakku | MLA | Asifabad | Komaram Bheem | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-15. Retrieved 2021-08-31.
  5. I & PR – 1999 Election Results (1999). "1999 Election Results" (PDF). Archived from the original (PDF) on 8 June 2022. Retrieved 8 June 2022.
  6. "To solve Adivasi problems joining in TRS: MLA Athram Sakku".
  7. https://www.deccanchronicle.com/amp/nation/politics/030319/2-congress-mlas-to-join-telangana-rashtra-samithi.html
  8. "Athram Sakku's gain may become Rekha Naik's loss - the New Indian Express".
  9. "Asifabad Election Result 2018 Live Updates: Candidate List, Winner, MLA, Leading, Trailing, Margin".