కోవ లక్ష్మీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోవ లక్ష్మి

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019-2024 ప్రస్తుతం
నియోజకవర్గం ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే

వ్యక్తిగత వివరాలు

జననం 1973, ఫిబ్రవరి 5
ఆదిలాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారత దేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు కోట్నాక భీమ్‌రావు
జీవిత భాగస్వామి సోనేరావు[1]
సంతానం కోవ సాయినాథ్ , అరుణ, మాన్విత
నివాసం ఆసిఫాబాద్

కోవ లక్ష్మీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఈమె సర్పంచ్, ఎంపీపీ, ఎంపీటీసీగా కూడా పని చేసింది. 2014లో ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా గెలిచింది. 2019లో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ గా ఎన్నికైంది.2024లో ఆసిఫాబాద్ శాసన సభ నియోజక వర్గం నుండి రెండో సారి ఎమ్మెల్యే గా విజయం సాధించింది.

కోవ లక్ష్మీ వారసత్వ రాజకీయలోంచే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె తండ్రి కొట్నాక్ భీంరావు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. అతను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పని చేశాడు.[2][3]

జననం[4][మార్చు]

కోవ లక్ష్మీ కొమురంభీం జిల్లా వాంకిడి మండలం, బంబర గ్రామంలో 1973, ఫిబ్రవరి 5 న జన్మించింది. ఈమె పదవ తరగతి వరకు ఆసిఫాబాద్ లో చదువుకుంది.[5]

రాజకీయ ప్రస్థానం[మార్చు]

కోవ లక్ష్మి 1995లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించింది. 1995లో తిర్యాణి మండలం, పంగిడీమాఎంపీటీసిగా, 2001లో ఎంపీపీగా గెలిచింది. 2006లో తెలుగు దేశం పార్టీ నుండి ఆసిఫాబాదు సర్పంచ్ గా గెలిచింది. 2010 తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరింది. 2013లో టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఆసిఫాబాదు సర్పంచ్ గా గెలిచింది. కోవ లక్ష్మీ 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు పై 19055 ఓట్ల మెజారిటీతో గెలిచి, శాసన సభ్యురాలు అయింది.. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలు ఆమె కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు చేతిలో 171 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. 2019లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో జైనూర్ జెడ్పీటీసీ స్థానం నుండి ఏకగ్రీవంగా ఎన్నికై, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ గా ఎన్నికైంది.[6]

కోవ లక్ష్మీ భారత రాష్ట్ర సమితి నుండి 2023 లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 83036 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి అజ్మేర శ్యాం నాయక్ పై విజయం సాధించి ప్రస్తుతం ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తుంది.[7][8][9]

మూలాలు[మార్చు]

  1. Sakshi (20 July 2014). "ఆమె వెనుక అతను." Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  2. డెక్కన్ క్రానికల్, Srinivas pillalamarri (20 April 2014). "Andhra Assembly polls: Two sisters to fight for MLA seat". Deccan Chronicle. Archived from the original on 13 September 2019. Retrieved 13 September 2019.
  3. News18 Telugu (19 November 2018). "నారిభేరి: ఆసిఫాబాద్‌లో కోవా లక్ష్మీ ఎన్నికల కథేంటి ?". News18 Telugu. Archived from the original on 13 September 2019. Retrieved 13 September 2019.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. ABN (2023-12-08). "Kumaram Bheem Asifabad: ఇది ప్రజల విజయం: ఎమ్మెల్యే కోవ లక్ష్మి". Andhrajyothy Telugu News. Retrieved 2024-04-08.
  5. Sakshi (14 July 2019). "భర్త సహకారం మరువలేనిది". Archived from the original on 31 జూలై 2021. Retrieved 31 July 2021.
  6. Namasthe Telangana (27 April 2021). "విజయానికి చిహ్నం గులాబీ జెండా". Namasthe Telangana. Archived from the original on 4 June 2021. Retrieved 4 June 2021.
  7. ABN (2023-12-08). "Kumaram Bheem Asifabad: ఇది ప్రజల విజయం: ఎమ్మెల్యే కోవ లక్ష్మి". Andhrajyothy Telugu News. Retrieved 2024-04-08.
  8. ABN (2023-12-08). "Kumaram Bheem Asifabad: ఇది ప్రజల విజయం: ఎమ్మెల్యే కోవ లక్ష్మి". Andhrajyothy Telugu News. Retrieved 2024-04-08.
  9. "కోవా లక్ష్మిఎన్నికల ఫలితం 2023 LIVE: ఆసిఫాబాద్ఫలితాల లెక్కింపు". telugu.news18.com. Retrieved 2024-04-08.