Jump to content

వాంకిడి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 19°31′06″N 79°19′45″E / 19.518375°N 79.3293°E / 19.518375; 79.3293
వికీపీడియా నుండి
వాంకిడి
—  మండలం  —
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, వాంకిడి స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, వాంకిడి స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, వాంకిడి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°31′06″N 79°19′45″E / 19.518375°N 79.3293°E / 19.518375; 79.3293
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం జిల్లా
మండల కేంద్రం వాంకిడి
గ్రామాలు 37
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 35,523
 - పురుషులు 17,724
 - స్త్రీలు 17,799
అక్షరాస్యత (2011)
 - మొత్తం 37.17%
 - పురుషులు 49.38%
 - స్త్రీలు 24.58%
పిన్‌కోడ్ 504295

వాంకిడి మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాద్ జిల్లా లో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఉట్నూరు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 37  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో నిర్జన గ్రామాలు రెండు ఉన్నాయి.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాబా- మొత్తం 35,523 - పురుషులు 17,724 - స్త్రీలు 17,799

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 340 చ.కి.మీ. కాగా, జనాభా 35,523. జనాభాలో పురుషులు 17,724 కాగా, స్త్రీల సంఖ్య 17,799. మండలంలో 7,823 గృహాలున్నాయి.[3]

వ్యవసాయం, పంటలు

[మార్చు]

మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 11264 హెక్టార్లు, రబీలో 4243 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[4]

మండల ప్రముఖులు

[మార్చు]
కొండా లక్ష్మణ్ బాపూజీ - వాంకిడి మండలం వాంకిడి గ్రామంలో జన్మించాడు. మాజీ శాసన సభ్యుడు.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. ధాబా
  2. సావతి
  3. చిచ్‌పల్లి
  4. చౌపన్‌గూడ
  5. గుంజాడ
  6. సొనాపూర్
  7. మహాగావ్
  8. గోగావ్
  9. బంబర
  10. ఖేదేగావ్
  11. వెల్గి
  12. సర్కేపల్లి
  13. ఖమన
  14. జంబుల్‌ధారి
  15. కన్నెరగావ్
  16. కోమటిగూడ
  17. జైత్‌పూర్
  18. బంబార
  19. సామెల
  20. బోర్దా
  21. నార్లపూర్
  22. సరంది
  23. ఖిర్ది
  24. ఘాట్‌జనగావ్
  25. తేజాపూర్
  26. ఇంధని
  27. నావెగావ్
  28. చించోళి
  29. అర్లి
  30. లంజన్‌వీర
  31. వాంకిడి (ఖుర్ద్)
  32. నీంగావ్
  33. అకిని
  34. నుకెవాద (యుఐ)
  35. వాంకిడి (కలాన్)

గమనిక: నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు.

విద్య సదుపాయాలు:

మండలంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలు రెండు , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలు ఒకటి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకటి. అనియత పాఠశాల ఆసిఫాబాద్ లోను, పాలిటెక్నిక్ కళాశాల బెల్లంపల్లి లోను, ఇంక పై చదువులకు ఆదిలాబాద్ లోను, మంచిర్యాల లోను

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 137
  5. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటి ప్రచురణ, 2006, పేజీ 40

వెలుపలి లంకెలు

[మార్చు]