ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజను
ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కొమరంభీం |
అసిఫాబాద్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, కొమంరం భీం జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. కొమరంభీం జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 8 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం ఆసిఫాబాద్‌లో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది. ఈ రెవెన్యూ డివిజను ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోని, ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.
వివరాలు
[మార్చు]ఐఏఎస్ క్యాడర్లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[2]
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ రెవెన్యూ డివిజన్ లో మొత్తం 2,65,641 జనాభా ఉంది.
పరిపాలన
[మార్చు]ఆసిఫాబాద్ డివిజనులోని మండలాలు:[3]
క్ర.సం | ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | సిర్పూర్ (యు) మండలం | 18 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు) |
2 | లింగాపూర్ మండలం | 11 రెవెన్యూ గ్రామాలు |
3 | జైనూర్ మండలం | 18 రెవెన్యూ గ్రామాలు |
4 | తిర్యాని మండలం | 39 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు) |
5 | ఆసిఫాబాద్ మండలం | 52 రెవెన్యూ గ్రామాలు |
6 | కెరమెరి మండలం | 46 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు) |
7 | వాంకిడి మండలం | 37 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు) |
8 | రెబ్బెన మండలం | 27 రెవెన్యూ గ్రామాలు |
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Revenue Divisions | Kumuram Bheem Asifabad District | India". Archived from the original on 2022-01-27. Retrieved 2022-03-08.
- ↑ "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2022-03-08.