Jump to content

లింగాపూర్ మండలం (కొమరంభీం జిల్లా)

వికీపీడియా నుండి
లింగాపూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, లింగాపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, లింగాపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, లింగాపూర్ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం జిల్లా
మండల కేంద్రం లింగాపూర్
గ్రామాలు 11
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా
 - మొత్తం {{{population_total}}}
 - పురుషులు {{{population_male}}}
 - స్త్రీలు {{{population_female}}}
పిన్‌కోడ్ 504313

లింగాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] ఇందులో 11 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఉట్నూరు డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన ఆదిలాబాద్ నుండి 90 కి. మీ. దూరంలో కుమరం భీం జిల్లా నుండి 70 కి.మీ గాను ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు లింగాపూర్ గ్రామం అనేది ఆదిలాబాదు జిల్లా, సిర్పూర్ గ్రామీణ మండలంలో భాగంగా ఉండేది. కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా సిర్పూర్ గ్రామీణ మండలం నుండి కొన్ని గ్రామాలను విడదీసి లింగాపూర్ కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేసి, ఈ మండలాన్ని కుమరంభీం జిల్లాలో చేర్చారు .ఇది ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం పరిధిలోని భాగం.ఈ మండలంలో 11  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

గణాంకాలు

[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 161 చ.కి.మీ. కాగా, జనాభా 12,477. జనాభాలో పురుషులు 6,215 కాగా, స్త్రీల సంఖ్య 6,262. మండలంలో 2,840 గృహాలున్నాయి.[4]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. చొర్పల్లి
  2. వంకమద్ది (సిర్పూర్ గ్రామీణ)
  3. ఘుమ్నూర్ (లింగాపూర్)
  4. ఘుమ్నూర్ (బుజుర్గ్)
  5. కంచన్‌పల్లి
  6. కొత్తపల్లి
  7. మామిడిపల్లి
  8. లింగాపూర్
  9. యెల్లపాతర్
  10. జముల్‌ధార
  11. లొడ్డిగూడ

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  • పిట్టగూడ
  • మొతి పాటార్
  • కన్నేపల్లి
  • నాగుగూడ
  • సిడంగూడ

విద్య సదుపాయాలు:

లింగాపూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉంది. ఒక ప్రైవేటు పాఠశాలల కలదు.

రవాణా, సమాచార సౌకర్యాలు:

లింగాపూర్ నుండి జిల్లా కేంద్రం ఆసిఫాబాదుకు ప్రతి రోజు పల్లెవెలుగు బస్సు సౌకర్యం మాత్రమే కలదు. ప్రైవేటు సౌకర్యాలు కావాలంటే మండలానకి 20 కి.మీ లు ఆపైన దూరంలో కలవు. రైలు సౌకర్యం మండలానకి 70 కి.మీ, 80 కి.మీ లేదా ఆపైన కి.మీ దూరం లో కలదు. విమానశ్రయం సౌకర్యం రాష్ట్రరాజధాని హైదరాబాద్ లోను పక్క రాష్ట్రం అయిన మహారాష్ట్ర నాగ్ పూర్ లోను కలదు.

పోష్టాఫీసు గ్రామంలోనే కలదు. ఇంటర్నెట్ కైప్ సదుపాయం కలదు. కోరియర్ కార్గో సేవలు మండలానకి 10

కి.మీ. దూరం లేదా అంతకైన పైన దూరంలో కలదు.

మార్కెటింగ్ మరియు బ్యాంకింగ్:

మండలంలో వారం వారం సంత ఉండును, వేరే రోజుల్ల సమీప పట్టణాలకు వేలేదారు. అలాగే బ్యాంకింగ్ సేవలు

మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ద్వార అందిస్తారు.

విద్యుత్ సదుపాయం:

మండలంలో రోజుకు 5 గంటల విద్యుత్ సరఫరాల కలదు. వ్యవసాయానికి 10 గంటల రోజుకు సరఫరా

పర్యాటక ప్రాంతాలు:

సప్తగుండల జలపాతం

వ్యవసాయ పంటలు:

లింగాపూర్ మండలంలో ప్రధాన పంటలు పత్తి, కంది,జొన్న, మొక్కజొన్న, సోయబీన్

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]