నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాల
రకం | ప్రభుత్వ వైద్య విద్య |
---|---|
స్థాపితం | 2018 |
అనుబంధ సంస్థ | కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం |
విద్యార్థులు | 150 |
స్థానం | నల్లగొండ, నల్లగొండ జిల్లా, తెలంగాణ, భారతదేశం |
నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాల అనేది తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, నల్లగొండ పట్టణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల.[1] గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఔత్సాహిక వైద్య విద్యార్థులకు వైద్య పరిజ్ఞానాన్ని అందించేందుకు తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం 2018లో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించింది. ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ నుండి 2019-20 విద్యా సంవత్సరానికి 150 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లేఖను అందుకుంది.
కళాశాల భవనం
[మార్చు]నల్లగొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్డు ఎస్‌ఎల్‌బీసీ ప్రాంతంలో సుమారు 42 ఎకరాల సువిశాల స్థలంలో 275 కోట్ల రూపాయలతో వైద్య కళాశాల నిర్మించబడుతోంది. 117కోట్ల రూపాయలతో నాలుగంతస్థుల భవన నిర్మాణం, మరో 30 కోట్ల రూపాయలతో వైద్య పరికరాలు, విద్యార్థిని విద్యార్థులకు హాస్టల్ సముదాయాలు, కళాశాలకు అనుగుణంగా మరో 5 ఎకరాల్లో 40 కోట్ల రూపాయలతో నాలుగు ఫ్లోర్లతో నర్సింగ్ కళాశాలను నిర్మిస్తున్నారు.[2]
కళాశాల భవన నిర్మాణంలో ఉండడంవల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పాత భవనంలో తరగతులను నిర్వహిస్తున్నారు. పాత భవనాన్ని ఆధునికీకరించడానికి ప్రభుత్వం 7 కోట్ల 77లక్షల రూపాయలు విడుదలచేసింది.[3]
ఆసుపత్రి
[మార్చు]1967లో నల్గొండ పట్టణంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఏర్పాటుచేయబడి, ఆ తరువాత జిల్లా ప్రభుత్వ వైద్యశాలగా మార్చబడింది. ప్రస్తుతం ఇందులో 550 పడకలు, 30 అత్యవసర చికిత్స పడకలు ఉన్నాయి. ఈ ఆసుపత్రికి అనుబంధంగా ఈ ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేయబడింది.
కోర్సులు - శాఖలు
[మార్చు]- అనాటమీ
- ఫార్మాకాలజీ
- ఫిజియోలాజీ
- బయోకెమిస్ట్రీ
- పాథాలజీ
- మైక్రోబయోలాజీ
- ఫోరెన్సిక్ మెడిసిన్
- జెనరల్ సర్జరీ
- ఆర్థోపెడిక్స్
- ఓటో-రైనో-లారిగోలజీ
- ఆప్తాల్మోలజీ
- జనరల్ మెడిసిన్
- టిబి & ఆర్‌డి
- డివిఎల్
- సైకియాట్రీ
- పీడియాట్రిక్స్
- ఓబిజీ
- అనస్థీషియాలజీ
- కమ్యూనిటీ మెడిసిన్
- రేడియోడియాగ్నోసిస్
- ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్
- టీబీసీడీ
- సీటీ సర్జరీ
- న్యూరో సర్జరీ
- న్యూరాలజీ
- ప్లాస్టిక్ సర్జరీ
- యూరాలజీ
- గాస్ట్రోఎంట్రాలజీ
- ఎండోక్రైనాలజీ
- నెఫ్రాలజీ
- కార్డియాలజీ
- ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్
- ఈఎన్‌టీ
- ఆప్తల్
- అనస్తీషియా
- డెంటల్
తరగతుల ప్రారంభం
[మార్చు]150 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతినిస్తూ 2019 మే 29న నేషనల్ మెడికల్ కమిషన్ నుండి లేఖ వచ్చింది. కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సూపరిం టెండెంట్‌లు, నియామకం పూర్తవగా, హెడ్‌నర్సులు, స్టాఫ్ నర్సులు, ఇతర పారామెడికల్, నాన్ పారా మెడికల్ సిబ్బంది నియామకం కూడా పూర్తయ్యింది.[4] 2019లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ India, The Hans (2022-07-27). "Construction of medical college in Nalgonda begins today". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-11-22. Retrieved 2022-11-22.
- ↑ ABN (2022-09-04). "వైద్య కళాశాల పనులు ముమ్మరం". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-22. Retrieved 2022-11-22.
- ↑ "మెడికల్ కళాశాల ముస్తాబు". Sakshi. 2019-01-15. Archived from the original on 2019-01-15. Retrieved 2022-11-22.
- ↑ "నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ ఉద్యోగాలు". education.sakshi. 2022-04-05. Archived from the original on 2022-11-22. Retrieved 2022-11-22.
ఇతర లంకెలు
[మార్చు]- నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాల అధికారిక జాలగూడు Archived 2022-11-22 at the Wayback Machine