బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్
బొమ్మగాని ధర్మబిక్షం గౌడ్ | |||
![]() మాజీ ఎంపీ, నల్గొండ | |||
నియోజకవర్గము | నల్గొండ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1922, ఫిబ్రవరి, 15 మునుగోడు మండలం ఊకొండి గ్రామం నల్లగొండ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ | 1922 ఫిబ్రవరి 15 /||
మరణం | మార్చి 26, 2011 | ||
రాజకీయ పార్టీ | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | ||
జీవిత భాగస్వామి | అవివాహితుడు | ||
సంతానము | బొమ్మగాని ప్రభాకర్(దత్తత) | ||
మతం | హిందూ మతం |
బొమ్మగాని ధర్మబిక్షం ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు. ఈయన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున నల్గొండ లోకసభ నియోజకవర్గం ఎమ్.పి.గా 10, 11వ లోక్ సభ సభ్యులుగా పనిచేశారు. ఈయన నల్లగొండ జిల్లాలోని మునుగోడు మండలం, ఊకొండి గ్రామంలో బొమ్మగాని ముత్తి లింగయ్య గౌడ్, పద్మ దంపతులకు 1922 ఫిబ్రవరి 15లో జన్మించారు. బొమ్మగాని ధర్మబిక్షం తండ్రి చిన్నవయస్సులో మునుగోడు మండలం ఊకొండి నుండి సూర్యాపేటకు వచ్చి స్థిరపడ్డారు.[1]
విషయ సూచిక
విద్యార్థి జీవితం[మార్చు]
ధర్మభిక్షం విద్యార్థి దశలోనే జాతీయ భావాలు అలవరుచుకున్నారు. నిజాం పట్టాభిషేక రజతోత్సవాల సందర్భంగా పాఠశాలలో ఉత్సవాలు జరపాలన్న ప్రధానోపాధ్యాయుడి ఆదేశాలను వ్యతిరేకించి తోటి విద్యార్థులతో కలిసి బహిష్కరించారు. సామాజిక రుగ్మతలపై పోరాడటం కోసం తన సహ విద్యార్థులకు శిక్షణనివ్వటానికి విరాళాలు సేకరించి ఒక వసతిగృహం ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టుపార్టీ పట్ల ఆకర్షితులైన ధర్మభిక్షం 1942లో సీపీఐలో చేరారు. పార్టీలో పనిచేస్తూనే పాత్రికేయునిగా తెలంగాణలోని నాటి ప్రముఖ పత్రికలైన మీజాన్, రయ్యత్, గోల్కొండల్లో పనిచేశారు. నిజాంపై సాయుధపోరాటం మొదలైన తర్వాత తుపాకి చేతబట్టి యుద్ధరంగంలోకి దిగారు. సాయుధపోరాటాన్ని విస్తరింపజేశారు. ఈ క్రమంలో అరెస్త్టే ఐదేళ్లకుపైగా జైలుశిక్షను అనుభవించారు.[2]
చదువు[మార్చు]
- మెట్రిక్యులేషన్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సూర్యాపేట.
- అలిగ్రా యూనివర్సటీ కోర్స్, సూర్యాపేట.
వివాహం[మార్చు]
- అవివాహితుడు
- సోదరుని కుమారున్ని దత్తత తీసుకున్నారు.
వృత్తి[మార్చు]
సామాజిక కార్యకర్త, కార్మికులు, వ్యాపార సంఘం సభ్యులు, పాత్రికేయులు.
రాజకీయ జీవితం[మార్చు]
స్వాతంత్య్రం అనంతరం 1952లో తొలిసారిగా హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు సూర్యాపేట నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 1957లో నకిరేకల్ నుండి, 1962లో నల్గొండ నుండి ప్రాతినిధ్యం వహించారు. 1991లో, 1996లోనూ ఆయన ఎంపీగా నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 1996 లో 11వ లోక్‌సభ ఎన్నికలలో నల్లగొండనుండి 480 మంది ఫ్లోరైడ్ బాధితులు పోటీ చేసినప్పటికి ఆయన 76 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడు. గీత పనివారల సంఘం ఏర్పాటు చేసి గౌడ కులస్తుల హక్కుల కోసం ఆయన చివరివరకు పోరాడారు. పలు కార్మిక సంఘాల స్థాపనలో ధర్మబిక్షం ప్రధాన పాత్ర వహించి ‘కార్మిక పక్షపాతి’గా గుర్తింపు తెచ్చుకున్నారు.
పదవులు[మార్చు]
- 1951-73లో కార్యదర్శి, భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) జిల్లా మండలి, నల్గొండ.
- 1952-57లో శాసనసభ్యులు, హైదరబాద్ శాసనసభ (
- 1957-62, 1962-67 శాసన సభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ.
- 1972 నుంచి కార్యవర్గ సభ్యులు, సిపిఐ, ఆంధ్రప్రదేశ్.
- 1991లో 10వ లోక్ సభ స్థానానికి ఎన్నిక.
- 1991-96 సభ్యులు, సంప్రదింపుల కమిటీ, గ్రామీణాభివృద్ధి శాఖ.
- 1992-95 కార్యదర్శివర్గ సభ్యులు, రాష్ట్ర సమితి, సిపిఐ, ఆంధ్రప్రదేశ్
- 1996 లో 11వ లోక్ సభ స్థానానికి రెండవసారి ఎన్నిక
- సభ్యులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ), జాతీయ మండలి.
సాంఘీక, సాంస్కృతిక కార్యక్రమాలు[మార్చు]
- భారత ప్రభుత్వం నుంచి తామ్రపత్ర పురస్కారం అందుకున్నారు.
- గ్రామీణ పేదలు హక్కుల కోసం పోరాటం,, ఈత, యువత మరియు విద్యార్థులు అసంఘటిత కార్మికుల సంఘటితం, మరియు పేదలకోసం భూమి మరియు ఇళ్ళు కొనుగోలు.
విదేశి పర్యటనలు[మార్చు]
- U.S.S.R.
ఇతర వివరాలు[మార్చు]
స్వాతంత్ర్య సమరయోధులు, నల్గొండలో కార్మిక సంఘాలు వ్యవస్థాపకులు, అధ్యక్షుడు, అఖిల భారతదేశ గీత కార్మిక కర్జాజ్మరియు పనివారల ఫెడరేషన; ఆర్య సమాజ్ ఆర్గనైజర్ మరియు ఆంధ్ర మహాసభ కార్యకర్త.
కాలక్షేపం పఠనం, పర్యటన మరియు సాంఘికీకరణ
క్రీడలు హాకీ మరియు యోగ
ఎన్నికల ఫలితాలు[మార్చు]
- మెత్తం ఓట్లు 14,27,026
- పోలైన ఓట్లు 8,51,118
ఒక్కొక్కరికి వచ్చిన ఓట్లు
- శ్రీ బొమ్మగాని ధర్మబిక్షం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 2,77,336
- శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి భారతీయ జనతా పార్టీ 2,05,579
- శ్రీ గంగాధర్ తిరునగరూ భారత జాతీయ కాంగ్రెస్ 1,99,282
- శ్రీ వెంరెడ్డి నరేందర్ రెడ్డి ఎన్.టి.ఆర్. (టి.డి.పి) 22,994
మరణం[మార్చు]
ఇంట్లో జారి పడటంతో ఆయన తుంటి ఎముకకు దెబ్బతగిలింది. హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో ఫిబ్రవరి 11న శస్త్రచికిత్స జరిపారు. తర్వాత తేరుకున్నప్పటికీ వూపిరితిత్తుల సమస్య జఠిలం కావటంతో చికిత్స పొందుతూ2011మార్చి 26న ఆయన తుదిశ్వాస వదిలారు. ఆయన వయసు 89 ఏళ్లు.
విగ్రహావిష్కరణ[మార్చు]
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ గ్రామంలో 8 నవంబర్ 2019 రోజున బొమ్మగాని ధర్మభిక్షం విగ్రహాన్ని ఎక్సైజ్‌శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.[3][4]
వనరులు[మార్చు]
- ↑ లోకసభ జాలగూడు
- ↑ సాక్షి, పాలిటిక్స్ (15 March 2019). "అసామాన్య...సామాన్యుడు!". Sakshi. మూలం నుండి 5 November 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 5 November 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణా తాజావార్తలు (8 November 2019). "సంస్థాన్ నారాయణపూర్‌లో బొమ్మగాని ధర్మభిక్షం విగ్రహం ఏర్పాటు". www.andhrajyothy.com. మూలం నుండి 11 November 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 11 November 2019.
- ↑ ఈనాడు, సూర్యాపేట (09 November 2019). "ధర్మభిక్షం చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి - EENADU". www.eenadu.net (ఆంగ్లం లో). మూలం నుండి 11 November 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 11 November 2019. Check date values in:
|date=
(help)
- CS1 ఆంగ్లం-language sources (en)
- 1922 జననాలు
- 10వ లోక్‌సభ సభ్యులు
- 11వ లోక్‌సభ సభ్యులు
- తెలంగాణ సాయుధ పోరాట యోధులు
- తెలంగాణా విముక్తి పోరాట యోధులు
- సూర్యాపేట జిల్లా రాజకీయ నాయకులు
- 2011 మరణాలు
- కమ్యూనిస్టు నాయకులు
- నల్గొండ జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
- నల్గొండ జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు