దేవరకొండ
దేవరకొండ, తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన పట్టణం.
ఈ పట్టణానికి సంబంధించిన చర్చ ముఖ్యంగా కాకతీయుల కాలం నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది.ఈ పట్టణానికి దగ్గరలోనే ఒక ప్రాచీన దుర్గము ఉంది.ఆ దుర్గం పేరుతోనే దేవరకొండ అని పిలువబడుతుంది.
విషయ సూచిక
చరిత్ర[మార్చు]
ఈ పట్టణానికి సంబంధించిన చర్చ ముఖ్యంగా కాకతీయుల కాలం నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది.ఈ పట్టణానికి దగ్గరలోనే ఒక ప్రాచీన దుర్గము ఉంది.ఆ దుర్గం పేరుతోనే దేవరకొండ అని పిలువబడుతుంది.
ఒకానొకప్పుడు దుర్భేధ్యమైన ఈ రేచర్ల నాయకుల కోట ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఇది ఒక ముఖ్య చూడదగిన పురాతన ప్రదేశం. ఈ దుర్గము ఏడుకొండల మధ్యన ఉంది. నల్గొండ, మహబూబ్ నగర్, మిర్యాలగూడ, హైదరాబాదు నుండి రోడ్డు మార్గమున ఇక్కడ చేరవచ్చును.
మధ్యయుగంలో ఈ గ్రామం స్థానిక వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది.[1]
శాసనసభ నియోజకవర్గం[మార్చు]
దేవరకొండ ఆలయాలు[మార్చు]
1.పాత శివాలయం
2.పాత రామాలయం
3.శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం
4.సంతోషిమాత ఆలయం
5.శ్రీ భక్త మార్కెండయ దేవాలయం
6.సాయిబాబా ఆలయం: ప్రశాంతమైన వాతావరణం, విశాలమైన ప్రాంగణంలో దేవరకొండ వాస్తవ్యులు నిర్మించిన సాయిబాబా ఆలయం మనస్సుకు, ఆత్మకు యెంతో హాయిని కలిగిస్తుంది. ఈ ఆలయం షిరిడి ఆలయమునకు ఏ మాత్రం తీసిపోదు.
7.అయ్యప్ప స్వామి ఆలయం
8.పెద్దదర్గా: ఈ దర్గా ఉర్సు డిండి మండలం ఎర్రారం గ్రామం నుంచి గంధాన్ని తీసుకువచ్చి ఊరేగింపు నిర్వహిస్తారు.
సకలజనుల సమ్మె[మార్చు]
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
ప్రముఖులు[మార్చు]
- అలీ సయ్యద్ - ప్రముఖ రచయిత
మూలాలు[మార్చు]
- ↑ కంభపు, వెంకటేశ్వర ప్రసాద్ (1999). మధ్యయుగ ఆంధ్రదేశ ఆర్థిక చరిత్ర (క్రీ.శ.1000 - 1323). p. 85. Retrieved 11 May 2019.