Jump to content

రేచర్ల రెడ్డి వంశీయులు

వికీపీడియా నుండి

గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
చరిత్ర పూర్వ యుగము క్రీ.పూ.1500వరకు
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.శ.650
మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.పూ.322
మౌర్యులు క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులు క్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులు క్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు 210 – 300
బృహత్పలాయనులు 300 – 350
ఆనంద గోత్రీకులు 295 – 620
శాలంకాయనులు 320 – 420
విష్ణుకుండినులు 375 – 555
పల్లవులు 400 – 550
పూర్వమధ్య యుగము 650 – 1320
మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు 624 – 1076
పూర్వగాంగులు 498 – 894
చాళుక్య చోళులు 980 – 1076
కాకతీయులు 750 – 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320–1565
ముసునూరి నాయకులు 1333–1368
ఓఢ్ర గజపతులు 1513
రేచెర్ల పద్మనాయకులు 1368–1461
కొండవీటి రెడ్డి రాజులు 1324–1424
రాజమహేంద్రవరం రెడ్డి రాజులు 1395–1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము 1336–1565
ఆధునిక యుగము 1540–1956
అరవీటి వంశము 1572–1680
పెమ్మసాని నాయకులు 1423–1740
కుతుబ్ షాహీ యుగము 1518–1687
నిజాము రాజ్యము 1742–1948
బ్రిటిషు రాజ్యము
స్వాతంత్ర్యోద్యమము 1800–1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 1912–1953
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు 1948–1952
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ 1953–1956
ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 1956–2014
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 2014-
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాథ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము21వ శతాబ్ది
చారిత్రక నగరాలు
పిఠాపురంభట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురిరాజమహేంద్రవరం
కళింగపట్నంహంపిసింహపురిహైదరాబాదు
చారిత్రక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు

రేచర్ల రెడ్డి రాజులు, చక్కని ప్రతిభా పాటవాలతో, స్వామి భక్తితో కాకతీయ వంశీయుల వద్ద చాలా పలుకుబడికలిగి, మంత్రులుగా, సామంతులుగా, మహా సామంతులుగా ఉన్నారు. వీరు ముఖ్యముగా నల్గొండ లోని ఆమనగల్లు, పిల్లలమర్రి, మిర్యాలగూడ, నాగులపాడు, సోమవరం: వరంగల్లు ప్రాంతము లోని ఎలకుర్తి, ములుగు, నర్సంపేట, మాచాపూరు, కరీంనగర్ ప్రాంతము లోని హుజూరాబాదు ప్రాంతాలను పరిపాలించారు.

దేవాలయ నిర్మాణము

[మార్చు]

ఈ వంశజులు అనేక దేవాలయములు నిర్మించారు. వీరి ప్రధానముగా శైవమత అవలంబీకులు. వీరు నిర్మించిన దేవాలయములు

మత విషయములు

[మార్చు]

తమ ప్రభువులైన కాకతి వంశము వలే వీరు కూడా శైవ మతము ఆరాధించారు.

నీటి పారుదల సౌకర్యములు

[మార్చు]

ప్రజల ముఖ్య ఆధారము వ్యవసాయము. దాని అభివృద్ధి కోసం తద్వారా దేశ అభివృద్ధి కోసం వీరు చాలా తటాకములు నిర్మించారు ఈసంఖ్య వందలలోనే ఉంటుంది, కొన్ని చూడండి లోక సముద్రము, ఎఱక సముద్రము, మూసేటి కాలువలు, నామ సముద్రము, విశ్వనాథ సముద్రము, నాగ సముద్రము, చింతల చెఱువు, నేరెడ్ల చెఱువు, కత్యాకె చెఱువు, గుడ్ల చెఱువు, గౌర సముద్రము, సబ్బి సముద్రము, లక్ష్మీ సముద్రము, ఎర్రమరాజు కుంట, బొమ్మాయి కుంట కాలువ, రాజెనాయకుని చెఱువు, ఏలేశ్వరము కాలువ, చవుట కాలువ, పడాల చెఱువు, రామప్ప చెఱువు, కామ సముద్రము, మేడ సముద్రము వంటి అనేక చెరువులూ, కాలలు తవ్వించారు.

దుర్గములు లేదా కోటలు

[మార్చు]

వీరికి అమనగల్లు, పిల్లల మర్రి, ఉండ్రుగొండ, ఉర్లు కొండ, వాడ్వల్లి, ఎలకుర్తి మొదలగు దుర్గములు ఉన్నాయి.

పరకామణి

[మార్చు]

పరకామణి, లేదా ఈ కాలమునాటి నాణెములు వీటిని నిష్కమ అను బంగారునాణెములుగా ఉండెడివి. ఆ తరువాత రూక, అడ్డుగ, వీసము, చిన్నము అను నాణెములు ఉండెడివి.నిష్కము = మాడ = బంగారు నాణెము రూక = వెండి నాణెము పది రూకలు = ఒక మాడఅడ్డుగ = అర్థ = 1/2 రూక పాదిక = పాతిక = 1/4 రూక వీసము, చిన్నము, రూకలోని భాగములు.

ఓ విషయము గమనీచినారా? ఇప్పటికీ ఈ వొకాబులరీ లేదా పదములు తెలుగువారిని వదలలేదు ఉదాహరణకు రూక, రూపాయ లాగా ద్వనించడములేదు! వీసమెత్తు బంగారం కూడా ఇవ్వను - అను వాడు కలదు కదా (అంటే ఇప్పటి భాషలో నయాపైసా కూడా ఇవ్వను అని ) మాడలు జానపద కథలలో మాత్రము మిగిలినట్లున్నాయి.

సైనిక విశేషములు

[మార్చు]

వీరు సైన్యమును స్వంతముగా పోషించి, కాకతి వంశజులకు తలలో నాలుకగా ఉండేవారు. అనేక సమయములో వీరు చాలా ప్రముఖ భూమికను పోషించారు, ముఖ్యముగా మొదటి బేతరాజు కంచి దండయాత్రలోనూ, రుద్రదేవ మహారాజు మరణాంతరము గణపతిదేవ మహారాజు నకు రాజ్యమునప్పగించడములోనూ, వీరి పాత్ర చాలా ముఖ్యమైనది.

వీరు స్వంత సైన్యముతో పాటుగా తమ తమ దుర్గములందు సైన్యము పెంచేవారు, ఈ సైన్యమును దుర్గాదిపతులు చూసేవారు, వారు దుర్గము అధీనములోని గ్రామాలనుండి పన్నులు వసూలు చేసేవారు. ఓ చిన్న విషయము ఏమిటంటే, ఈ కాలములో పన్నులు ఎక్కువగానే ఉండెడివి అని తెలుస్తుంది, కాకపోతే పాడి పంటలు, చాలా సమృద్దిగా ఉండుటవల్ల ప్రజలు సుఖశాంతులతోనే ఉన్నారు, అదియే కాకుండా వీరు వ్యవసాయమును చాలా బాగుగా పోషించారు అని చెప్పుకున్నాము కదా!

వీరు సైనికులకు జీతములు ఇచ్చేవారు. యుద్ధములందు విజయము సాధించిన పిదప వీరులకు సన్మానములు జరిపేవారు. సైన్యమునందు ఉన్నత పదోన్నతులతో పాటు రకరకాలైన కానుకలూ ఇతర బహుమతులూ ఇచ్చేవారు.

అసి, ముసల, కణయ, కంపణ, ముద్గర, తోమర, భిండివాల, క్రకచ, నారాచ, ముషిండి మొదలైన పేర్లతో సైన్యమును విభజించేవారు, ఇది ఇప్పటి మన రకరకాల ప్రమోషను పద్ధతివంటిది అనుకోవచ్చు.

చూడండి

[మార్చు]