నర్సంపేట మండలం (వరంగల్ గ్రామీణ జిల్లా)

వికీపీడియా నుండి
(నర్సంపేట నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

నర్సంపేట మండలం,తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన మండలం [1].[2]

నర్సంపేట
—  మండలం  —
వరంగల్ జిల్లా పటములో నర్సంపేట మండలం యొక్క స్థానము
వరంగల్ జిల్లా పటములో నర్సంపేట మండలం యొక్క స్థానము
నర్సంపేట is located in తెలంగాణ
నర్సంపేట
నర్సంపేట
తెలంగాణ పటములో నర్సంపేట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°55′35″N 79°53′49″E / 17.926394°N 79.896941°E / 17.926394; 79.896941
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్
మండల కేంద్రము నర్సంపేట
గ్రామాలు 12
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 67,239
 - పురుషులు 33,898
 - స్త్రీలు 33,341
అక్షరాస్యత (2011)
 - మొత్తం 59.85%
 - పురుషులు 72.12%
 - స్త్రీలు 47.13%
పిన్ కోడ్ {{{pincode}}}

ఇది రెవిన్యూ డివిజన్ హోదా కలిగిన నగర పంచాయితీ,

గణాంకాలు[మార్చు]

2011భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా  - మొత్తం 67,239 - పురుషులు 33,898 - స్త్రీలు 33,341

నర్సంపేట సమాచారం[మార్చు]

'నర్సంపేట్ సిటీ (Narsampet City)' వరంగల్ జిల్లా కేంద్రానికి 40కి.మి.ల దూరంలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో నర్సంపేట్ ఒకటి. పూర్వం ఈ పట్టణాన్ని పాఖాల తాలూకాలో ఓ గ్రామముగా భావించారు, కాల క్రమేన పెద్ద గ్రామంగా, పట్టణంగా రూపాంతరం చెందింది. ఇటివల చేసిన జిల్లాల విభజనలో నర్సంపేట్ డివిజన్ వరంగల్ రూరల్ జిల్లాలోకి వెళ్ళింది. దీంతో జిల్లాలో పెద్ద నగరంగా అవతరించింది. ఒక విధంగా జిల్లా కేంద్రంగా మారబోతుంది. డివిజన్ కేంద్రమైన నర్సంపేట్ పరిధిలోనికి చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపురం, నల్లబెల్లి,నర్సంపేట్,నెక్కొండ మండలాలు వస్తాయి. ప్రస్తుతం సుమారు 50వేల జనాభాతొ దినదినాభివృద్ధి చెందుతుంది. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నర్సంపేట్ ను పురపాలక (నగర పంచాయతి) గా గుర్తించింది. ఈ పట్టణంలో బస్సు డిపో ఉండగా ఆర్థికంగా ముందుకు సాగుతుంది.ఈ ప్రాంతం నుండి హైదరాబాదు, వరంగల్, కరీంనగర్,నిజామబాద్,ఖమ్మం, కామారెడ్డి, మంచిర్యాల,భద్రాచలం,గోదావరిఖని,నిర్మల్, రామగుండం, కొత్తగూడెం వంటి ప్రాంతాలకు మరియు బాసర, యాదగిరి,వేములవాడ,శ్రీశైలం,కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రలకు రోడ్డు రవాణ ఉంది. మహారాష్ర్ట లోని సిరొంచ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట (తిరుపతి)కి వెళ్లే జాతీయ రహదారి - 365 నర్సంపేట్ డివిజన్ లోని మల్లంపల్లిలో ప్రారంభమై నల్లబెల్లి మండలంలోని పలు గ్రామాలతో పాటు నర్సంపేట్ అర్బన్, రూరల్ మండలాలు, ఖానాపురం, మహబూబాబాద్ జిల్లా గూడురు, మహాబూబాబాద్ అర్బన్, రూరల్, మర్రిపేడల మీదుగా వెల్తుంది. నర్సంపేట్ సిటికి ముందు హనుమాన్ తండా వద్ద టోల్ ప్లాజాను ఏర్పాటు చేస్తున్నారు. నర్సంపేట్ నగరానికి 9కిలోమీటర్ల దూరంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాఖాల సరస్సు మరియు దట్టమైన అభయారణ్యం ఉంది. ఈ సరస్సు చందాలు అటవి అందాలు ఎంతో భాగుంటాయి. పట్టణం లోని మాధన్నపేట సరస్సు కూడా చూడదగిన ప్రదేశం. తెలంగాణ రాష్ట్రంలోనే శబరిగా పేరుగాంచిన శ్రీ ధర్మశాస్త అయ్యప్ప దేవాలయము ఇక్కడ గలదు. ప్రతి యేటా శబరిలో నిర్వహించిన మాదిరిగా ఇక్కడ కూడా పంబారట్టు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలోనే అతి పేద్ద పైలాన్ ఇక్కడ ఉంది. నర్సంపేట్ పట్టణంలో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. బాలాజి ఇన్ స్టూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైన్సు, జయముఖి ఇన్ స్టూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైన్సు, మహేశ్వరం శివాని గురుకులం, సిద్దార్ద గురుకులంతో పాటు మరిన్ని విద్యాసంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసి, బీఈడి,పీజి, డిగ్రి, జునియర్,ఐటిఐ కళాశాలలున్నాయి.

తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతానికి చెందిన యువత, ఉద్యోగ,వ్యాపార,కార్మిక రంగాలకు చెందిన వారు నర్సంపేట్ డివిజన్ ఐక్య కార్యాచరణ సమితి (జేఎసి) ఆధ్వర్యంలో ముందుండి పొరాడారు. సుమారు రెండు సంవత్సరాలు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో రీలే నిరాహార దీక్షలు చేసి తెలంగాణ ఉద్యమములో ఈ ప్రాంతాన్ని ముందుందని నిరూపించారు. ఉద్యమ సమయానా పట్టణానికి చెందిన రాజ్ కుమార్ చారి అనే ఉద్యమ కారుడు తన ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకొని అసువులు భారాడు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు రాస్తారోకో, దర్నా,వంటావార్పు, ముట్టడి వంటి అనేక ఉద్యమాలు జరిగాయి.

పర్యాటకం[మార్చు]

ఓరుగల్లు గ్రామీణ జిల్లాలో నర్సంపేట్ డివిజన్ లోనే పర్యాటకం ప్రధానంగా ఉంది. నర్సంపేట్ టౌన్ నుండి 9 కిలోమీటర్ల దూరంలో పాఖాల సరస్సు, అభయారణ్యం కలదు. పాకాల అందచందాలు చూసేందుకు రెండు కన్నులు చాలవు. ప్రపంచంలోనే 8వ, భారతదేశంలో 2వ కాలుష్య రహిత సరస్సు పాఖాల. తెలంగాణ రాష్త్ర ప్రభుత్వం ఇటీవల బోటింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. పాకాల సరస్సు కారణంగా నర్సంపేట్ ప్రాంతాన్ని ధాణ్యాగారంగా పిలుస్తారు. పాఖాల సరస్సు ఆయకట్టు సూమారు 30వేలు ఎకరాలు. నిత్యం వందలాది మంది పర్యాటకులతో పాఖాల ఎప్పుడు కిక్కిరిసిపోతుంది. పాఖాల అభయారణ్యం విస్తీర్ణం సుమారు 830చ.కి.మీ. ఉంది. అంటే ఇటు నర్సంపేట్ (వరంగల్ రూరల్) జిల్లాతో పాటు మహబూబబాద్,భద్రాద్రికొత్తగూడ జిల్లాల్లో కూడ ఉంది. అదే విదంగా మాధన్నపేట చెరువు కూడ ఈ ప్రాంతానికి ఆదరువే. ఈ చెరువు కింద 10వేల ఎకరాల ఆయకట్టు ఉంది. మాధన్నపేట చెరువును తెలంగాణ సర్కారు మిని ట్యాంక్ బండ్ గా గుర్తించింది. ఇప్పటికే పనులను కూడ ప్రారంభించారు. నర్సంపేట్-వరంగల్ రహదారి పై కొమ్మాల దేవస్థానం ఉంది. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువుదీరారు. ఈ ఆలయం గీసుకొండ మండల పరిధిలోకి వెళ్ళినప్పటికిని నర్సంపేట్ డివిజన్ కు చెందిన భక్తులకి రెండవ పెద్ద దేవాలయంగా ఉంటుంది.

రవాణా వ్యవస్థ[మార్చు]

నర్సంపేట్ నుండి అనేక ప్రాంతాలకి రోడ్డు మార్గం ఉంది. వరంగల్ (36కి.మీ), హైదరాబాద్ (185కి.మీ) దూరంలో ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. కమ్మపల్లి
 2. భాంజీపేట్
 3. ఇటికలపల్లి
 4. ముత్తోజీపేట్
 5. మాదన్నపేట్
 6. రామవరం
 7. లక్నేపల్లి
 8. మహేశ్వరం
 9. నర్సంపేట
 10. పస్పునూర్
 11. సర్వాపూర్
 12. రాజుపేట్
 13. మక్దూంపురం
 14. గురిజాల

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. https://www.tgnns.com/telangana-new-district-news/warangal/go-232-warangal-rural-district-formation-reorganization/2016/10/11/

వెలుపలిలింకులు[మార్చు]