ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాలరేఖ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో వివిధ యుగాలు, ఆయా సమయాలు క్రింద ఇవ్వబడ్డాయి.
చరిత్ర పూర్వయుగము క్రీ.పూ.1500 వరకు
[మార్చు]- క్రీ.పూ. 10, 000 - క్రీ.పూ. 8, 000 - పాత రాతి యుగము - కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ఈ కాలంనాటి పనిముట్లు దొరికాయి.
- క్రీ.పూ. 8, 000 - క్రీ.పూ. 6, 000 - సూక్ష్మ రాతి యుగము - చిన్న పనిముట్లు - గిద్దలూరు, నాగార్జునకొండ, కొండాపూర్ ప్రాంతాలలోను, అదిలాబాద్ జిల్లాలోను ఈ కాలం అవశేషాలు లభించాయి.
- క్రీ.పూ. 6, 000 - క్రీ.పూ. 2, 000 - కొత్త రాతి యుగము - గిద్దలూరులోను, బళ్ళారి జిల్లా సంగనకల్లులోను ఈ కాలం అవశేషాలు లభించాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఉట్నూరు వద్ద పేడకుప్పలను తగలబెట్టిన మసిదిబ్బలను కనుగొన్నారు.
- క్రీ.పూ. 2, 000 - క్రీ.పూ. 1, 000 - రాగి యుగము - బ్రహ్మగిరి, పుదుచ్చేరిల వద్ద రాగి, కంచు పనిముట్లు లభించాయి. కర్నూలు జిల్లా పాతపాడు వద్ద అలంకరించిన మట్టి పాత్రలు లభించాయి.
- క్రీ.పూ. 1, 000 - క్రీ.పూ. 500 - ఇనుప యుగము - "రాక్షసిగుళ్ళు" అనే సమాధులు ఈ కాలంలో నిర్మించారు. దాదాపు ఆంధ్రదేశం (విశాఖ మినహా) అందటా ఈ కాలం ఆనవాళ్ళు లభించాయి. తెలంగాణ ప్రాంతంలో ఇనుప పనిముట్ల తయారీ ఆధారాలు అధికంగా దొరికాయి. వ్యవసాయం అభినృద్ధి చెందింది.
పూర్వ యుగము క్రీ.పూ 2000 - క్రీ.పూ 500
[మార్చు]- క్రీ.పూ. 2, 000 - 1, 500 కాలం - ఇండో-యూరోపియన్ జాతులు వాయవ్య సరిహద్దులగుండా భారత ఉపఖండంలో ప్రవేశించారు.
- క్రీ.పూ. 1, 500 - 1, 000 కాలం - ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల గురించి మొదటిసారిగా ప్రస్తావన
- క్రీ.పూ. 600 - జైన, బౌద్ధ మతాల ఆరంభం. మొదటినుండి ఆంధ్రదేశంలో విస్తరణ - ఉత్తర, దక్షిణ దేశాల మధ్య అధికమైన సంబంధం
- క్రీ.పూ. 500 - 400 - బౌద్ధ జాతక కథలలో ఆంధ్రాపధం (భీమసేన జాతకం), ఆంధ్రనగరి (సెరివణిజ జాతకం) ప్రస్తావన
- క్రీ.పూ. 500 - అపస్తంబ సూత్రాలు (గోదావరి ముఖద్వారంలో)
- క్రీ.పూ. 700 - 300 ఉత్తరాన మగధ కేంద్రంగా మహా జనపదాల పాలన. నందవంశం ఇందులోదే - క్రీ.పూ.450 మహాపద్మనందుడు కళింగపై దండయాత్ర చేశాడు.
నంద వంశం
[మార్చు]ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నంద సామ్రాజ్యం | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
క్రీ.పూ. 424–క్రీ.పూ. 321 | |||||||||
The Nanda Empire at its greatest extent under Dhana Nanda circa 323 BC. | |||||||||
రాజధాని | పాటలీపుత్ర | ||||||||
సామాన్య భాషలు | సంస్కృతం | ||||||||
మతం | Jainism Hinduism Buddhism | ||||||||
ప్రభుత్వం | Monarchy | ||||||||
సామ్రాట్ | |||||||||
చారిత్రిక కాలం | Antiquity | ||||||||
• స్థాపన | క్రీ.పూ. 424 | ||||||||
• పతనం | క్రీ.పూ. 321 | ||||||||
|
నంద వంశం (The Nanda Empire) భారతదేశ చరిత్రలో మగధ సామ్రాజ్యాన్ని క్రీస్తుపూర్వం 5వ, 4వ శతాబ్దాల మధ్య కాలంలో పాలించింది. నంద సామ్రాజ్యం తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన పంజాబ్ వరకు, దక్షిణంగా వింధ్య పర్వతాల వరకు విస్తరించింది.[1] వీరిని చంద్రగుప్త మౌర్యుడు ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.చంద్రగుప్తా మౌర్య మహాపద్మనంద వారసుడే.
మౌర్యకాలము క్రీ.పూ.322 - 184
[మార్చు]- క్రీ.పూ. 300 - మెగస్తనీసు చంద్రగుప్తుని ఆస్తానంలో ఉన్న యాత్రికుడు. ఆంధ్రుల గురించి ఇలా వ్రాశాడు - "ఆంధ్రులకు 30 నగర దుర్గాలు, 10 వేల పదాతి సైన్యం, 2వేల గుర్రపు దళం, వేయి ఏనుగులు ఉన్నాయి"
- క్రీ.పూ. 310 - చంద్రగుప్తుని కాలంలో ఆంధ్ర దేశం మౌర్య సామ్రాజ్యంలో భాగమయ్యింది.
- క్రీ.పూ. 272 - క్రీ.పూ.232 - అశోకుని పాలన. అశొకుని 13వ శిలాశాసనం ప్రకారం ఆంధ్రులు "రాజవిషయం"లో ఉన్నారు. అశోకుని ఎర్రగుడిపాడు శాసనం
- క్రీ.పూ.255 - అశోకుని కళింగ దండయాత్ర
- క్రీ.పూ.400 - 200 - బౌద్ధమతం ఆంధ్రదేశంలో అంతటా ఉచ్ఛదశలో ఉంది. ఆంధ్రుల ఏకీకరణకు మార్గం సానుకూలమయ్యంది.
సాతవాహనులు - క్రీ.పూ.200 - సా.శ.200
[మార్చు]- క్రీ.పూ. 221? 230? 271? - శాతవాహన రాజ్య స్థాపన
- క్రీ.పూ. 185 - ఖారవేలుని హతీగుంఫ శాసనము
- క్రీ.పూ. 208 - 198 - కన్హ
- క్రీ.పూ. 197 - 179 - మొదటి శాతకర్ణి
- క్రీ.పూ. 187 - మగధలో శుంగ వంశం స్థాపన (మౌర్య సామ్రాజ్యం అంతం)
- క్రీ.పూ. 179 - 161 - పూర్ణోత్సుంగ
- క్రీ.పూ. 152 - 98 - 2వ శాతకర్ణి
- క్రీ.పూ. 58 - విక్రమ శకం ఆరంభం
- క్రీ.పూ. 38 - 30 - కుంతల శాతకర్ణి. ఇతని కాలంలోనే గుణాఢ్యుడు బృహత్కథను రచించాడు.
- క్రీ.పూ. 30 - 6 - 1వ పులొమావి.
- సా.శ. 19 - 24 - శాతవాహన హాలుడు - గాధాసప్తశతి
- సా.శ.78 - శాలివాహన శకం ఆరంభం
- సా.శ. 78 - 102 - గౌతమీపుత్ర శాతకర్ణి
- సా.శ. 100 - ఉత్తరాదిన కనిష్కుని రాజ్యం. అశ్వఘోషుడు మహాయాననం ప్రాంభించాడు.
- సా.శ. 130 వాసిష్ఠీపుత్ర పులొమావి
- సా.శ. 174 - 203 యజ్ఞశ్రీ శాతకర్ణి
- సా.శ. 200 - ఆచార్య నాగార్జునుడు - మహాయానం వికాసం.
- సా.శ. 218? - శాతవాహన రాజ్య పతనం
కళింగులు
[మార్చు]- క్రీ.పూ. 178 - 150 : ఖారవేలుడు (ముఖలింగం రాజధానిగా)
- సా.శ. 350 - 380 : ఉమవర్మ - సింహపురి (సింగుపురం, శ్రీకాకుళం - నరసన్నపేటల మధ్య ఉన్నది) రాజధానిగా
- 380 - 400 : చండవర్మ - ("సకళ కళింగాధిపతి" బిరుదు)
- 400 - 420 : నందప్రభంజనవర్మ -
- మాఠరులు
- 400 - 435 : శంకరవర్మ, శక్తివర్మ, ప్రభంజనవర్మ, అనంతశక్తివర్మ - పిష్ఠపురం రాజధానిగా
- వాసిష్ఠులు
- వీరి రాజధాని దేవపురి (శృంగవరపుకోట వద్ద దేవాడ)
- 300 - 375 : గుణవర్మ
- 375 - 400 : మహారాజప్రభంజనవర్మ
- 400 - 450 : అనంతవర్మ
- ఇతరులు
- 500? : పృథ్వీమూల మహారాజు (వంశం తెలియదు) . తండ్రి ప్రభాకర మహారాజు. తాత మూలమహారాజు. వీరి రాజధాని గుణపాశపురం (రాజోలు వద్ద అదుర్రు) - గోదావరినుండి కొండవీటివరకు వరి రాజ్యం ఉండవచ్చును
- కళింగ గంగులు
- 490 - 500 : ఇంద్రవర్మ. కళింగ గంగుల పాలన ఆరంభం. రాజధాని దంతపురం (శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిపైనున్న దంతవక్తృనికోట)
- 560 : మహాసామంతవర్మ - "జయశ్రీనివాసుడు" -
- 576 : హస్తివర్మ - "రణభీత"
- 553-570 : రెండవ ఇంద్రవర్మ - రా్ధానిని దంతపురం నుండి కళింగనగరానికి (ముఖలింగం) మార్చాడు.
- తరువాత అంతఃకలహాలు. క్రమంగా చాళుక్యులు కళింగదేశాన్ని ఆక్రమించారు.
ఇక్ష్వాకులు 210 - 260? - 300?
[మార్చు]- సా.శ. 225 - శాతవాహనుల పతనం - ఇక్ష్వాకుల విజృంభణ - శ్రీపర్వతం (విజయపురి, నాగార్జునకొండ) రాజధానిగా
- 225 - 245 : శ్రీఛాంతమూల
- 245 - 265 : వీరపురుషదత్త
- 265 - 290 : ఎహువల ఛాంతమూల
- 290 -300 : రుద్రపురుషదత్త
- 300 : పల్లవుల (సింహవర్మ) ఆక్రమణతో ఇక్ష్వాకుల పాలన అంతం.
- ఈ కాలంలో వైదిక మతానికి ప్రాధాన్యత పెరిగింది. కాని బౌద్ధం కూడా ఉచ్ఛదశలో ఉంది. ప్రాకృతం వాడుక మెల్లగా తగ్గుముఖం పట్టింది.
బృహత్పలాయనులు 300 - 350?
[మార్చు]- 300 - 325 :కృష్ణానది ఉత్తరాన బృహత్పలాయనుల పాలన - రాజధాని "కూడూరా". మనకు తెలిసిన ఒకేఒకరాజు జయవర్మ.
- కృష్ణానది దక్షిణాన పల్లవుల రాజ్యం ఉంది
- ఈ కాలంలో బౌద్ధమతం క్షీణదశలో ఉంది. వైదికమతం విజృంభించసాగింది.
అనందగోత్రులు 295 - 620
[మార్చు]- వీరి రాజధాని నర్సారావుపేట వద్దనున్న చేజెర్ల
- 295 - 315 : దామోదరవర్మ
- 395 - 420 : అత్తివర్మ
- 615 - 620 : కందారరాజు
శాలంకాయనులు 320 - 420
[మార్చు]- వీరి రాజధాని వేంగి.
- 320 : హస్తివర్మ రాజ్య స్థాపన
- 345 : సముద్రగుప్తుని దక్షిణదేశ దండయాత్ర
- 350 - 385 : నందివర్మ
- 400 - 420 : ఆచండవర్మ
- 420 - 450? - విజయనందివర్మ
విష్ణుకుండినులు 375 - 555 (440 - 623?)
[మార్చు]- విష్ణుకుండినుల రాజధాని అమరపురి లేదా ఇంద్రపాలనగరం. (సత్తెనపల్లి తాలూకా వేల్పూరు)
- 375 - 400 : ఇంద్రవర్మ
- 400 - 425 : విక్రమహేంద్రవర్మ
- 425 - 465 : గోవిందవర్మ
- 465 - 515 : 1వ మాధవ వర్మ - అందరిలో ముఖ్యుడు. రాజ్యాన్ని విస్తరింపజేశాడు. పల్లవులతో యుద్ధం తరువాత తన రాజధానిని వేంగి సమీపంలోని దెందులూరుకు మార్చాడు.
- 515 - 525 : విక్రమేంద్రవర్మ
- 525 - 555 : ఇంద్రవర్మ, విక్రమేంద్ర భట్టారక వర్మ
- 574 - 623 : మాధవ వర్మ
- ? : మంచన్న భట్టారక
- రణదుర్జయులు
- రణదుర్జయుడు విష్ణుకుండి మాధవవర్మ సమకాలికుడు.
పల్లవులు 260 - 400 - 550
[మార్చు]- 280 - 310 : సింహవర్మ
- 310 - 335 : శివస్కందవర్మ
- 335 - 350 : విష్ణుగోప
- 350 - 370 : కుమారవిష్ణు
- 370 - 385 : 2వ స్కందవర్మ
- 385 - 400 : వీరవర్మ
- 400 - 436 : 3వ విజయస్కందవర్మ (పాలక్కడ)
- పాలక్కడ శాఖ
- 430? - 550? యువ మహారాజు విష్ణుగోప, సింహవర్మ, విష్ణుగోప
- 550 - 570 : సింహవర్మ
- 570 - 600 : సింహవిష్ణు
- 600 - 630 : మహేంద్రవర్మ
- కాంచీపురి శాఖ
- 435 - 480 : 2వ సింహవర్మ
- 480 - 490 : 4వ స్కందవర్మ
- 495 - 500 : నందివర్మ
- 500 - 520 : 2వ కుమార విష్ణు
- 520 - 530 : బుద్ధవర్మ
- 530 - 550 : 3వ కుమార విష్ణు
పూర్వమధ్య యుగము
[మార్చు]మహాపల్లవులు
[మార్చు]- 550 - విష్ణు గోపుని కుమారుడు సింహవర్మ కాంచీపురం సింహాసనం అధిష్టించాడు. ఇతడు మహాపల్లవులకు మూలపురుషుడు.
- 566 - కర్మరాష్ట్రంలో విక్రమేంద్రునిపై సింహవర్మ యుద్ధం, వివాహ సంబంధం - అనతికాలంలో విష్ణుకుండినుల పాలన అంతం. కృష్ణానది వరకు పల్లవుల రాజ్యం
- 617 - బాదామి చాళుక్యరాజు పులకేశి కర్మరాష్ట్రంను వశం చేసుకొన్నాడు.
- 630 - కాంచీనగరి సమీపంలో పల్లలూరు వద్ద చాళుక్యులతో జరిగిన యుద్ధంలో పల్లవుల పరాజయం. ఆంధ్రదేశంలో పల్లవుల పాలన అంతం. (తరువాత వారు పూర్తిగా తమిళదేశానికి పరిమితమయ్యారు)
రేనాటి చోడులు
[మార్చు]పల్లవ, చాళుక్య సంఘర్షణల సమయంలో రాయలసీమలో రేనాటి చోడులు, బాణులు, వైదంబరులు స్వతంత్ర రాజ్యాలు ఏర్పరచుకొన్నారు.
- సుమారు 500 - నందివర్మ - రేవాటి చోడుల మూల పురుషుడు. బహుశా పల్లవులపై తిరుగుబాటు చేసి రాజ్యం స్థాపించుకొని ఉండవచ్చును.
- నందివర్మ కొడుకులు రాజ్యాన్ని విభజించుకొన్నారు - సుందరానంద రాజధాని నిడుగల్లు, ధనంజయవర్మ రాజధాని చీర్చులి.
- 575 - రేనాటి చోడుల కాలం నాటిదే ధనంజయుని మనకు ప్రస్తుతం లభిస్తున్న మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం - (ధనంజయుని కలమళ్ళ శాసనం)
- 625 - 50 - నందివర్మ మనుమడు మహేంద్ర విక్రమవర్మ. అతని కొడుకు పుణ్యకుమారుడు. ఇతడు కొంతకాలం చోళులకు, కొంతకాలం పల్లవులకు సామంతులుగా ఉండి ఉండవచ్చును.
- 750 ప్రాంతం తరువాతి రాజులు - విక్రమాదిత్య, శశికుమార, విక్రమాదిత్య సత్యాదిత్య
- సత్యాదిత్యుని అనంతరం బాదామి చాళుక్యులు బలహీనులైనపుడు వారి సామంతులయిన రేనాటిచోడులు కూడా బలహీనులైనారు. ఒలంబులు, వైదుంబులు విజృంభించిరి. రాష్ట్రకూటులు వైదుంబులను ప్రోత్సహించారు. రేనాడును వైదుంబ గండ త్రినేత్రుడు ఆక్రమించాడు.
చాళుక్యులు
[మార్చు]- 200 - 250: చాళుక్యుల (చలికి వంశానికి చెందినవారి) సేనాని "మహా తలవర ఖండ చాలికి రేమణక" అనేవాడు హిరణ్యక రాష్ట్రంలో (వైఎస్ఆర్ జిల్లా ప్రాంతంలో) ఉన్నట్లు శాసనాధారం.
- 458 - 480 : మధ్య కాలంలో త్రిలోచన పల్లవునితో విజయాదిత్య చాళుక్యుడు పోరాడి ఓడిపోయాడు. గర్భవతియైన విజయాదిత్యుని భార్య ముదినేము అగ్రహారం (వైఎస్ఆర్ జిల్లా) లో వుష్ణుభట్ట సోమయాజి అనే ఒక బ్రాహ్మణుని ఇంట తలదాచుకొని కన్న మగబిడ్డ విష్ణువర్ధనుడు. ఇతడు చాళుక్యుల మూలపురుషుడు. అతని సంతతిలోనివాడు మొదటి పులకేశి.
- 534 - 44: మొదటి పులకేశి (సత్యాశ్రయ పులకేశి) బాదామిని లోబరచుకొని స్వతంత్ర చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు.
- 557 - 597 : పులకేశి కుమారుడు కీర్తి వర్మ. కీర్తి వర్మ మరణం తరువాత కొంతకాలం అతని తమ్ముడు మంగళేశుడు రాజ్యం చేశాడు. అప్పటికి రెండవ పులకేశి చిన్న వయస్కుడు. రాజ్యాధికారం కొరకు జరిగిన తగవులలో మంగళేశుడు మరణించాడు.
- 609 - కీర్తివర్మ కొడుకు రెండవ పులకేశి. పట్టాభిషేకం. రెండవ పులకేశి గొప్పరాజు. దిగ్విజయ యాత్రలు సాగించి దక్షిణాపథాన్ని అధిపత్యంలోకి తెచ్చుకోవాలని యత్నించాడు. కదంబ, గంగ, అలూప, మౌర్య, లాట, మాళవ, ఘుర్జరులను జయించాడు. కర్ణాటక, మహారాష్ట్రలను దాదాపు పూర్తిగా జయించాడు. తరువాత తీరాంధ్రంలో వేంగిని జయించాడు. అక్కడినుండి తీరాంధ్రంలో కుబ్జవిష్ణువర్ధనునిచే తూర్పుచాళుక్య వంశం మొదలయ్యింది.
- సత్యాశ్రయ పులకేశిని తమ వంశకర్తగా భావించిన వివిధ రాజవంశాలు
రాష్ట్రకూటులు
[మార్చు]- 753 : కర్ణాటకలోని బాదామిని పాలించిన చివరి చాళుక్యరాజు రెండవ కీర్తివర్మను ఓడించి దంతిదుర్గుడు స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యం స్థాపించాడు. అంతకు పూర్వం రాష్ట్రకూటులు చాళుక్యులకు సామంతులు. ఈ పరిణామంతో తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలలో చాలా భాగం రాష్ట్రకూటుల అధీనంలోకి వచ్చింది.
- 756 : దంతిదుర్గుని మరణం. అతని పినతండ్రి కృష్ణుడు రాష్ట్రకూట రాజయ్యాడు. అప్పటికి వేంగి చాళుక్యులకు, రాష్ట్రకూటులకు మధ్య వైరం తీవ్రతరమయ్యింది. ఎడతెరిపి లేకుండా వారి మధ్య రెండు దశాబ్దాలపాటు ఎన్నో యుద్ధాలు జరిగాయి.
- 772 : గోవిందుడు, తరువాత ధ్రువుడు, తరువాత (794లో) మూడవ గోవిందుడు రాష్ట్రకూట రాజులు. ఈ కాలంలో వేంగితో వారికి 108 యుద్ధాలు జరిగినట్లు శాసనాలు చెబుతున్నాయి.
- 814 అమోఘ వర్షుడు, 880 రెండవ కృష్ణుడు - ఈ కాలంలో వేంగి చాళుక్యుల రాజు గుణగ విజయాదిత్యుని చేత రాష్ట్రకూటులు పరాజితులయ్యారు. తరువాత రాష్ట్రకూటులు వేంగిలోని అంతఃకలహాలలో జోక్యం చేసుకోవడం అధికమయ్యింది.
- 930 -934 : రాష్ట్రకూటుల సహాయంతో యుద్ధమల్లుడు వేంగి రాజ్యం ఆక్రమించాడు. కాని తరువాత యుద్ధమల్లుని పాలన కృష్ణా దక్షిణ ప్రాంతానికి పరిమితమయ్యింది. ఈ కాలంలో రాష్ట్రకూటుల ప్రతినిధులు తీరాంధ్రంలో బలమైన స్థానం సంపాదించారు.
- 956: వేంగిపై రాష్ట్రకూట మూడవ కృష్ణుని దండయాత్ర.
- 973 : రెండవ తైలపుడు అనే చాళుక్య రాజు రాష్ట్రకూటులను ఓడించి కళ్యాణిలో చాళుక్య పాలనను పునస్థాపించాడు.
తూర్పు చాళుక్యులు 624 - 1076
[మార్చు]- 624 - తూర్పు చాళుక్యుల వేంగి రాజ్యం ఆరంభం
- 624 - 641 : కుబ్జ విష్ణువర్ధనుడు
- 636 : చైనా యాత్రికుడు హ్యూన్ త్సాంగ్ (యువాన్ చువాంగ్) ఆంధ్ర దేశం పర్యటన - వేంగి, ధరణకోట, శ్రీశైలం అతని వర్ణనలలో ఉన్నాయి.
- 641 - 673 : జయసింహుడు
- 675 - 682 : 2వ విష్ణువర్ధనుడు
- 682 - 706 : మంగి యువరాజు
- 706 - 718 : 2వ జయసింహుడు
- 718 - 755 (775?) : 3వ విష్ణువర్ధనుడు
- 755- 772 : విజయాదిత్య భట్టారకుడు
- 772 - 807 : 4వ విష్ణువర్ధనుడు
- 807 - 846 : నరేంద్ర మృగరాజు (2వ విజయాదిత్యుడు)
- 834 - 836 : రాష్ట్రకూటులతోను, గంగులతోను యుద్ధాలు - (108 యుద్ధాలలో విజయం సాధించి 108 శివాలయాలు నిర్మించాడట?)
- 848 - 848 : కలివిష్ణువర్ధనుడు
- 848 - 892 : గుణగ విజయాదిత్యుడు
- 892 - 921 : చాళుక్య భీముడు
- 921 - 921 : 4వ విజయాదిత్యుడు
- 921 - 927 : అమ్మరాజు
- 927 : బేత విజయాదిత్యుడు
- 928 - 934 : యుద్ధమల్లుడు చాళుక్యలనుండి బెజవాడ ప్రాంతాన్ని ఆక్రమించాడు
- 934 - 945 : 2వ చాళుక్య భీముడు యుద్ధమల్లుడిని జయించాడు
- 972 - 973 : పశ్చిమాంధ్రలో రాష్ట్రకూటుల పతనం. బాదామి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని వశం చేసుకొన్నారు.
- 972 - 999 : ఈ సమయంలో తూర్పు చాళుక్యులు, దక్షిణాదినుండి వచ్చిన చోళులు కలిసిపోయారు. వారిని చాళుక్యచోళులు అంటారు. పశ్చిమ చాళుక్యులకు, చాళుక్యచోళులకు యుద్ధాలు ఆరంభమయ్యాయి. వేంగి దేశం క్రమంగా బలహీనపడింది. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర (కళింగ) ప్రాంతం గంగుల పాలనలోనే ఉంది.
పూర్వగాంగులు 498 - 894
[మార్చు]- తూర్పు చాళుక్యుల రాజ్యం కృష్ణా, గోదావరి ప్రాంతాలకే పరిమితమైంది. ఉత్తరాదిన కళింగ రాజ్యం గంగుల పాలనలో ఉంది.
- 498 - 624 : (వివరాలు తెలియడంలేదు)
- 624 - : 3వ ఇంద్రవర్మ (దానార్ణవుని కొడుకు)
- 681? - దేవేంద్రవర్మ (గుణార్ణవుని కొడుకు)
- 720 - మొదటి కామార్ణపునితో రెండవ గంగవంశము కళింగదేశంలో ఏర్పడింది.
- 749 ? : దేవేంద్రవర్మ (అనంతవర్మ కొడుకు)
- 895 : పూర్వ గాంగుల ప్రస్తావన లేదు.
- 895 - 995 : వివరాలు లభించడం లేదు
- 995 తరువాత వచ్చిన పాలకులు కూడా గంగ వంశానికి చెందిన వారమనే చెప్పుకొన్నారు కాని, వారికి, పూర్వగాంగులకు ఉన్న సంబంధాలు తెలియడంలేదు. బహుశా పూర్వ గాంగులను జయించిన క్రొత్త వంశం కావచ్చును.
చాళుక్య చోళులు 980 - 1076
[మార్చు]- 985 : రాజరాజచోళుడు చోళసింహాసనాన్ని అధిష్టించాడు.
- 998 - 999 : వేంగి వ్యవహారాలలో రాజరాజచోళుడి జోక్యం అధికమయ్యింది. అంతఃకలహాలలో తమకు అనుకూలమైనవారికి రాజ్యం లభించేట్లు చేశాడు. తన కుమార్తెను విమలాదిత్యుడికిచ్చి పెళ్ళి చేశాడు.
- 1000 - 1018 : శక్తివర్మ, విమలాదిత్యుడు, రాజాధిరాజు
- 1006 : (పశ్చిమ) చాళుక్య రాజు సత్యాశ్రయునికి చోళులతో పోరు. తూర్పు చాళుక్యులు (చాళుక్యచోళులు) మధ్యలో ఇరుక్కున్నారు.
- 1022 : రాజరాజనరేంద్రుని పట్టాభిషేకం. ఈ రాజ రాజ నరేంద్రుడు కవిపోషకుడు. ఇతని భార్య అమ్మంగిదేవి. నన్నయ ఇతని ఆస్థానంలో ఉన్నాడు. ("సారంగధర"నాటకం ద్వారా ప్రసిద్ధుడైన రాజరాజు వేరు. అతను నర్మదా తీరంలో రాజు. అతని భార్యలు రత్నాంగి, చిత్రాంగి. ఈ కథ బమ్మెరపోతన కొడుకు కేసన్న వ్రాసిన నవనాధచరిత్రలో ఉంది. అయితే ఆ రాజు ఈ రాజు ఒకరేననే అభిప్రాయం తెలుగునాట బహుళంగా ఉంది.[2])
- 1031 : రాజరాజనరేంద్రునిపై దాయాది విజయాదిత్యుని తిరుగుబాటు. వారి అణచివేత.
- 1045 - 1060 : నన్నయ చేత మహాభారతం తెనుగు సేత
- 1050 : శ్రీశైలంలో పండిత మల్లికార్జునుని జననం.
- 1060 :చోళులకు, (పశ్చిమ) చాళుక్యులకు యుద్ధాలు
- 1061 : ఉత్తరాన్నుండి వస్తున్న అవరోధాలను ఎదుర్కోవడానికి రాజరాజు రాజమహేంద్రవరం నుండి పాలించాడు. విజయాదిత్యుడు అదను చూసుకొని ఇతరరాజుల సాయంతో వేంగి సింహాసనం ఆక్రమించాడు.
- 1068 : రాజరాజు తన చోళ బంధువుల సహాయంతో బెజవాడ వద్ద జరిగిన యుద్ధంలో విజయాదిత్యుని జయించి క్షమించాడు.
- 1068 -1070 : రాజాధిరాజు, వీరరాజేంద్ర, అధిరాజేంద్ర
- 1070 : తిరుగుబాటులో అధిరాజేంద్రుని మరణం. చాళుక్యచోళుల పాలన అంతం
- 1076 : విజయాదిత్యుడి మరణం. కులోత్తుంగ చోళుడు వేంగి రాజ్యాన్ని హస్తగతం చేసుకొని తెలుగు, తమిళ దేశాలకు అధిపతి అయ్యాడు.
వెలనాటి చోడులు
[మార్చు]- 1108 వరకు - గొంకరాజు - కులోత్తుంగ రాజేంద్ర చోడుమి ప్రతినిధిగా గోదావరి నుండి గుండ్లకమ్మ వరకు, పశ్చిమాన త్రిపురాంతకం వరకు అధికారం నిర్వహించాడు. చోళుల సామంతులను విధేయులుగా ఉంచాడు.
- 1110 ప్రాంతం - చోడరాజు - కులోత్తుంగ చోడునినుండి వెలనాడును రాజలాంఛనాలతో బహుమతిగా పొందాడు. ఇతని కాలంలో కళింగ దండయాత్ర జరిగింది. 1115లో వేంగి చాళుక్యచోళులపై పశ్చిమ చాళుక్యుల రాజు ఆరవ విక్రమాదిత్యుయుడు దండెత్తి వేంగిని జయించాడు.
- 1132 - వెలనాటి చోడరాజు వేంగి సామంతులను కూడగట్టి మన్నేరు యుద్ధంలో పశ్చిమ చాళుక్యులను జయించాడు.
- 1132 - 1161 : రెండవ గొంకరాజు - వెలనాటి రాజులలో గొప్పవాడు. 1135లో గోదావరి తీరాన భీకర యుద్ధంలో పశ్చిమ చాళుక్యులను ఓడించి వేంగి రాజ్యంనుండి వారిని పూర్తిగా పారద్రోలాడు. తరువాత ఇతను చోళుల సామంతునిగా తీరాంధ్రం మహేంద్ర గిరి -శ్రీశైలం మధ్యభాగంపై దాదాపు పూర్తి అధికారం కలిగి ఉన్నాడు. కాని అది సహించని ఇతర సామంతులతో తెడతెరిపి లేకుండా చాలా యుద్ధాలు చేశాడు.
ఇతర తీరాంధ్ర పాలకులు
[మార్చు]ఈ కాలంలో (10వ శతాబ్దంలో) వేంగి రాజ్యం పతనావస్థలో ఉంది. పశ్చిమ చాళుక్యులు ఆంధ్రదేశంలో కొద్ది తెలంగాణ ప్రాంతానికి పరిమితులయ్యారు. చాళుక్య చోళులు దక్షిణాది వ్యవహారాలలో నిమగ్నులై తీరాంధ్రాన్ని పట్టించుకోలేదు. ఈ సమయంలో అనేక చిన్న చిన్న రాజ్యాలు, ఒకరితో ఒకరు పోరాడుకుంటూ, తీరాంధ్రంలో పాలన నెరపాయి.
- కొణిదెన చోళులు 1000 - 1150 : కమ్మనాడు, గుండికర్త (గుండ్లకమ్మ చుట్టుప్రక్కల), మోటాటి (కర్నూలు జుల్లా)
- సారోనాధులు 1125 - 1150: సారసిపురం (ఏలూరు) రాజధానిగా పాలించారు.
- కోన హైహయులు 1070 - 1150 : కోన మండలం - రాకుదురు రాజధానిగా.
- పలనాటి హైహయులు 1103 - 1147: గురజాల రాజధానిగా
వెల్లూరు చోడులు
[మార్చు]1150 ప్రాంతంలో నెల్లూరు చోడులు వెలనాటి చోడుల ప్రత్యర్థులుగా దక్షిణ తీరాంధ్రాన్ని - పాకనాడు, నెల్లూరు, చిత్తూరు, కడప ప్రాంతాలను - పాలించారు.
- 1042-168 - తెనుంగు బిజ్జన - పశ్చిమ చాళుక్య చక్రనర్తి మొదటి సోమేశ్వరుని సామంతుగా, యేతగిరి రాజధానిగా, కన్నెమున్నూరు, పెదకల్లెనూరు, నెరవాడియేనూరు ప్రాంతాలను పాలించాడు.
- 1070 - కొచ్చెర్ల కోట యుద్ధం - కళ్యాణిలో కాలచుర్యుల రాజు బిజ్జలుడు పాకనాటి చోళులతో మైత్రి నెరపి, వెలనాటి చోళులను ఓడించడానికి యత్నించాడు కాని సఫలుడు కాలేదు.
- 1076 - 1126 మధ్య కాలం - మొదటి రాజు సిద్ధిబేతడు - ఆరవ విక్రమాదిత్యుడు వీరి స్వామి భక్తికి మెచ్చి వీరిని పాకనాటి పాలకులుగా నియమించాడు. 1132 ప్రాంతంలో సిద్ధబేతడు వెలనాటిరాజులతో యుద్ధంలో మరణించాడు.
- 1180 - కాణవయ్య దండనాయకుడు వెలనాటిపై దండెత్తి వారిని నాశనం చేశాడు. తరువాత నెల్లూరు (పాకనాటి) చోళులు విజృంభించారు.
- 1187 - నల్లసిద్ధి (మనుమసిద్ధి) వెల్లూరును పాలిస్తున్నాడు.
- 1205 - నల్లసిద్ధి మరణం, అతని తమ్ముడు తమ్ముసిద్ధి సింహాసనం ఎక్కాడు. కాని నల్లసిద్ధి కొడుకు తిరుక్కాళత్తి దేవుడు (తిక్కన్న) యువరాజుగా ఉన్నాడు. యువరాజుగా ఉండగానే పృథ్వీశుని దండయాత్రను త్రిప్పికొట్టాడు.
- 1223 - 48: చోడ తిక్కన్న పాలన - ఇతడు నెల్లూరు చోడులలో సుప్రసిద్ధుడు. వారి అధికారం కావేరి వరకు విస్తరించింది. హోయసాలుల పక్షం వహించి పాండ్యులను జయించాడు. మహాకవి తిక్కన తండ్రి, తాతలు చోడతిక్కన్నను సేవించారు.
- 1248 - 63: మనుమసిద్ధి - చోడ తిక్కన కుమారుడు - ఇతని కాలంలో నెల్లూరును నలువైపులా శత్రువులు చుట్టుముట్టారు. గత్యంతరం లేక మనుమసిద్ధి కాకతీయ గణపతిదేవుని సహాయం అర్ధించి, కాకతీయుల సామంతుగా రాజ్యం చేశాడు.
- 1260 : కాటమరాజుకు, మనుమసిద్ధికి పుల్లరిని గురించిన యుద్ధం. ఇందులోనే ఖడ్గతిక్కన తన ప్రాణాలు ధారపోసి మనుమసిద్ధికి విజయం చేకూర్చాడు.
- 1260 ప్రాంతం - తిక్కన సోమయాజి భారతాంధ్రీకరణ ఆరంభం.
- 1263 - పాండ్యులతో జరిగిన మడుగూరు యుద్ధంలో మనుమసిద్ధి మరణం. నెల్లూరు ప్రాంతంపై పాండ్యుల అధికారం. తరువాత ఇక్కడ అవేక యుద్ధాలు జరిగాయి. తరువాత మరల రుద్రమదేవి పాలనా కాలంలో నెల్లూరు కాకతీయుల వశమయ్యింది.
- 1282, 1292 - ఈ సమయంలో కొద్ది కాలం మాత్రం మనుమసిద్ధి వంశీయులు నెల్లూరును పాలించారు.
కాకతీయులు 1083 - 1323
[మార్చు]- 934-945: మధిర, మానుకోటలను పాలించిన కాకర్త్య గుండన రాష్ట్రకూటులకు ప్రతినిధి
- సుమారు 950: కాకర్త్య గుండనకు కురవాడి రాజ్యం లభ్యం
- ? - 1052 బేతన===hanmakonda, kaakathee puradhinaada birudu
- 1052 - 76: మొదటి ప్రోలుడు
- 1076 - 1108 రెండవ బేతరాజు
- 1116 - 57: రెండవ ప్రోలరాజు - తెలంగాణ ప్రాంతం అధిక భాగం కాకతీయుల అధీనం అయ్యింది.
- 1100 - 1170 : మల్లికార్జున పండితారాధ్యుని కాలం. జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం . శైవం పునరుద్ధరణ. (మరొక అభిప్రాయం: 1050 - శ్రీశైలంలో పండిత మల్లికార్జునుని జననం.)
- 1176-1182: కారెంపూడి వద్ద జరిగిన పల్నాటి యుద్ధం
- 1158 - 1195: రుద్రదేవుడు - తీరాంధ్రంలో కాకతీయుల ప్రవేశం. వెలనాటి చోళుల పరాభవం
- 1195 - 1199: మహాదేవుడు
- 1199 - 1262: గణపతిదేవుడు - తీరాంధ్రం, రాయలసీమ అత్యధిక భాగం కాకతీయుల పాలనలోకి వచ్చింది. శాతవాహనుల తరువాత మళ్ళీ దాదాపు పూర్తి తెలుగు ప్రాంతం ఒక రాజ్యమయ్యింది. ఒక్క ముటుకూరు (నెల్లూరు ప్రాంతం) యుద్ధంలో మాత్రమే ఇతనికి పరాజయం ఎదురయ్యింది.
- 1250 : గణపతి దేవుడు కాంచీపుర రాజ్యాన్ని జయించాడు.
- 1260: తిక్కన సోమయాజి, గోపరాజు రామ ప్రధాని కాలం
- 1269 - 1289: రుద్రమదేవి: గణపతి దేవుని రాజ్యం కొనసాగింపు
- 1292 - ఇటలీ యాత్రికుడు మార్కో పోలో భారత దేశానికి వచ్చాడు. మోటు పల్లి రేవులో దిగి కాకతీయుల సంపదలను వర్ణించాడు.
- 1289 - 1323: ప్రతాపరుద్రుడు
- 1303 - 1309 - ఢిల్లీ సుల్తాను అలా ఉద్దీన్ ఖిల్జీ మూడు సార్లు దాడి చేసి విఫలమయ్యాడు. నాలుగవ సారి మాలిక్ కఫూర్ నాయకత్వంలో ప్రతాపరుద్రుడు ఓటమి పొంది కప్పం కట్ట సాగాడు.
- 1321-22 : ఐదవ యుద్ధము (ఘియాజుద్దీన్ తుఘ్లక్ కాలంలో, ఉల్లూఖాన్ నాయకత్వంలో) - ప్రతాపరుద్రుడు పరాజితుడయ్యాడు. కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యింది.
అర్వాచీన గాంగులు
[మార్చు]- 720: మొదటి కామార్ణవునితో రెండవ గంగ వంశము కళింగ దేశములో ఏర్పడింది.
- 1078 - 1140: రెండవ గంగ వంశంలో ప్రసిద్ధుడైన అనంతవర్మ చోడంగ దేవుని పాలన
- 1130 : అనంతవర్మ చోడంగ దేవుడు కటకమును జయించాడు.
ఉత్తరమధ్య యుగము
[మార్చు]ముసునూరి కమ్మ నాయకులు 1320 - 1368
[మార్చు]- 1324: తురుష్కులను దక్షిణ భారతము నుండి తరిమివేయుటలో కమ్మ నాయకుల సాఫల్యం
- 1351: హసను గంగు మహమ్మదు బీన్ తుగ్లకు పై తిరుగుబాటు చేసి దేవగిరిలో బహమనీ రాజ్యము స్థాపించెను.
- 1355: అలావుద్దీను సైన్యం ఓరుగల్లుపై తిరిగి దండయాత్ర.
- 1369: ముసునూరి కాపానీడు మరణం.
ఓఢ్ర గజపతులు
[మార్చు]రేచెర్ల వెలమలు
[మార్చు]కొండవీటి రెడ్ల రాజ్యము 1328 - 1424
[మార్చు]రాజమహేంద్రవర రాజ్యము
[మార్చు]బహమనీ రాజ్యము
[మార్చు]విజయనగర సామ్రాజ్యము
[మార్చు]పెమ్మసాని కమ్మనాయకులు
[మార్చు]సూర్యదేవర కమ్మనాయకులు
[మార్చు]రావెళ్ల కమ్మనాయకులు
[మార్చు]శాయపనేని కమ్మనాయకులు
[మార్చు]- 1336 : విజయనగర రాజ్యం స్థాపన
- 1396 - 1430: 'కవి సార్వభౌముడు శ్రీనాధుడు ప్రాభవ కాలం
- 1509 - 1530: శ్రీకృష్ణ దేవరాయలు పాలన
- 1549 : తంజావూరిలో ఆంధ్ర రాజ్యం ఏర్పడింది.
- 1559 : మధురలో ఆంధ్ర రాజ్యం స్వతంత్రమయ్యింది.
- 1565 - తళ్ళికోట యుద్ధం. విజయ నగర సామ్రాజ్యం పతనం
- 1569 - అరవీటిలో తిరుమల రాయలు సదాశివరాయలను చంపి తాను రాజయ్యాడు.
- 1570 - మధుర ఆంధ్ర రాజు సింహళ దేశాన్ని జయించాడు.
ఆధునిక యుగము
[మార్చు]అరవీటి వంశము
[మార్చు]- 1674 - తంజావూరు తెలుగు పాలకులనుండి మహారాష్ట్రుల వశమయ్యింది.
- 1739 - మధురలో తెలుగు పాలకుల అధికారం అంతరించింది.
గోలకొండ రాజ్యము
[మార్చు]- 1512 - కుతుబ్-ఉల్-ముల్క్ గోల్కొండ రాజయ్యాడు.
- 1579 - కృష్ణాజిల్లా మహమ్మదీయుల వశమయ్యింది.
నిజాము రాజ్యము
[మార్చు]బ్రిటిషు రాజ్యము
[మార్చు]- 1639 - చంద్రగిరి రాజు రంగరాయలు బ్రిటిష్ వారికి చెన్నపురిలో కోట కట్టుకోవడానికి అనుమతి ఇచ్చాడు.
- 1757 - బొబ్బిలి యుద్ధం, కర్నల్ ఫోర్డు మచిలీపట్నాన్ని అధీనంలోకి తెచ్చుకొన్నాడు
- 1764 - తంజావూరులో త్యాగరాజు జననం
- 1766 - గంజాం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలను నిజాం ప్రభువు ఆంగ్లేయులకిచ్చాడు.
- 1778 - గుంటూరు జిల్లాలో ఇంగ్లీషువారి ప్రవేశం
- 1794 - పద్మనాభ యుద్ధం
- 1772 - శ్రీరంగపట్నం ఒప్పందంలో భాగంగా బళ్ళారి, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు (వీటిలో కడప, గండికోట కోటపట్టణాలు) నిజాం రాజుకు మైసూరు రాజ్యం నుంచి వచ్చింది.
- 1800 - కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి జిల్లాలను నిజాం ప్రభువు ఆంగ్లేయులకిచ్చాడు.
- 1806 - తెలుగు అచ్చు అక్షరాలు తయారు చేయబడినాయి.
- 1827 - తెలుగు లిపితో అచ్చు వేయబడిన మొదటి పుస్తకం "శబ్దమంజరి"
- 1829 - బందరు ఉప్పెన
- 1834 - తెలుగు పుస్తకాలు విరివిగా అచ్చువేయబడుతున్నాయి.
- 1835 - తెలుగు నిఘంటువు ముద్రణ
- 1839 - ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రా చరిత్రము ముద్రణ
- 1846 - త్యాగయ్య మరణం
- 1848 - వీరేశలింగం జననం
- 1852 - గోదావరి ఆనకట్ట కాటన్ దొరచే కట్టింపబడింది.
- 1855 - కృష్ణానదిపై ఆనకట్ట
- 1857 - విజయనగరం మహారాజా సంస్కృత, సంగీత కళాశాల ప్రారంభం
- 1860 - చిన్నయసూరి నీతిచంద్రిక, బాల వ్యాకరణం ముద్రణ
- 1870 - కడప -కర్నూలు కాలువ
- 1877 - బకింగ్ హాం కాలువ
- 1886 - విశాఖపట్నం సరస్వతీ నిలయం - మొదటి గ్రంథాలయం స్థాపన
- 1885 - ఆంధ్ర క్రైస్తవ కళాశాల, గుంటూరు
- 1886 - మొదటి కాంగ్రెస్ సమావేశానికి అనంతపురంనుండి పి.కేశవపిళ్ళే హాజరయ్యాడు.
- 1887 - వీరేశలింగం ఆంధ్రకవుల చరిత్ర రచన
- 1893 - శబ్దార్ధ చంద్రిక ముద్రణ (మహాకాళి సుబ్బారావు)
- 1893 - మొదటి రైలు మార్గం
- 1896 - 1897 - తీవ్రమైన కరువు -
- 1900- 1901 - మళ్ళీ చాలా తీవ్రమైన కరువు
- 1900 - గుంటూరులో సాహితీ సంఘం స్థాపన
- 1902 - గుంటూరు జిల్లాలో మొదటి వితంతు వివాహం
- 1903 - కృష్ణానది వరదలు
- 1908 - కాశీనాధుని నాగేశ్వరరావుచే బొంబాయిలో ఆంధ్రపత్రిక స్థాపన
- 1908 - బందరు జాతీయ కళాశాల
- 1911 - బెజవాడ రామమోహన గ్రంథాలయం స్థాపన. గ్రంథాలయోద్యమం ప్రారంభం
స్వాతంత్ర్యోద్యమము
[మార్చు]ఆంధ్రోద్యమములు
[మార్చు]- 1912 - నిడదవోలులో కృష్ణాజిల్లా సభలలో ఆంధ్ర రాష్ట్రం సమస్య బహిరంగ చర్చ
- 1913 మే 20 - బాపట్లలో మొదటి ఆంధ్ర మహాసభ
- 1914 - ఆంధ్ర పత్రిక దినపత్రికగా మద్రాసు నుండి వెలువడడం మొదలు
- 1918 జనవరి 22- "ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ" ఏర్పడింది.
- 1917 - బిసెంటు అధ్యక్షతన కలకత్తా కాంగ్రెస్ సభలలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాటు
- 1919 - దుగ్గిరాల గోపాలకృష్ణయ్య న్యాయకత్వంలో చీరాల-పేరాల ఉద్యమం.
- 1921 - మార్చి 31: పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని విజయవాడ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలలో ఆమోదించారు.
- 1922 - స్వరాజ్య పత్రిక స్థాపన
- 1922 - 1924: రాయలసీమ ప్రాంతంలో తీవ్రమైన కరువు
- 1923 - ఆంధ్రా బ్యాంకు స్థాపన
- 1923 - కాంగ్రెస్ మహాసభలు ఆంధ్ర ప్రాంతంలో కాకినాడలో మొదటిసారి జరిగాయి.
- 1926 - ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపన
- 1931 - ఆంధ్ర దేశంలో మొదటి శబ్దచిత్రం తయారు
- 1933 - తెలుగులో రెండవ దినపత్రిక జనవాణి
- 1936 - గుంటూరు, నెల్లూరు జిల్లాలలో పెద్ద గాలివాన
- 1937 - 38: అనంతపురం, కర్నూలు జిల్లాలలో కరువులు
- 1937 - శ్రీబాగ్ ఒడంబడిక
- 1938 - ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోరుతూ కొండా వెంకటప్పయ్య మద్రాసు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాడు. తీర్మానం ఆమోదం పొదింది కాని దాన్ని ఎవరూ పట్టిందచుకోలేదు.
- 1939 - కొండపల్లిలో జరిగిన సభలో ప్రత్యేకాంధ్ర కోరుతున్న అన్ని సంస్థలూ విలీనమై ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సంఘంగా ఏర్పడ్డాయి.
- 1941 - విశాఖపట్నం నౌకా నిర్మాణ కేంద్రం శంకుస్థాపన
- 1942 - రెండవ ప్రపంచయుద్ధం - కాఖినాడ, విశాఖపట్నాలలో జపాను వారి బాంబులు
- 1947 ఆగస్టు 15 : భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.
- 1948 జూన్ 17 - భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటుకు కమిటీ ఏర్పడింది -ఎస్.కె.దార్ అధ్యక్షునిగా
- 1951 ఆగస్టు 15 - స్వామి సీతారాం నిరాహాదీక్ష మొదలయ్యింది. 38 రోజులపాటు సాగిన ఈ దీక్ష ఆచార్య వినోబా భావే హామీతో విరమించబడింది.
- 1952 అక్టోబరు 19 -మద్రాసు రాజధానిగా ఉండే ఆంధ్రరాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఆరంభం. 52 రోజుల దీక్ష అనంతరం పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యాడు. 57 రోజుల దీక్షానంతరం డిసెంబరు 15న శ్రీరాములు అమరజీవి అయ్యాడు.
- 1952 డిసెంబరు 19 - ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు నెహ్రూ అంగీకారం
- 1953 అక్టోబరు 1 - కర్నూలు రాజధానిగా, 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు.. మొదటి గవర్నరు చందూలాల్ మాధవలాల్ త్రివేది. ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం
విశాలాంధ్ర
[మార్చు]- 1953 - సయ్యద్ ఫజల్ ఆలీ కమిషన్ - భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్నిర్మాణ పరిశీలన కొరకు
- 1956 ఆగస్టు 15 - లోక్‌సభ ఏడవ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు
- 1956 జూలై 19 - పెద్దమనుషుల ఒప్పందం. న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు 20 ఫిబ్రవరి 1956 అని, సంతకాలు చేసిన వారు తెలంగాణా తరపున, బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారయణ రాజు, గౌతు లచ్చన్న. చూ. ఆదివారం ఆంధ్రభూమి 2011 జూన్ 19 పుట 10 ) .
- 1956 నవంబరు 1 - ఆంధ్ర ప్రదేశ్ అవతరణ
ఎన్నికలు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]వనరులు
[మార్చు]- ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
- ఏటుకూరి బలరామమూర్తి - ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
- Sir V Ramesam (retired Judge of Madras High Court) - Andra Chronology (90-1800 A.C.) - Published 1946 - Andra Chronology
- పి.వి.కె. ప్రసాదరావు - ఆంధ్రప్రదేశ్ సమగ్రచరిత్ర - ఎమెస్కో, 2007.
- ఆంధ్ర సర్వస్వము - మాగంటి బాపినీడు సంకలనం - ప్రచురణ 1944 - విశాలాంధ్ర పబ్లిషర్స్