పేరాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పేరాల
—  రెవిన్యూ గ్రామం  —
పేరాల is located in Andhra Pradesh
పేరాల
పేరాల
అక్షాంశరేఖాంశాలు: 15°49′13″N 80°21′01″E / 15.820167°N 80.35037°E / 15.820167; 80.35037
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం చీరాల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ .523157
ఎస్.టి.డి కోడ్ 08594

పేరాల : చీరాల మండలములోని ఒక గ్రామము.[1] పిన్ కోడ్ నం.523 157., ఎస్.టి.డి.కోడ్ = 08594.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఆంధ్రరత్న పురపాలక ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ కౌతవరపు రాజేంద్రప్రసాద్, ఐదుపైసల నాణేలతో వివిధ రకాల కళాకృతులను రూపొందించినండుకు, "ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్" లో స్థానం సంపాదించుకున్నారు. గతంలో వీరు ఐదుపైసల నాణేలతో చార్మినార్, శివలింగం, ఓడ, కంటివైద్యశాల, వి.ఆర్.ఎస్. మరియూ వై.ఆర్.ఎన్. కలాశాలల నమూనా తయారుచేసినందుకు, ఈ అరుదైన గుర్తింపు లభించినది. గతంలో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గూడా వీరిపేరు నమోదయినది. కళారత్న, ఆంధ్రరత్న తదితర పురస్కారాలతోపాటు, ఈయనకు, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సభ్యత్వం గూడా లభించినది. [1]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

భారతీయ స్టేట్ బ్యాంక్, పేరాల శాఖ.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. పునుగు శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవాలయం.
  2. శ్రీ మదనగోపాలస్వామివారి దేవాలయం.

ఈ రెండు ఆలయాలదీ 300 సంవత్సరాల చరిత్ర. ఆ రోజులలోనే దాతలు నిర్వహణకై శివాలయానికి 8.35 ఎకరాలూ, మదనగోపాలునికి 12 ఎకరాలూ నిర్వహణకు, భూమిని విరాళంగా అందజేసినారు. ఈ భూములు అన్యాక్రాంతమై, ఆలయాల నిర్వహణ తీరు బాగుగా లేదు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014,డిసెంబరు-18; 11వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2016,ఫిబ్రవరి-21; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=పేరాల&oldid=2626786" నుండి వెలికితీశారు