ఐతరేయ బ్రాహ్మణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూ మతము

ఐతరేయ బ్రాహ్మణం (సంస్కృతం: ऐतरेय ब्राह्मण) బ్రాహ్మణాలలో ఒకటి. ఇది ఋగ్వేదంలోని శాఖల శాఖ చెందినది, ఈ భ్రాహ్మణం సంప్రదాయం ప్రకారం మహీదాస ఐతరేయుడు నకు సంబంధించినది .[1][2]

బ్రాహ్మణాలు నిర్వచనము[మార్చు]

 • బ్రాహ్మణాలు, లో పురాణాలు, తత్వశాస్త్రం మరియు వేదాల ఆచారాలు గురించి వ్యాఖ్యానాలు ఉంటాయి. వేదసంహితలు తదుపరి మహోన్నత స్థానం బ్రాహ్మణాలు కలిగి ఉన్నాయి. ఇవి వేదాలలోని అంతర్భాము. చతుర్వేదాలలోని సంహిత (శ్లోక, మంత్ర) భాగములకు బ్రహ్మ పదాన్ని, వ్యాఖ్యాన రూపంగా ఉన్నదానికి బ్రాహ్మణం అని చెప్పబడు తున్నది. ఈ నాలుగు వేదాలలో గల మంత్రాలను, ఎక్కడెక్కడ, ఏఏ యజ్ఞములకు ఈ మంత్రాలను ఎలా వినియోగించాలి, ఆయా వాటిని అవసరమైన చోట వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి గ్రంథాలకు బ్రాహ్మణాలు అని అంటారు. బ్రాహ్మణాల గ్రంథాలందు సంహితలలోని శ్లోకాల నిగూఢ అర్థాన్ని చెబుతూ అనేక వివరణలతో పాటుగా, ఉపాఖ్యానలు కూడా తెలియజేస్తాయి. [3]

ఐతరేయ మహర్షి (ఐతరేయుడు) చరిత్ర[మార్చు]

 • ఐతరేయము అనగా ఇతరము అని అర్ధము. పూర్వము ఎంతో మంది భార్యలు కలిగి ఉన్న కాత్యాయనుడుకి "'ఇతర"' అనే పేరు గల భార్య ( మొదటి భార్య కాదు) కూడా ఉంది. వీరిద్దరి కుమారుడు మహీదాస ఐతరేయుడు.

విభాగము[మార్చు]

 • ఐతరేయ బ్రాహ్మణంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాలు తిరిగి ఖండాలు గా విభజింపబడ్డాయి ఐదు అధ్యాయాలను పంచిక అని అంటారు. ఈ బ్రాహ్మణం ఎనిమిది పంచికలుగా విభజింపబడింది. ఈ క్రింద సూచించిన పట్టిక ద్వారా వాటికి సంబంధించిన విషయాలను తెలియజేస్తుంది.[4]

అష్టక విభాగం[మార్చు]

సంచికలు అధ్యాయాలు ఖండాలు సంచికలు అధ్యాయాలు ఖండాలు
I 1 6 V 21 5
2 5 22 10
3 6 23 4
4 9 24 6
5 4 25 9
మొత్తం: 30 మొత్తం: 34
II 6 10 VI 26 3
7 8 27 5
8 6 28 8
9 8 29 10
10 9 30 10
మొత్తం: 41 మొత్తం: 36
III 11 11 VII 31 1
12 13 32 11
13 14 33 6
14 6 34 8
15 6 35 8
మొత్తం: 50 మొత్తం: 34
IV 16 6 VIII 36 4
17 8 37 7
18 8 38 3
19 6 39 9
20 4 40 5
మొత్తం: 32 మొత్తం: 28
మొత్తం ఖండాలు 153 + మొత్తం ఖండాలు 132 = 285

బ్రాహ్మణాలు (ఋక్సంహిత)[మార్చు]

 • సంహిత యొక్క ప్రతి ప్రధాన శాఖకు ఒక బ్రాహ్మణం ఉండాలి/ఉండేది.
 • ఋక్సంహితకు 21 శాఖలు ఉన్నట్లుగా తెలియుచున్నది. ఆ విధముగా 21 బ్రాహ్మణాలు తప్పకుండా ఉండాలి.
 • ఋగ్వేదానికి కౌషీతకి బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం, అశ్వలాయన బ్రాహ్మణం గాలవ బ్రాహ్మణం బహ్వృచ బ్రాహ్మణం పైంగి బ్రాహ్మణం అని ఆరు బ్రాహ్మణములు మాత్రమే దృశ్యించినారని తెలుస్తున్నది.
 • ఈ ఆరింటిలోనూ, ప్రస్తుతము ఐతరేయ బ్రాహ్మణం, కౌషీతకి బ్రాహ్మణం అను రెండు బ్రాహ్మణములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతావన్నీ చరిత్రలో కలసి పోయి నామమాత్రంగానే మిగిలిపోయాయి.
 • ఐతరేయ బ్రాహ్మణాన్ని బహ్వృచ బ్రాహ్మణం అని కూడా కొందరి వాదన, అభిప్రాయము ఉంది.[3]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Keith, Arthur Berriedale (1998) [1920]. Rigveda Brahmanas: the Aitareya and Kauṣītaki Brāhmaṇas of the Rigveda. Delhi: Motilal Banarsidass. p. 28. ISBN 81-208-1359-6.
 2. Roman alphabet transliteration
 3. 3.0 3.1 "ఆర్ష విజ్ఞాన సర్వస్వము" - ప్రధానసంపాదకుడు: డాక్టర్ ఎన్.బి.రఘునాథాచార్య - తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురణ
 4. https://en.wikipedia.org/wiki/Aitareya_Brahmana