Jump to content

శివకుమార స్వామీజీ

వికీపీడియా నుండి

డా॥శ్రీశ్రీశ్రీ శివకుమార స్వామీజీ కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో ఉన్న శ్రీసిద్ధగంగ మఠానికి మఠాధిపతి. ఈయనే శ్రీసిద్దగంగ ఎజ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. 1907 ఏప్రిల్ 1 న జన్మించిన ఈయన వయస్సులో శతాధికులు. 1930 లో విరక్తాశ్రమంలోకి ప్రవేశించబడ్డారు. స్వామీజీ మాగడి తాలూకలోని వీరపూరలో పుట్టారు. ఆయనొ వీరపుర, నాగవళ్లిలో ప్రాథమిక విద్యను కలిగి ఉన్నారు. అతను సెకండరీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ హైస్కూల్ తుమకూరు, బెంగుళూరు యూనివర్సిటీ నుండి పూర్వ విశ్వవిద్యాలయము, డిగ్రీని సెంట్రల్ కాలేజ్, బెంగళూరులో పూర్తి చేసారు. ఈ సమయములో (1927-1930) రావు బహదూర్ ధర్మప్రవర్ధ గుబ్బి తోటదప్ప హాస్టల్ లో బసచేశారు. ఆయనొక ఆంగ్ల కళాశాలలో చదివారు, అయినప్పటికీ కన్నడ, సంస్కృతంలో నిష్ణాతులు. సాంప్రదాయంగా సంస్కృతంతో పాటూ ఆధునికంగా విజ్ఞానాన్ని చదివించే ఎన్నో విద్యాసంస్థలను ఈయన స్థాపించారు. అందువలనే అన్ని వర్గాలవారూ ఈయన్ని గౌరవిస్తారు.ఈయన చేసిన మానవతావాద పనులకు కర్ణాటక విశ్వవిద్యాలయం ఈయన్ని గౌరవ డాక్టరేట్ తో 1965లో సత్కరించింది. 107 ఏళ్ళ వయసులో కూడా ఈయన సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 2015లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

స్వామీజీ అబ్దుల్ కలాంతో

సామాజిక కార్యక్రమాలు

[మార్చు]

స్వామీజీ గురుకులంలో దాదాపు 8500 మంది 5 నుండి 16 ఏళ్ళ వయసు పిల్లలకు కులమతాలకు అతీతంగా పూర్తి ఉచితంగా విద్యను అభ్యసిస్తున్నారు. వసతి ఇంకా భోజనం కూడా గురుకులమే భరిస్తుంది. సిద్దగంగ ఆశ్రమం పరిసరాల్లో ఉండే గ్రామస్తుల కోసమని ప్రతియేటా ఒక వ్యవసాయ సంత జరుగుతుంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2007 నుండి శివకుమార స్వామీజీ పేర ఆయన శాతాబ్ది సంవత్సర సందర్భంలో ఒక పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. డా॥ఏపీజే అబ్దుల్ కలాం కూడా తను రాష్ట్రపతిగా ఉన్నపుడు ఆశ్రమాన్ని సందర్శించి స్వామీజీని పొగిడారు.