వైఖానసం
| ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
| వేదములు (శ్రుతులు) | |
|---|---|
| ఋగ్వేదం · యజుర్వేదం | |
| సామవేదము · అధర్వణవేదము | |
| వేదభాగాలు | |
| సంహిత · బ్రాహ్మణము | |
| అరణ్యకము · ఉపనిషత్తులు | |
| ఉపనిషత్తులు | |
| ఐతరేయ · బృహదారణ్యక | |
| ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
| కఠ · కేన · ముండక | |
| మాండూక్య ·ప్రశ్న | |
| శ్వేతాశ్వర | |
| వేదాంగములు (సూత్రములు) | |
| శిక్ష · ఛందస్సు | |
| వ్యాకరణము · నిరుక్తము | |
| జ్యోతిషము · కల్పము | |
| స్మృతులు | |
| ఇతిహాసములు | |
| మహాభారతము · రామాయణము | |
| పురాణములు | |
| ధర్మశాస్త్రములు | |
| ఆగమములు | |
| శైవాగమం · వైఖానసము ·పాంచరాత్రము | |
| దర్శనములు | |
| సాంఖ్య · యోగ | |
| వైశేషిక · న్యాయ | |
| పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
| ఇతర గ్రంథాలు | |
| భగవద్గీత · భాగవతం | |
| విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
| లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
| శివ సహస్రనామ స్తోత్రము | |
| త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
| పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
| ... · ... | |
| ఇంకా చూడండి | |
| మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం | |

వైఖానసం చాలా పురాతనమైన వైష్ణవశాఖ. రామానుజాచార్యులు “నమామి వైఖానసం ఆదివైష్ణవం” అంటూ ఆదివైష్ణవంగా వైఖానస సాంప్రదాయానికి కైమోడ్పులందించారు.
వైఖానసులు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు.వీరు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను, వైఖానస కల్పసూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. ఈ శాఖ పేరు విష్ణుమూర్తి ఆత్మజుడు,స్వాయంభువ మన్వంతరంలో బ్రహ్మ అయిన విఖనస మహర్షి నుండి వచ్చింది. వైఖానసులు ఏకేశ్వర భావాన్ని నమ్ముతారు. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తరమీమాంసను కూడా అన్వయం చేసుకుని బ్రహ్మసూత్రాలకి లక్ష్మీవిశిష్టాద్వైతం అనుభాష్యమును మూల సిద్ధాంతమును అనుసరించి భగవాదారాధన మార్గాన్ని వైఖానసం బోధిస్తుంది . తిరుమల వేంకటేశ్వరుని తో సహా అనేక వైష్ణవ ఆలయాల నిత్య పూజలకి ప్రామాణికం వైఖానస ఆగమం.[1]
చరిత్ర
[మార్చు]వైఖానసులు ఒక తపస్సంపన్నుల సమూహం. వీరి ప్రస్తావన మొదటి సారిగా మనుధర్మశాస్త్రంలో వస్తుంది. మనువు మనిషి యొక్క వర్ణాశ్రమంలోని ఆఖరి రెండు చరమాంకాలయిన వానప్రస్థం ఇంకా సన్యాసాశ్రమం గురించి చెబుతూ వైఖానస నిబంధనను తెలుపుతాడు. తద్వారా వైఖానస సముదాయం ఆ కాలానికే ఉందని తెలుస్తుంది. నారాయణీయంలో కూడా వీరి ప్రస్తావన వస్తుంది. వ్యాసప్రణీతమైన విష్ణుసహస్రనామ స్తోత్రమ్ లో కూడా “ఆత్మయోని స్వయంజాతో వైఖానస్సామగాయనః” అంటూ ప్రస్తావించబడింది. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు కూడా వైఖానసాన్ని అనాది సాంప్రదాయంగా ఉద్ఘాటించారు
వైఖానస-పాంచరాత్ర వైరం
[మార్చు]ఒక కథనం ప్రకారం శైవుల రాక వలన వైఖానసులంతా తిరుమల ఆలయం చేరతారు. వీరు వీడి వచ్చిన ఆలయాలన్నీ అప్పటి చోళ రాజు స్వాధీనం చేసుకుని శైవాలయాలుగా మార్చివేస్తాడు. కొద్ది కాలానికి ఆ ఆలయాలలో తిరిగి వైష్ణవ పూజలను రామానుజుల ఆధ్వర్యంలో శ్రీవైష్ణవులు కొనసాగిస్తారు. అంతలోనే అందరు వైఖానసులు నరికివేయబడతారు. అది చోళరాజు చేయించినదా లేక రామానుజులు చేయించిన చర్యనా అన్నది ఎవరికీ తెలీదు. ఆ విధంగా ఒక్క వైఖానస పురుషుడు కూడా మిగలకుండా అవుతుంది. అప్పుడు రామానుజులు వేంకటేశ్వర స్వామిని సమీపించి పూజాపునస్కారాల విషయమై చర్చిస్తూ, శ్రీవైష్ణవుల ఆధ్వర్యంలో పూజలు జరగాలని స్వామి వారిని కోరతాడు. కానీ స్వామివారు ఒక వైఖానస బాలకుడి విషయం తెలిపి అతనికి ఉపనయనం చేయించి అతని చేతనే పూజలు జరిపించాలని కోరతాడు. రామానుజులు ఈ విషయమై విముఖంగా ఉంటాడు. పాంచరాత్రాగమంలోనే పూజలు జరగాలన్నది ఆయన ఆశయం. ఈ బాలుణ్ణి కూడా హతమార్చాలని పన్నాగం జరుగుతుంది. స్వామి పుష్కరిణిలో మునిగి తేలగానే ఆ బాలుడు వటువుగా మారిపోతాడు. స్వామివారి వైభవం తెలుసుకున్న ఇతరులు, రామానుజులు తిరుమల పూజలను తిరిగి వైఖానసులకే అప్పగిస్తాడు. అప్పటి నుండి తిరుమల ఆలయం మొదలు చాలా ఆలయాల్లో వైఖానస-శ్రీవైష్ణవ వైరం ముందుకొస్తుంది. నేటికీ కొన్ని ఆలయాలలో ప్రధానార్చకత్వంపై వివాదాలున్నాయి. అయినా శ్రీరంగంలోని రామానుజుల పార్థివశరీరమూర్తి అని చెప్పబడే తాన్ ఆన తిరుమేణికి పూజ చేసేది వైఖానసులే.
ఈ మతాన్ని పాటించేవారు
[మార్చు]దాదాపుగా 4000కుటుంబాలున్న ఈ మతానుయాయులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకలోని కొన్ని ప్రాంతాలు, ఇంకా విదేశాల్లోని వైష్ణవాలయాల్లో పూజారులుగా కనిపిస్తారు. తమని వేరే శ్రీవైష్ణవుల నుండి విడిగా గుర్తించడానికి తిరుచూర్ణం స్థానంలో (నిలువు నామాలకు మధ్య వచ్చే నిలువు గీత) కేసరి రంగు మిశ్రమాన్ని వాడతారు. ఇతర వైష్ణవులు నామంలో ఎర్రని పొడిని వాడతారు. వీరెక్కువగా తెలుగు మాట్లాడుతారు. అరవం వారు కూడా తెలుగు లిపిని చదవగలుగుతారు.
మత సిద్ధాంతం
[మార్చు]వైఖానసులు, వారి నమ్మకం ప్రకారం, వైదిక సాంప్రదాయమైన కృష్ణ యజుర్వేదీయ తైత్తీరియ శాఖను పాటించే జీవిత సమూహం. వైఖానస సాంప్రదాయం ప్రకారం ఋషివిఖనసుడు మహావిష్ణువు యొక్క అంశతో మహావిష్ణువుకే జన్మించాడు. బ్రహ్మతో పాటుగానే ఇతనికి ఉపనయనం జరిగింది. మహావిష్ణువే గురువుగా సమస్త వేదాలు,, భగవత్ శాస్త్రాన్ని అభ్యసిస్తాడు. ఆపై భూమి మీదకి నైమిశారణ్యం వద్దకు వస్తాడు. అక్కడ వైఖానస కల్పసూత్రాన్ని రచించి తన నలుగురు శిష్యులైన అత్రి, భృగువు, కశ్యపుడు, మరీచికి ఉపదేశిస్తాడు. అత్రికి సమూర్తార్చన, భృగువుకి అమూర్తార్చన, కశ్యపుడికి తర్కం-జపం,, మరీచికి అగ్ని హుతం పై ఉపదేశాలు చేస్తాడు. వైఖానసుల ప్రకారం వైదిక హవిస్సు క్రతువునే వీరు కొనసాగిస్తున్నారు. యాగం చేస్తూ అగ్నిలో హవిస్సులు పోస్తే వచ్చే ఫలితమే వైష్ణవారాధాన ద్వారా వస్తుందని నమ్ముతారు. విష్ణువు యొక్క ఐదు రూపాలను వీరు కొలుసారు -
- విష్ణువు - సర్వాంతార్యామియైన దేవాదిదేవుడు
- పురుషుడు - జీవితం యొక్క సూత్రము
- సత్యము - దైవం యొక్క మారని అంశం
- అచ్యుతుడు - మార్పు చెందని వాడు
- అనిరుద్ధుడు - ఎన్నటికీ తరగని వాడు
మూలములు
[మార్చు]- ↑ "వైఖానసం జాలగూడు". Archived from the original on 2014-06-13. Retrieved 2014-01-03.
దేన్నీ మూలముగా స్వీకరించారో దాని ప్రామాణికత తెలియడం లేదు. వైఖానస పాంచరాత్ర వైరములు అతిగా చూపించారు