Jump to content

పుంసవన వ్రతం

వికీపీడియా నుండి
కశ్యపుడు దితికి చెప్పిన వ్రతం పుంసవనం

భాగవతం స్వయంగా మహా విశ్వం దీనిలో పరలోక అర్థ మార్గాలే కాదు ఇహలోక అర్థాలకు కూడా చక్కటి మార్గాలు ఉన్నాయి. అవి భక్తి మార్గాల రూపంలో, మంత్రాల రూపాలలో, స్తోత్రాల రూపాలలో, వ్రతాల రూపాలలో ఉన్నాయి. అట్టి వ్రతాలలో ఆరవ స్కంధంలోని (భా-6-521-వ.) పుంసవనం ప్రధాన మైంది. కశ్యపుడు దితికి చెప్పిన వ్రతం పుంసవనం

వ్రత విశేషాలు

[మార్చు]

మంగళ గౌరీ వ్రతం, పదహారు ఫలాల వ్రతం, సత్యన్నారాయణ వ్రతం లాంటివి సాధారణంగా వింటాం. వ్రతాలు ఏదో ఒక ఫలం కోసం చేస్తారు. వ్రతానికి అధిదేవత, నియమాలు, విధానం, సంకల్పం, ఉద్యాపన, ఫలం ఉంటాయి. రాక్షసుల తల్లి దితికి మరీ ప్రత్యేక లక్షణాలు గల కొడుకు కావాలిట. మరీ ఇంద్రుడిని ఓడించ గలవాడు కావాలిట. అందుకు తగిన శక్తివంత మైన అసాధరణ వ్రతాన్ని దితికి కశ్యపుడు ఉపదేశించాడు. ఈ వ్రతం ఎంత కష్టసాధ్య మైందో. అంత ప్రభావవంత మైంది. పుంసవనం అంటారు. వివాహం త్వరగా జరగటానికి, కల్యాణకర కార్యాలు సాధించటానికి రుక్మిణీ కల్యాణ పారాయణ ఎంత ప్రభావవంత మైందో, విశిష్ట సంతాన సాధనకు పుంసవనం అంత ప్రసిద్ధి చెందినది. దీనిని అనుకూలించుకొని ప్రయోగిస్తే ఎంతటి కష్టసాధ్య మైన ఫలితా న్నైనా సాధించ వచ్చు అంటారు. దీని వివరాలు చూద్దాం

అనుష్ఠాన కాలము

[మార్చు]

ఒక్క సంవత్సరం.

సంకల్పం

[మార్చు]

ఆరంభ దినం నాటి ఉదయం . . . . శ్రీ మహా విష్ణు దేవ ప్రీత్యర్థం . . . . సంవత్సర కాల పర్యంత పుంసవన వ్రతం కరిష్యామి అని సంకల్పం చెప్పుకొని. షోడశోపచార యుక్తంగా అర్చన యథావిధిగా చేయాలి.
తరువాత ప్రతి దినం . . . . శ్రీ మహా లక్ష్మీ నారాయణ దేవ ప్రీత్యర్థం . . . . పుంసవన వ్రతం కరిష్యామి అని సకల్పం చెప్పుకొని అర్చన యథావిధిగా చేయాలి.

వ్రత నియమాలు

[మార్చు]
  1. ఏ జీవుల ఎడల హింసాభావముతో ఉండరాదు.
  2. గట్టిగా మాట్లాడరాదు.
  3. కోపం మానాలి.
  4. అబద్ధం పలుకరాదు.
  5. గోళ్ళు, జుట్టు కత్తిరించరాదు.
  6. ఎముకలు, కపాలము మొదలైన అమంగళ వస్తువులను తాకరాదు.
  7. నదిలో కాని చెరువులో కాని స్నానం చేయాలి. కుండలలోని, నూతులలోని నీటితో స్నానం చేయరాదు.
  8. దుర్జనులతో మాట్లాడరాదు.
  9. కట్టిన బట్టలు, ముడిచిన పూలు మళ్ళీ ధరించరాదు.
  10. పంచవిధ నిషిద్ధాన్నాలు అనగా:
    1. ఎంగిలి చేసిన పదార్థాలు;
    2. అమ్మవారికి నివేదించిన (బలి) అన్నం;
    3. తలవెంట్రుక పడ్డ అన్నం; కుక్కు పిల్లి కాకి ముట్టిన అన్నం; పురుగులు చీమలు పట్టిన అన్నం;
    4. మాంసాహారం;
    5. శూద్రులు తెచ్చిన అన్నం తినరాదు.
  11. దోసిళ్ళతో నీళ్ళు తాగరాదు.
  12. ఉదయ సాయంకాల సంధ్యలలో జుట్టు విరబోసుకోరాదు.
  13. మితంగానే మాట్లాడాలి.
  14. అలంకరించుకోకుండ ఉండరాదు.
  15. బయట తిరుగరాదు.
  16. కాళ్ళు కడుక్కోకుండా నిద్రపోరాదు.
  17. తడికాళ్ళతో పడుకోరాదు.
  18. పడమట దిక్క తల పెట్టుకొని కాని, నగ్నంగా కాని, సంధ్యాసమయాలలో కాని నిద్రించరాదు.
  19. ఎప్పుడు శుభ్రమైన బట్టలు కట్టుకొనే ఉండాలి.
  20. ఎప్పుడు శుచిగా ఉండాలి.
  21. ఎప్పుడు సర్వ మంగళ చిహ్నాలతోటి ఉండాలి.

వ్రత విధానము

[మార్చు]

నిత్యం నియమబద్దంగా ఉంటూ, రోజూ పొద్దున్నే లక్ష్మీనారాయణుల (షోడశోపచార) పూజ చేసి. హోమం చేసి, నమస్కరించి, భగవన్మంత్రం (ఓం నమో భగవతే వాసుదేవాయః) పది సార్లు పారాయణం చేసి, గంధం, పుష్పం, అక్షతలతో ముత్తైదువలను పూజించి, పతిని సేవించాలి. కొడుకు కడుపులో ఉన్నట్లు భావించాలి.

ఈ విధంగా మార్గశిర శుద్ధ పాడ్యమి సంకల్పం చెప్పుకొని ప్రారంభించి, ఒక సంవత్సరం పూర్తిగా నిర్విఘ్నంగా ఆచరించాలి.

ఉద్యాపన

[మార్చు]

ఆఖరి రోజున పద్ధతి ప్రకారం ఉద్యాపన చేయాలి. వ్రతం చేస్తున్న ఏడాది కాలంలోను పొరపాటున కూడా నియమభంగం కలుగ రాదు.

మూలాలు

[మార్చు]

https://web.archive.org/web/20150520040029/http://pothana-telugu-bhagavatham.blogspot.in/p/vivaranalu.html