Jump to content

సంవత్సరం

వికీపీడియా నుండి
(సంవత్సరము నుండి దారిమార్పు చెందింది)

సంవత్సరము అనేది ఒక కాలమానము. భూమి సూర్యుని చుట్టూ తిరిగే భ్రమణ క్రమంలో ఒక స్థానానికి భూమి తిరిగి రావడానికి పట్టే కాలాన్ని (సమయాన్ని) సంవత్సరం అంటారు. ఇదే నిర్వచనాన్ని ఇతర గ్రహాలకూ విస్తరించవచ్చును. ఉదాహరణకు సూర్యుని చుట్టూ అంగారక గ్రహం ఒకమారు తిరగడానికి పట్టే కాలాన్ని "అంగారక సంవత్సరం" అనవచ్చును. ఒక సంవత్సరంలో 365 రోజులు (12 నెలలుగా విభజించబడి) ఉన్నాయి. తెలుగు కేలండర్ ప్రకారం అరవై సంవత్సరాలు ఉన్నాయి. ఇవి చక్రంలాగా మారుతూ ఉంటాయి.

కేలెండర్‌లో రెండు ఒకే తేదీల మధ్య కాలాన్ని "కేలెండర్ సంవత్సరం" అంటారు. గ్రిగేరియన్ కేలెండర్ ప్రకారం vernal equinox మార్చి 21న గాని, అంతకు కొంచెం ముందుగాని వస్తుంది. కనుక గ్రిగేరియన్ కేలెండర్ "tropical year" లేదా "vernal equinox year"ను అనుసరిస్తాయి. ఒక కేలెండర్ సంవత్సరం సగటు పరిమాణం 365.2425 "సగటు సౌర దినాలు" (mean solar days). అంటే ప్రతి 400 సంవత్సరాలకు 97 సంవత్సరాలు లీప్ సంవత్సరాలు అవుతాయి. vernal equinox year సంవత్సరం పరిమాణం 365.2424 రోజులు.

ప్రస్తుతం ఉన్న సౌర కాలమానాలలో పర్షియన్ కేలెండర్ చాలా కచ్చితమైనవాటిలో ఒకటి. అంకెల లెక్కలో కాకుండా ఈ విధానంలో క్రొత్త సంవత్సరం టెహరాన్ నగరంలో టైమ్ జోన్ ప్రకారం vernal equinox సంభవించిన రోజున మొదలవుతుందని విపులమైన ఖగోళశాస్త్రపు లెక్కలద్వారా నిరూపించారు.ఖగోళ కొలమాన సంవత్సరం (సౌరమానం గాని, చాంద్రమానం గాని) దేనిలోనైనా సరైన పూర్ణసంఖ్యలో రోజులు గాని నెలలు గాని ఉండవు. కనుక లీప్ సంవత్సరం విధానం వంటివాటితోలో ఈ కొలతను సరిచేస్తుంటారు. (system of intercalation such as leap years). జూలియన్ కేలెండర్ ప్రకారం సగటు సంవత్సరం పొడవు 365.25 రోజులు. లీప్ సంవత్సరంలో 366 రోజుఉ, మిగిలిన సంవత్సరాలలో 365 రోజులు ఉంటాయి.

కొన్ని సంవత్సరాల పరిమాణాలు

[మార్చు]
  • 346.62 రోజులు - కొన్ని septenary కేలండర్లలో ఒక draconitic year
  • 353, 354 or 355 రోజులు - కొన్ని చాంద్ర, సౌరమాన కేలండర్లలో ఒక సామాన్య సంవత్సరం కాలం.
  • 354.37 రోజులు (12 చాంద్రమాన మాసాలు) - చాంద్రమాన కేండర్లలో ఒక సాధారణ సంవత్సర కాలం.
  • 365 రోజులు - చాలా సౌరమాన కేలండర్లలో ఒక సాధారణ సంవత్సర కాలం.
  • 365.24219 రోజులు - 2000 సంవత్సరం సమయానికి ఒక సగటు tropical సంవత్సరం.
  • 365.2424 రోజులు - ఒక vernal equinox సంవత్సరం.
  • 365.2425 రోజులు - గ్రిగోరియన్ కేలండర్లో ఒక సగటు సంవత్సర కాలం.
  • 365.25 రోజులు - జూలియన్ కేలండర్లో గ్రిగోరియన్ కేలండర్లో ఒక సగటు సంవత్సర కాలం.
  • 365.2564 రోజులు - ఒక sidereal సంవత్సరం.
  • 366 రోజులు - చాలా సౌరమాన కేలండర్లలో లీప్ సంవత్సరం.
  • 383, 384 లేదా 385 రోజులు - కొన్ని చాంద్రసౌరమాన కేలండర్లలో లీప్ సంవత్సరాల కాలాలు.
  • 383.9 days (13 చాంద్రమాన మాసాలు) - కొన్ని చాంద్రసౌరమాన కేలండర్లలో లీప్ సంవత్సరం.

ఒక సగటు గ్రెగోరియన్ సంవత్సరం = 365.2425 రోజులు = 52.1775 వారములు, 8,765.82 గంటలు = 525,949.2 నిమిషములు = 31,556,952 సెకండులు . ఇది సగటు సౌరమాన సంవత్సరం - mean solar year - (SI సంవత్సరం కాదు).

  • ఒక సాధారణ సంవత్సరం = 365 రోజులు = 8,760 గంటలు = 525,600 నిముషాలు = 31,536,000 సెకండులు.
  • ఒక లీప్ సంవత్సరం = 366 రోజులు = 8,784 గంటలు = 527,040 విముషాలు = 31,622,400 సెకండులు.
  • గ్రిగోరియన్ కేలండర్‌లో 400 సంవత్సరాల cycleలో 146,097 రోజులు ఉంటాయి. అనగా సరిగగా 20,871 వారాలు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సంవత్సరం&oldid=3299873" నుండి వెలికితీశారు