కేలండరు
కాలెండరు, లేదా క్యాలెండరు (ఆంగ్లం: క్యాలెండర్) అనగా, సంవత్సరంలో అన్ని రోజులు, వారాలు, నెలలు కాలాన్ని చూపించే ముద్రిత పట్టికను క్యాలెండరు అని అంటారు.[1]అయితే ప్రస్తుత సాంకేతిక యుగాలలో పుస్తక రూపం కాకుండా వివిధరూపాలలో తయారవుతుంది.దీనిని సామాజిక, ధార్మిక, వర్తక లేదా పరిపాలనా సౌలభ్యంకొరకు తయారు చేయబడింది.దీనిలో కాలం, దినములు, వారములు, నెలలు,, సంవత్సరములు తగు రీతిలో అమర్చబడి వుంటాయి. దీనిలో ప్రతి దినమునకు 'ఒక కేలండర్ దినం' అని సంబోధిస్తారు. అన్ని సంస్కృతులలోనూ, నాగరికతలలోనూ, వారి వారి విధానాలను బట్టి, వారి అవసరాలను బట్టి వారి కేలండర్లు వుంటాయి.ఈ కేలండర్లు, పేపర్లపై గాని, కంప్యూటర్ విధానాలలో గాని తయారుచేస్తారు.కేలండర్, పరిపాలనా యంత్రాంగం వారు, ప్రత్యేక కార్యక్రమాల అనుసారం సాంవత్సరిక కార్యక్రమాల పట్టికను తయారు చేస్తారు, ఉదాహరణకు అకాడమిక్ కేలండర్, కోర్టు కేలండర్.).
సమకాలీన కాలంధరలు
[మార్చు]- గ్రెగోరియన్ కేలండరు : ప్రపంచమంటా ప్రామాణికంగా ఉపయోగించబడుతుంది
- హిందూ కేలండరు : భారత్ నేపాల్ లలోఉపయోగించబడుతుంది.
- తెలుగు కేలండరు : ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగించబడుతుంది.
- ఇస్లామీయ కేలండరు : ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలలో ఇతర దేశాలలో ఉపయోగించబడుతుంది.
- చాంద్రమాన కేలండరు: చంద్రుని గమనాలపై ఆధారపడి తయారుచేసింది. ఈ కేలండరు ప్రస్తుతం ఎక్కువగా ముస్లింలు ఉపయోగించే ఇస్లామీయ కేలండరుకు మూలం.
- బిక్రమి కాలెండరు: ఈ కాలెండరు మార్చి నుండి ప్రారంభమవుతుంది.వసంతకాలంతో ప్రారంభంతో ప్రారంభమై 365 రోజుల వరకు ఉంటుంది.
- నానాక్షాహి కేలండరు:ఈ కాలెండరు శకం మొదటి సిక్కుల గురువైన నానక్ దేవ్ జన్మసంవత్సరమైన 1469 నుండి ప్రారంభమైంది.
- పంజాబీ కేలండరు: విక్రమాదిత్యశకం నుండి వచ్చిన బిక్రమి కేలండరు ఆధారంగా రూపొందించబడి క్రీ.పూ 57 నుండి మొదలయింది.
- ఇరానియన్ కేలండెరు: ఇరాన్, ఆప్ఘనిస్తాన్ లలో ఉపయోగించబడుతుంది.
- హెబ్ర్యూ కేలండరు : ప్రపంచంలో వున్న యూదులు ఉపయోగిస్తారు.
- బౌద్ధుల కేలండరు : బౌద్ధులున్న చోట ఉపయోగిస్తారు.[2]
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "CALENDAR | meaning in the Cambridge English Dictionary". dictionary.cambridge.org (in ఇంగ్లీష్). Retrieved 2020-08-05.
- ↑ NASA - Year Dating Conventions
వనరులు
[మార్చు]- మహీధర నళినీమోహన్, కాలంధర కథ, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజ్ఞాన్ భవన్, బ్యాంక్ వీధి, హైదరాబాదు, 1981.
బయటి లింకులు
[మార్చు]- Frequently Asked Questions about Calendars
- Various calendars Archived 2008-03-21 at the Wayback Machine described as part of the Calendars through the Ages Archived 2014-06-20 at the Wayback Machine online exhibit
- Current calendar.
- పంచాంగం 2016 (Calendian) Archived 2016-06-13 at the Wayback Machine
- Ancient Calendars NIST website Archived 2008-04-09 at the Wayback Machine
- Calendar of all legal Public and Bank Holidays worldwide, until 2050
- https://web.archive.org/web/20090602042315/http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2008%2F28-12%2Fcoverstory
- https://web.archive.org/web/20100808080405/http://www.eenadu.net/htm/weekpanel1.asp