Seal of Punjab India (left) Coat of Arms Punjab Pakistan (right)
పంజాబీ కేలండరువిక్రమాదిత్య రాజు నుండి వచ్చిన బిక్రమి కేలండరు ఆధారంగా రూపొందించబడి క్రీ.పూ 57 నుండి మొదలయింది. ఈ కేలండరు బిక్రమి కేలండరులోని సౌర అంశాల కోసం ఉపయోగపడుతుంది. దీనిలో వైశాఖిలోని మొదటి రోజును పంజాబీలు కొత్త సంవత్సర దినంగా "వైశాఖి"గా జరుపుకుంటారు.
పంజాబీ చాంద్రమాన కాలెండరు చైత్ తో మొదలవుతుంది. ఈ మాసం మొదటి రోజు కొత్త చంద్ర సంవత్సరం యొక్క ప్రారంభ దినం కాదు. ఈ నెలలో వచ్చే అమావాస్య నుండి ప్రారంభమవుతుంది. పంజాబీ చాంద్రమాన కేలండరులో ప్రతీ మాసం ఆ నెలలోని పౌర్ణమి తరువాత రోజు ప్రారంభమై తరువాత నెల పౌర్ణమి ముందురోజు అంతమవుతుంది. అందువలన చైత్ మాసం రెండు భాగాలుగా రెండు సంవత్సరాలకు విడిపోతుంది. అయినప్పటికీ చైత్ కొత్త సంవత్సరం పంజాబీ అధికార కొత్త సంవత్సరం కాదు. కానీ చాంద్రమాన సంవత్సరం చైత్ నుండి ప్రారంభమవుతుంది. పంజాబీ ఫోక్ కవితలు, బరాహ్హ్ మహా, సంవత్సరం మొదలుతో ప్రారంభమవుతాయి. పంజాబీ క్యాలెండర్లో చాంద్రమాన కారక అనేక పంజాబీ పండుగలను నిర్ణయిస్తుంది.
2014/2015 యొక్క చాంద్రమాన కేలండరు ఈ దిగువనీయబడింది.[1]