నానాక్షాహి కేలండర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నానాక్షాహి (పంజాబీ: ਨਾਨਕਸ਼ਾਹੀ, nānakashāhī)కాలెండారు సౌర కాలెండరు. ఇది శిరోమణి గురుద్వారా ప్రభంధక్ కమిటీ చే తీసుకోబడినది. ఈ కాలెండరులో ముఖ్యమైన సిక్కుల సంఘటలను, పండగలు ఉంటాయి. ఈ కాలెండరు సిక్కులకు నాయకత్వం వహించిన తాకత్ శ్రీదాందమ సాహిబ్ వద్ద గల ప్రసిద్ధ సిక్కు గురువు ప్రొఫెసర్ కృపాల్ సింగ్ బాదుంగర్ ఎస్.జి.పి.సి అధ్యక్షునిగ ఉన్న సమయంలో అమలుచేయబడినది.[1] దీనిని పాల్ సింగ్ పూరెవాల్ చే రూపొందించాడు. ఇది శక కాలెండరు స్థానంలో వచ్చి 1998 నుండి వాడకంలో ఉన్నది. ఈ కాలెండరు యొక్క శకం మొదటి సిక్కుల గురువైన నానక్ దేవ్ జన్మసంవత్సరమైన 1469 నుండి ప్రారంభమైనది. ప్రతీ సంవత్సరం కొత్తసంవత్సరం గ్రెగారియన్ కాలెండరు ప్రకారం మార్చి 14 న ఉంటుంది.[1] ఈ కాలెండరును ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం గురుద్వారాలలో అంగీకరించారు. సిక్కుల యొక్క సనాతన శాఖలలో ఈ కాలెండు గూర్చి వివాదాలున్నాయి.[2] కొన్ని సనాతన సిక్కు శాఖలు దీనిని అంగీకరించడం లేదు.

ఈ కాలెండరు యొక్క ముఖ్యమైన లక్షణాలు:

 • ఒక ఉష్ణమండల సౌర క్యాలెండర్
 • గురునానక్ తరువాత నానాక్షి కాలెండరు గా పిలుస్తారు.
 • గురునానక్ జన్మ సంవత్సరం (1469 CE) మొదటి సంవత్సరం. ఉదాహరణకు, ఏప్రిల్ 2014 CE అనగా నానాక్షహి 546.
 • పశ్చిమ కాలెండరు యొక్క మెకానిక్స్ అధికంగా వాడుతారు.
 • పశ్చిమ కాలెండరు వలెనే సంవత్సరం నిడివి ఒకే విధంగా ఉంటుంది. (365 రోజుల 5 గంటల 48 నిమిషాల 45 సెకండ్లు)
 • ఐదు నెలలకు 31 రోజులు , ఏడు నెలలకు 30 రోజులు ఉంటాయి.
 • ప్రతీ నాలుగు సంవత్సరాలకు లీపు సంవత్సరం చివరి నెల ఫాల్గున మాసంలో ఒక రోజు ఎక్కువ వస్తుంది.
 • 2003 లో అకల్ టక్త్ చే అమోదించబడినది తరువాత సవరించబడినది.

నెలలు[మార్చు]

నానాక్షహి కేలండరులో నెలల వివరాలు: [1][3]

నెం. పేరు పంజాబీ రోజులు గ్రెగారియన్ నెకలు
1 చెత్ ਚੇਤ 31 14 మార్చి – 13 ఏప్రిల్
2 వైశాఖ్ ਵੈਸਾਖ 31 14 ఏప్రిల్ – 14 మే
3 జెత్ ਜੇਠ 31 15 మే – 14 జూన్
4 హర్ ਹਾੜ 31 15 జూన్ – 15 జూలై
5 సావన్ ਸਾਵਣ 31 16 జూలై – 15 ఆగస్టు
6 భాడన్ ਭਾਦੋਂ 30 16 ఆగస్టు – 14 సెప్టెంబరు
7 ఆస్సు ਅੱਸੂ 30 15 సెప్టెంబరు – 14 అక్టోబరు
8 కటక్ ਕੱਤਕ 30 15 అక్టోబరు – 13 నవంబరు
9 మఘర్ ਮੱਘਰ 30 14 నవంబరు – 13 డిసెంబరు
10 పోహ్ ਪੋਹ 30 14 డిసెంబరు – 12 జనవరి
11 మాఘ్ ਮਾਘ 30 13 జనవరి – 11 ఫిబ్రవరి
12 ఫాగున్ ਫੱਗਣ 30/31 12 ఫిబ్రవరి – 13 మార్చి
ముఖ్యమైన సంఘటనలు నానాక్షహి తేదీ గ్రెగారియన్ తేదీ
♦గురుగోవింద సింగ్ జన్మదినం, పదవ సిక్కు గురు u 23 పోహ్ 5 జనవరి
గురు హర్ రాయి జన్మదినం, ఏడవ సిక్కుగురు 19 మాఘ్ 31 జనవరి
గురు హర రాయ్ ఏడవ గురువుగా వచ్చిన రోజు
నానాక్షహి కేలండరు కొత్త సంవత్సరం.
♦ హోలా మొహల్లా పండగ
1 చెత్ 14 మార్చి
గురు హర్‌గోవింద, ఆరవ సిక్కు గురువు మరణం. 6 చెత్ 19 మార్చి
♦ఖల్సా యొక్క సమన్వయం.
♦గురునానక్ జన్మదినం
1 వైశాఖ్ 14 ఏప్రిల్
గురు అంగద్, రెండవ సిక్కు గురువు సృష్టికర్త తిరిగి విలీనం 3 వైశాఖ్ 16 ఏప్రిల్
గురు అమరదాస్ మూడవ సిక్కు గురువుగా స్వీకారం. 3 వైశాఖ్ 16 ఏప్రిల్
గురు హర్‌కిషన్, ఎనిమిదవ సిక్కు గురువు మరణం. 3 వైశాఖ్ 16 ఏప్రిల్
గురు తేఘ్ బహదూర్ తొమ్మిదవ సిక్కు గురువుగా స్వీకారం. 3 వైశాఖ్ 16 ఏప్రిల్
గురు అంగద్ జన్మదినం, రెండవ సిక్కు గురువు. 5 వైశాఖ్ 18 ఏప్రిల్
గురు తేఘ్ బహదూర్ జన్మదినం, తొమ్మిదవ సిక్కు గురువు. 5 వైశాఖ్ 18 ఏప్రిల్
గురు అర్జన్ జన్మదినం, ఐదవ సిక్కు గురువు. 19 వైశాఖ్ 2 మే
గురు అమరదాస్ జన్మదినం, మూడవ సిక్కుగురువు. 9 జెత్ 23 మే
గురు హరగోవింద సిక్కుల ఆరవ సిక్కు గురువుగా స్వీకారం. 28 జెత్ 11 జూన్
♦గురు అర్జన్ , ఐదవ సిక్కు గురువు లాహోర్లో చందు షా చే బలి. e 2 హర్ 16 జూన్
గురు హరగోవింద సింగ్, ఆరవ సిక్కు గురువు జన్మదినం. 21 హర్ 5 జూలై
గురు గోవింద సాహిబ్ 6 సావన్ 21 జూలై
గురు హర్ కిషన్ సాహిబ్ 8 సావన్ 23 జూలై
గురు గ్రంథ్ సాహిబ్, సిక్కు మతగ్రంథం, స్వర్ణ దేవాలయంలో మొదటిసారి ఉంచారు. 17 భడోన్ 1 సెప్టెంబరు
గురు అమర్ దాస్ , మూడవ సిక్కు గురువు మరణం. 2 అస్సు 16 సెప్టెంబరు
గురు రామ దాస్, నాల్గవ సిక్కు గురువు స్వీకారం. 2 అస్సు 16 సెప్టెంబరు
గురు రామదాస్, నాల్గవ సిక్కు గురువు మరణం. 2 అస్సు 16 సెప్టెంబరు
గురు అర్జన్ ఐదవ సిక్కు గురువుగా ప్రమాణం. 2 అస్సు 16 సెప్టెంబరు
గురు అంగద్ రెండవ సిక్కు గురువుగా ప్రమాణం. 4 అస్సు 18 సెప్టెంబరు
గురు నానక్, మొదటి సిక్కు గురువు మరణం. 8 అస్సు 22 సెప్టెంబరు
గురు రామదాస్ ,నాల్గవ సిక్కు గురువు జననం. 25 అస్సు 9 అక్టోబరు
గురు హర్ రాయి, ఏడవ సిక్కు గురువు మరణం. 6 కటక్‌ 20 అక్టోబరు
గురు హర్‌కిషన్ ఐదవ సిక్కు గురువుతా స్వీకారం. 6 కటక్‌ 20 అక్టోబరు
♦సిక్కు గ్రంథం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రకటించారు. 6 కటక్‌ 20 అక్టోబరు
గురు గోవింద సింగ్, పదవ సిక్కు గురువు మరణం. 7 కటక్‌ 21 అక్టోబరు
గురు గోవింద సింగ్ పదవ సిక్కు గురువుగా స్వీకారం 11 మఘర్ 24 నవంబరు
♦ గురు టెఘ్ బహాదూర్ ఢిల్లీలో బలి. 11 మఘర్ 24 నవంబరు
అజిత్ సింగ్, జుజ్ హర్ సింగ్, గురు గోవిం సింగ్ యొక్క పుత్రుల బలి. aur 8 పోహ్ 21 డిసెంబరు
జోరవార్ సింగ్, ఫటేహ్ సింగ్ , గురు గోవిద సింగ్ యొక్క పుత్రులు. ind 13 పోహ్ 26 డిసెంబరు

ఇవి కూడా చూడండి.[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 "What is the Sikh Nanakshahi calendar". allaboutsikhs.com. Archived from the original on 2008-05-10. Retrieved 2008-05-09.
 2. "Nanakshahi Calendar at BBC". BBC. 2003-07-29. Retrieved 2008-05-09.
 3. Gurbani And Nanakshahi Calendar Nanakshahi Sangrand Dates in Gregorian Calendar - Forever from 14 మార్చి 2003 CE / 535 NS

ఇతర లింకులు[మార్చు]