తూపల్లె గురప్ప స్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తూపల్లె గురప్ప స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆధ్యాత్మిక యోగి. ఈయన 16 వ శాతాబ్దం పూర్వార్థంలో ఉండినట్లు తెలుస్తున్నది. గురప్ప, గుర్రప్ప, గురివి రెడ్డి, గురన్న, గురుస్వామి, గురుమూర్తి అని తీరుతీరు పేర్లతో ఆయనను ఆరాధించే రెడ్డి, కమ్మ, కాపు భక్తులు చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో అధికులు. రెడ్లలో ఒక తెగ తోట కాపులు. ఈ తోటకాపులు గురప్పను తమ కుల దైవతంగా కొలుస్తారు.

జీవిత విశేషాలు

[మార్చు]

చిత్తూరు జిల్లా పోరకపల్లె, అనంతపురం జిల్లా గుట్టూరు సమీప గ్రామం. కడప జిల్లా పాపఘ్ని నదీ తీరాన వెన్నపల్లి గురప్ప జన్మ ప్రదేశాలని ప్రచారంలో ఉన్నాయి. కడప జిల్లా వెన్నపల్లి గ్రామంలో గురప్ప జన్మించినట్లు ఐతిహ్యాసున్నాయి. శ్రీకృష్ణ దేవరాయలవారు (1509-1530) అల్లసాని పెద్దన్న వారి పల్లె సమీపాన తెల్లగొండు చెరువు నిర్మాణం చేయిస్తున్న కాలంలో ఈ గురప్ప స్వామి ఉండేవారని ప్రతీతి.

గురప్ప స్వామి తల్లిదండ్రులు పుత్తాలమ్మ, ఈశ్వరప్ప లు. చిన్న తనం నుండే గురప్ప తన యింటికి ఉత్తరాన ఉన్న వేప చెట్టు నీడలో ఆటలాడుకొనేవారు. అక్కడే ఎక్కువ కాలం గడిపేవారు. ఎప్పుడూ మౌనంగా ఉంటూ సైగలు చేసేవారు. తనలోతాను గొణుగుకొనేవారు. తల్లిదండ్రులు పిలిచినా ఉలకక, పలకక, ఎవరింటికీ పోక, సాటి పిల్లలతో ఆడక సదా దైవ ధ్యాన నిమఘ్నుడై ఏదో ఆలోచిస్తూ ఉండేవారు. ఎప్పుడైనా పరధ్యానంగా తనలో తానే గొణుక్కుంటూ వీధులచుట్టూ తిరిగేవారు. ఎండ, వాన, చలి, గాలి ఏ కాలమైనా ఏ సమయంలోనైనా ఇంటి వద్ద గల వేప చెట్టు నీడయే అతని తపోభూమి. ఆయన పిచ్చివానిగా గేలిచేసిన బంధువులు, గ్రామీణులే ఆయనను తరువాత కాలాన దేవుడని ఆరాధించారు. ఇప్పుడాయన గుళ్ళు అనేక గ్రామాలలో వెలసినవి. గురప్పకు 18 వ యేట వివాహమైనది. రంగవెల్లి అనే బిడ్డ కూడా పుట్టినది. ఆమె పెరిగి పెద్దదైన తరువాత రంగయ్యతో వివాహమైనది. తరువాత గురప్ప ఆలుబిడ్డలను, బంధాలను తెంచుకొని సన్యాసియై తిరిగి తిరిగి తిరుపతి చేరినాడు. వీధుల వెంట తిరుగుతూ ఎవరేది పెట్టినా తింటూ పగలంతా గోవిందరాజస్వామి తేరు నీడలో ఉంటూ రాత్రి పగలు మహంత్ మఠం అరుగు మీద విశ్రాంతి తీసుకొనేవాడు. శరణాగతులైనవారి ఆధి వ్యాధులు తొలగిస్తూ అనేక మహిమలు ప్రదర్శించి తిరుపతి విడిచి మరల స్వగ్రామం చేరి చిన్నప్పుడు తాను ఆటలాడిన వేపచెట్టు నీడలోనే సమాధి అయ్యాడు.

ప్రసిద్ధి చెందిన గురప్ప క్షేత్రాలు

[మార్చు]

ఈనాడు చాలా గ్రామాల్లో ఆరాధ్యమూర్తిగా కొలుస్తున్న ప్రసిద్ధి గురప్ప క్షేత్రాలు

 1. కడప జిల్లా గండ క్షేత్రం సమీపాన గల వెన్నపల్లె
 2. ప్రొద్దుటూరు మండలం మైలేరు డ్యాం
 3. జమ్మలమడుగు కోవెలకుంట్ల మధ్యనున్న నొసం
 4. అనంతపురం జిల్లా తలుపుల మండలం లోని తూపల్లె
 5. కదిరి మండలంలోని సైదాపురం
 6. పెనుగొండ మండలం గుట్టూరు సమీపాన గ్రామం
 7. నార్పల మండలంలోని కూచివారిపల్లె
 8. చిత్తూరు జిల్లా కొత్తకోట మండలం లోని ఆకుదాలవారిపల్లె
 9. కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలోని చందలూరు.
 10. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని చౌడేపల్లి గ్రామం.
 11. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని నెత్తకుప్పం గ్రామం.
 12. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం కొత్తకాల్వ గ్రామం నందు గుర్నాథ స్వామి (గుఱ్ఱప్ప స్వామి) ఆలయం కలదు

ఈ గ్రామాల్లో ఎక్కడా గురప్ప సమాధి లేదు. గురప్ప గుళ్ళు పీఠాలు మాత్రమే ఉన్నాయి. గండి క్షేత్రం సమీపాన గల వెన్నపల్లె మూలపీఠం.

మహిమలు

[మార్చు]

ఆధారాలు

[మార్చు]
 1. శ్రీ గురప్ప స్వామి వైభవము - 1999 తోట చిన్న గురివిరెడ్డి, తెలుగు పండితులు, అనంతపురం జిల్లా వారు రచించిన గ్రంథం.

యితర లింకులు

[మార్చు]