బలిజ
స్వరూపం
(కాపు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సామాజిక వర్గమైన బలిజ, ముఖ్యముగా తెలుగు నాట ప్రముఖమైన వ్యాపార సామాజిక వర్గము. ఈ కులము ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సాలలో విస్తరించి ఉంది.
బలిజ పదం మూలం
[మార్చు]- బలిజ ఉపకులం తమిళనాడులో గాజుల బలిజ అని, కర్ణాటకలో బనజిగర్ అని కూడా అంటారు.ఉత్తరాదిన "బనియా, "వనియా" అనీ అంటారు. ఈ పేర్లన్నీ "వణిజ" అనే మూల సంస్కృత పదమునుండి వచ్చినవి.
- కాజుల బలిజ ఉపవిభాగం గాజు కంకణం అమ్మడం వారి వంశ వ్యాపారం. శెట్టి కులస్తులు అని కూడా అంటారు పాలకుల హయాంలో, బలిజ వర్గానికి చెందిన ప్రజలు సైన్యంలో చేరి, నాయక్ లేదా నాయుడు అనే బిరుదును పొందారు.[1]
- స్టువర్ట్దీ (1891) నిని బలిజలు కాపులు లేదా రెడ్డిల ఆఫ్‌సెట్ అని భావించారు, అయితే థర్స్టన్ (1909) వారిని ఇతర కులాల నుండి బహిష్కరించిన వ్యక్తులను అనుమతించే మిశ్రమ కులంగా అభిప్రాయపడ్డారు[1]
చరిత్ర
[మార్చు]- బలిజలు ఆర్యావర్తనంలోని అహిచ్ఛత్రపురము నుండి దక్షిణాపథమునకు వచ్చినవారము అని తమచే వేసుకోబడిన అనేక శాసనాలలో చెప్పుకుంటూ వచ్చారు. వీరు నేటి కర్ణాటకలోని ప్రపంచప్రసిద్ధిగాంచిన, చాళుక్యులు వంశీయులకు తొలిరాజధానిగా వర్ధిల్లిన ఐహోలు అనే ఆర్యాపురం ముఖ్య కేంద్రముగా దక్షిణాది అంతా విస్తరించారు. దీనినే అయ్యావళి అని పిలిచేవారు. వీరు అహిచ్ఛత్ర పురవరాధీశ్వరులు, అయ్యావళి పురవరాధీశ్వరులు అని పేర్కొనబడేవారు. 56 దేశాలవారు అని పిలువబడేవారు. మహాజనులు అని పిలువబడేవారు. వీరు శెట్టి, సేట్, శ్రేష్టి లను తమ పేర్ల చివర ప్రధానంగా ధరిస్తారు.
- చాళుక్యులు, మదురై, జింజి, కండి, కేలడీ వంటి రాజ వంశ సంతతులు కూడా బలిజవారిలో కలిసి క్షత్రియ బలిజ వారిగా పేర్కొనబడినారు. [ఆధారం చూపాలి] ఈ విధంగా బలిజవారు తరతరాలుగా వేల సంవత్సరాల నుండి వ్యాపార వాణిజ్యాలతో బాటు రాచరిక పరిపాలనలలో నిమగ్నమై ఉన్న వర్గం అని చరిత్ర ఉంది.
- పేర్కొన్నారు.
- బిరుదులు.(రాయలసీమ)
- (తెలంగాణ)
- (కర్ణాటక)
రాజకీయ ప్రముఖులు
[మార్చు]తుళువ అన్నయ్యగారి సాయి ప్రతాప్,
బండారు రత్నసభాపతి శెట్టి,
చెన్నంశెట్టి రామచంద్రయ్య,
మాదాసు గంగాధరం,
వ్యాపారవేత్తలు
[మార్చు]దళవాయి ఆదికేశవులు నాయుడు
గాజుల లక్ష్మీనరసు చెట్టి
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Kumari, A. Vijaya (1998). Social Change Among Balijas: Majority Community of Andhra Pradesh (in ఇంగ్లీష్). M.D. Publications Pvt. Ltd. ISBN 978-81-7533-072-6.