ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద
ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద | |
---|---|
![]() 1974లో జర్మనీలో ప్రభుపాదులు | |
శీర్షిక | అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం సంస్థాపకాచార్యులు. |
వ్యక్తిగత వివరాలు | |
జననం | అభయ్ చరణ్ దే 1 సెప్టెంబరు 1896 కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా. |
మరణం | 14 నవంబరు 1977 బృందావన్, భారతదేశము | (వయస్సు 81)
సమాధి స్థలం | భక్తి వేదాంతస్వామి సమాధి, బృందావనం |
మతం | గౌడీయ వైష్ణవం, హిందూమతము |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | అభయ చరణారవింద,అభయ చరణ్ దే |
మతపరమైన వృత్తి | |
ఆధార స్థలం | బృందావన్, భారతదేశము |
కార్యాలయంలో కాలం | 1966 - 1977 |
అంతకు ముందు వారు | భక్తిసిద్ధాంత సరస్వతీ ఠాగూరు |
ఉపదేశం | దీక్ష–1932, సన్యాసం–1959 |
ఉద్యోగం | గురువు, సన్యాసి, ఆచార్యుడు |
వెబ్సైట్ | Official Website of ISKCON |
పరమపూజ్య శ్రీ ఎ.సి. భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు సన్యాసిగా, కృష్ణ భక్తునిగానూ ప్రసిద్దులు.ఇతను అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం[1] సంస్థాపకాచార్యులు.ఈ సంఘం సాధారణంగా "హరేకృష్ణ ఉద్యమం"గా ప్రసిద్ధి పొందింది.[2]
జీవిత విశేషాలు[మార్చు]
ఇతను భారతదేశములోని కలకత్తా నగరములో 1896 వ సంవత్సరములో జన్మించారు.కలకత్తా లోని స్కాటిష్ చర్చి కళాశాలలో విధ్యాభ్యాసం చేసారు.[3] అతను తమ ఆధ్యాత్మిక ఆచార్యులైన శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ గోస్వామి[4] వారిని 1922లో కలకత్తాలో మొదటిసారి కలుసుకున్నారు[5]. శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ గోస్వామి వారు పర్ముఖ వైదిక విద్వాంసులు, 64 గౌడీయ మఠాలను స్థాపించారు. వారు యువకులైన ప్రభుపాదులవారిని చూచి సంతోషముతో వైదిక విజ్ఞానాన్ని బోధించడానికి తమ జీవితాన్ని అంకితం చేయమని ఉపదేశించారు. ఆనాటి నుండి శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ గోస్వామి వారికి శిష్యులై పదకొండు సంవత్సరాల తరువాత యధావిధిగా 1950లో దీక్షను తీసుకున్నారు[6]
సన్యాసం[మార్చు]
మొదటి సమావేశములోనే శ్రీల భక్తిసిధ్దాంత సరస్వతీ ఠాకూరు గారు ఆంగ్ల భాష ద్వారా వైదిక విఘ్నానాన్ని ప్రచారము చేయమని శ్రీల ప్రభుపాదుల వారిని కోరారు. తరువాతి సంవత్సరాలలో శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతకు భాష్యం వ్రాసి, గౌడీయమఠ కార్యక్రమాలకు తోడ్పడ్డారు. 1944లో " బ్యాక్ టు గాడ్ హెడ్ " (భగవద్దర్శనం) అనే ఆంగ్ల పక్ష పత్రికను స్థాపించారు. అది ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో వారి శిశ్యుల చేత ముప్పయి కంటే ఎక్కువ భాషలలో కొనసాగించారు. శ్రీల ప్రభుపాదుల వారి భక్తి విఘ్ఘ్నానాలను గుర్తించి 1947 లో గౌడీయ వైశ్ణవ సంఘం వారికి భక్తివేదాంత బిరుదును ఇచ్చి గౌరవించింది. 1950 లో 54 సంవత్సరాల వయస్సులో ప్రభుపాదుల వారు వైవాహిక జీవితాన్ని విడిచిపెట్టి ఎక్కువ కాలం గ్రంథాలను చదవడానికి, వ్రాయడానికి, వినియోగించ సాగారు. తరువాత వారు వృందావనానికి వెళ్ళి అక్కడ మధ్య యుగంలో చరిత్ర ప్రసిద్ధి కెక్కిన శ్రీ శ్రీ రాధా దామోదర మందిరములో అతి నిరాడంబర జీవితమును గడిపినారు.
రచనలు[మార్చు]
బృందావనానికి వెళ్ళిన అతను చాలా సంవత్సరాల పాటు ఉండి ఎంతో విద్యా వ్యాసాంగం చేసి అనేక గ్రంథాలను రచించారు. 1959లో సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించారు.వైష్ణవ రచనలు చేయడం మొదలు పెట్టారు.[7] తమ జీవిత ముఖ్యరచన అయిన శ్రీమద్భాగవతములోని 18, 000 శ్లోకాలను అనువాదము వ్యాఖ్యానాలతో కూడిన అనేక సంపుటాలుగా రచనను ప్రారంభించారు. గ్రహాంతర సులభమానం అనే మరో గ్రంథాన్ని కూడా రచించారు. Total 15 books Gurudev wrote
శ్రీ మద్భాగవతము మూడు సంపుటాలుగా ప్రచురించాక ప్రభుపాదులవారు తమ ఆధ్యాత్మికాచార్యుల కోరికను నెరచేర్చడానికి 1965 లో అమెరికా సమ్యుక్త రాష్ట్రాలకు వెళ్ళారు. అప్పటి నుండి వారు భారతీయ వేదాంత గ్రంథాలపై ప్రామాణికాలైన వ్యాఖ్యానాలు, భాషాంతరీకరణలు, సంగ్రహ వ్యాఖ్యలు 70 సంపుటాలకు పైగా రచించారు.
అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం స్థాపన[మార్చు]
1965లో అతను మొట్టమొదటిసారిగా ఒక వాణిజ్య నౌకలో న్యూయార్క్ నగరానికి వెళ్ళినపుడు అతను చేతిలో ఒక్క పైసా కూడా లేదు. తరువాత ఒక సంవత్సరానికి అంటే 1966 జూలైలో వారు అతికష్టము మిద అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని (ఇస్కాన్) ను స్థాపించగలిగారు[4][8].పదిసంవత్సరాల లోపలే ఆ సమాజము బాగా అభివృద్ధి చెంది ప్రపంచమంతటా వ్యాపించసాగింది. పాఠశాలలు, మందిరాలను, ఆశ్రమాలను మొదలైనవాటిని నెలకొల్పగలిగింది.
1968 లో శ్రీల ప్రభుపాదుల వారు న్యూవర్జీనియాలో కొందల పైన ఆధ్యాత్మిక సమాజాన్ని స్థాపించి దానికి నూతన వృందావనం అని పేరును పెట్టారు[9]. అక్కడే ఒక వైదిక పాఠశాలను నెలకొల్పి పాశ్చాశ్చ దేశాలకు సైతం వైదిక గురుకుల విద్యావిధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆ నూతన వృందావనం ఇప్పుడు వేయి ఎకరాల పైగా వైశాల్యము గల ప్రదేశములో విరాజిల్లుతోంది అమెరికాలోని వారి శిష్యులు అలాంటి సంఘాలను చాలా వరకు స్థాపించారు.
1972 లో పరమ పూజ్యశ్రీ శ్రీమత్ ప్రభుపాదుల వారు పాశ్చాశ్చ దేశాలలోని డెల్లాస్, టెక్సాస్ లో వైదిక పద్ధతిలో గురుకులాలను ఏర్పాటు చేసారు. 1972లో ముగ్గురు విధార్థులతో ప్రారంభమైన గురుకులమూ 1975 నాటికి 150 మంది విద్యార్థులతో విరాజిల్లింది[10].
భారతదేశంలో ఆధ్యాత్మిక కేంద్రాలు[మార్చు]
శ్రీల ప్రభుపాదుల వారు భారతదేశంలో అంతర్జాతీయ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించారు. పశ్చిమ బెంగాలులోణి మాయాపూరులో శ్రీథామం అనే అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మిచారు. అది వైదిక పఠనానికి అనుకూలంగా నిర్మించబడింది. భారతదేశంలోని వృందావనంలో మహోన్నతమైన కృష్ణబలరామ మందిరం ఆ పద్ధతుల ప్రకారమే నిర్మించబడింది. అక్కడ ఒక అంతర్జాతీయ అతిథి గృహం కూడా నిర్మించబడింది. పాశ్చాత్యులక్కడ నుండి వైదిక సంస్కృతిని స్వయంగా నేర్చుకునే అవకాశం ఉంది. భారతదేశంలో సుమారు పద్దెనిమిది ముఖ్యా స్థానాలలో ఇతర కేంద్రాల నిర్మాణం జరుగుతున్నది.
గ్రంథ రచనలు[మార్చు]
ప్రభుపాదులవారు ముఖ్యాతిముఖ్యమిన సేవ గ్రంథరచన. దానిద్వారా అతను ప్రసిద్ధి పొందారు. వారి గ్రంథాలు ప్రామాణికత్వానికీ, జ్ఞాన గాంభీర్యానికీ, వైదుష్యానికిపెట్టింది పేరు. అవి విద్వాంసుల చేత ఎంతగానో గౌరవింపబడ్డాయి. అనేక కళాశాలల్లో ప్రామాణిక పాఠ్య గ్రంథాలుగా నిర్ణయించబడ్డాయి. వారి రచనలు ఎనభైకి పైగా భాషలలోకి అనువదించబడ్డాయి. ప్రభుపాదుల వారి గ్రంథాలను ముద్రించి, ప్రకటించడాము కోసమే 1972లో భక్తివేదాంత బుక్ ట్రస్టు అనే సంస్థను స్థాపించారు[11]. అది ఇప్పుడు భారతీయ వైదిక తత్వ విషయాలపై గ్రంథాలను ప్రచురించే ప్రపంచ ప్రముఖ సంస్థగా రూపొందింది.
పర్యటనలు[మార్చు]
వార్థక్యం సమీపించినా అతను సుమారు పన్నెండు సంవత్సరాలలో ప్రపంచమంతటాఅ పద్నాలుగు సార్లు ఉపన్యాస యాత్ర సాగిస్తూ ఆరు ఖండాలలో పర్యటించారు. అంతటి నిర్విరామ కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నప్పటికీ వారు తమ గ్రంథ రచనలు కొనసాగిస్తూనే ఉండేవారు. వారి గ్రంథాలన్నింటినీ కలిపితే ఒక ప్రఖ్యాత వైదిక వేదాంత సాహిత్య సంస్కృతీ గ్రంథాలయము అవుతుంది.
ప్రభుదూల వారి గురువుగారు
శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ గోస్వామి గౌడీయ వైష్ట్నవ ఆచార్యులు.ఇతను కృష్ణుడినుండి వస్తున్నా గురుశిష్య పరంపరలో ఆచార్యులు .గౌడీయ మఠ స్థాపకులు.ఇతను చిన్ననాటినుచే కృష్ణ చైతన్యంలో తన తండ్రి గారి నుంచి శిక్షణ పొందిన వారు.అద్భుతమైన సంస్కృత పండిచమును కలిగినవారు.ఇతను గురువు గారు గౌరకిషోర బాబాజి గారు.శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ గోస్వామి ఇస్కాన్ సంస్థాపకచార్యుల గురువుగారు .ఇతను ఆజ్ఞ మేరకే ప్రభుపాదులవారు కృష్ణ చైతన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా [ప్రచారం చేశారు .శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ గోస్వామి ఎన్నో గ్రంథ రచనలు కూడా చేశారు.వాటివివరాలు గౌడీయ మఠంలోను, ఇస్కాన్ కేంద్రాలలోను లభిస్తాయి.ఉచితంగా ఇస్కాన్ వెబ్ సైట్స్ లో కూడా లభిస్తున్నాయి.వీరి ప్రధాన ద్యేయం ప్రతి జీవిలో దాగిఉన్న కృష్ణ ప్రేమను జాగృతం చెయ్యడమే .దానికి ఏకైక మార్గం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఈ మహా మంత్రాన్ని జయించడమే అని తెలియజేస్తారు.ఇది అన్ని విధానాలకన్నా సులభమైనది, భగవంతునికి ప్రియమైనది అని శాస్త్రదారాలను చూపిస్తూ సర్వ జీవులను భగవద్ మార్గంలో నడిపించడమే తమ జీవిత ధ్యేయంగా సాగుతారు.
అస్తమయం[మార్చు]
అతను నవంబరు 14 1977 న ఉత్తరప్రదేశ్ లోని వృందావనంలో మరణించారు[12]. ప్రపంచమంతటా 100కిపైగా ఆశ్రమాలు, మందిరాలను, సంస్థలను స్థాపించి కృష్ణ చైతన్య సంఘాన్ని అంతర్జాతీయ సంస్థగా (ఇస్కాన్) తీర్చి దిద్దారు.
చిత్రమాలిక[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ Goswami et al. 1983, p. 986
- ↑ Melton, John Gordon. "Hare Krishna". Encyclopædia Britannica. www.britannica.com. Archived from the original on 16 జూన్ 2008. Retrieved 9 April 2015. Check date values in:
|archivedate=
(help) - ↑ Jones, Constance (2007). Encyclopedia of Hinduism. New York: Infobase Publishing. pp. 77–78. ISBN 0-8160-5458-4.
- ↑ 4.0 4.1 Klostermaier 2007, p. 217
- ↑ Goswami 1984, page xv
- ↑ Goswami 2002, Vol.1 Chapter 6
- ↑ Goswami 2002, Vol.1 Chapter 9
- ↑ Ekstrand & Bryant 2004, p. 23
- ↑ Charles S. J. White (2004). A Catalogue of Vaishnava Literature on Microfilms in the Adyar Library. Delhi: Motilal Banarsidass. ISBN 81-208-2067-3.
- ↑ Klostermaier 2007, p. 309
- ↑ Cole & Dwayer 2007, p. 25
- ↑ Vasan & Lewis 2005, p. 128
ఇవి కూడా చూడండి[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Prabhupada. |
- Bhagavad-Gītā As It Is
- Gaudiya Vaishnavism
- International Society for Krishna Consciousness
- Krishna, the Supreme Personality of Godhead
- Krishnaism
- List of ISKCON members and patrons
- నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్
- The mind and soul become pure by chantting hare Krishna Mantra..
- While chanting mantra the mind and tongue should in our control..