Jump to content

హిందూ సంస్కారములు

వికీపీడియా నుండి
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం


హిందూ ధర్మం ప్రకారం, సంస్కారాలు (హిందీ:' సంస్‌కార్), వేదం ద్వారా కర్మలు అంగీకారం కనుగొనడంలో అనేది, హిందూ మతం, జైనమతం అనుచరుల్లో మతపరమైన వాటిలో ఆచరణ మారుతూ ఉన్నాయి.ధర్మ సూత్రములలో "చత్వారింశత్ సంస్కారా: అష్టా ఆత్మగుణా:" అనగా 8 ఆత్మ గుణముల సంస్కారములతో పాటుగా మరో 40 సంస్కారములు కలిపి మొత్తం నలభై ఎనిమిది సంస్కారములు వాటి ఆవశ్యకత చెప్పబడింది. ప్రస్తుత ఆధునిక కాలములో చాలా సంస్కారములు చేయుట జరుగుట లేదు. దానికి కారణము లేక పోలేదు. కొన్ని సంస్కారములు చేయవలెనన్న హోమములు అవసరము. హిందూ సాంప్రదాయములో ఆగమ సంబంధమయిన క్రియలు. ఇవి ప్రతి ఒక్క హిందువు యొక్క జీవిత పర్యంతమూ వివిధ దశలలో జరుపబడతాయి. తల్లి గర్భములో ప్రవేశించిన సమయము మొదలు కొని, మరణము, తదనంతరము ఆత్మ పరలోక ఆత్మశాంతి నొందుట వరకు సంస్కారములు జరపబడును. దోషములు పోగొట్టుటకు చేయు కర్మలనే సంస్కారములు అని అర్ధము.

  • సంస్కారాలు మొత్తము నలభై ఎనిమిది. అవి:

ఆత్మగుణాలు

[మార్చు]
హిందూ కర్మలు, ఆచారాలు చిత్రం

పురుషుడు ఆచరించ వలసినవి:

ఆత్మగుణములు
దయ : సర్వభూతములందు దయ తప్పనిసరి. శత్రువునయిననూ విపత్తునందు రక్షించడము.
అనసూయ : గుణవంతుల గుణాదులు బయటకు వెల్లడించడము. అనగా అసూయ లేకుండుట అని అర్ధము.
అకార్పణ్యం : సత్పాత్రునకు లోభము చూపక తన శక్తి కొలది భక్తితో దానము ఇచ్చుట.
అస్పృహ : ఇతరుల వస్తువులను అపేక్షించకపోవడము.
అనాయాసం : క్షుద్రకర్మలు, శరీర పిడలు కలుగు నటువంటివి ఆచరించ కుండా ఉండటము.
మాంగల్యం: మంగళ ప్రథమగు పనులు అనగా ప్రశస్తమగు నటువంటివి.
శౌచం :శుచి, శుభ్రత
క్షాంతి : ఇతరులు ఎవరైననూ తనకు బాధ, దుఃఖము కలిగించిననూ కోపము తెచ్చుకొనక ఓర్పుతో ఉండటము.

ఈ ఎనిమిది ఆత్మగుణసంస్కారముల వలన చిత్తశుద్ధి కలుగును.

పంచయజ్ఞములు

[మార్చు]
  • మొత్తము అయిదు.

దేవయజ్ఞము

[మార్చు]
  • సమిధలు, హవిస్సు లతో అగ్నియందు హోమము చేసి దేవతలను సంతృప్తి పరచుటకు చేయు యజ్ఞము.

పితృయజ్ఞము

[మార్చు]
  • పితృదేవతల ప్రీతి కొరకు చేయు యజ్ఞము. పితరులనుద్దేసించి ద్విజులకు భోజనము పెట్టుట, పిండప్రధానము, జలతర్పణములు చేయుట. పిండము, శ్రాద్ధము, తద్దినము, మాసికము మొదలగునవి.

భూతయజ్ఞము

[మార్చు]
  • ఆచార్యుడు వైశ్వదేవం వ్రతము చేసిన తరువాత భూత తృప్తి కొరకు చేయు బలి ప్రదానమే భూతయజ్ఞము.

బ్రహ్మయజ్ఞము

[మార్చు]
  • ప్రతి నిత్యము యేదైనా ఒక ఋక్కు, యజస్సు, సామము తమ శక్తి కొలది అభ్యసించుటయే బ్రహ్మయజ్ఞము.

మనుష్యయజ్ఞము

[మార్చు]
  • బ్రాహ్మణులకు, అతిథులకు తమ శక్తి కొలది భోజనము పెట్టుటయే మనుష్యయజ్ఞము.

హవిర్యజ్ఞములు

[మార్చు]
  • మొత్తము ఏడు. అవి:-

(1) అగ్నాధేయం

[మార్చు]
  • అగ్ని హోత్రుడు దీని చేత గ్రహింపబడును కావున అగ్నాధేయము అంటారు.

(3) అగ్రయణేష్టి

[మార్చు]
  • కొత్త ధాన్యము వచ్చినప్పుడు ఆజ్ఞి ప్రీతి కొఱకు ముందుగా అగ్రయణేష్టి చేసిన పిదప ప్రజలు ఆ ధాన్యమును వినియోగించుకొన వలెను. దీనినే అగ్రయణము అని అంటారు.

(4) చాతుర్మాస్యం

[మార్చు]
  • అనగా నాలుగు (4) విధములయిన వ్రతములు.

1. వైశ్వదేవము

[మార్చు]

వేదమాదౌ సమారభ్య తథోపర్యుపరిక్రమాత్| యదధీతేన్వహం శక్త్యా తత్ స్వాధ్యాయం ప్రచక్షతే||

వైశ్వదేవం ద్విజైః కార్యమ్ అన్న శుద్ధ్యర్థ మాదరాత్

పంచసూన గృహస్థస్య వర్తన్తే హరహస్తథా| ఖండినీ పేషిణీ ఛుల్లీ ఉదకుంభీ చ మార్జనీ||

ఏతాభి ర్వాహయన్ విప్రో బధ్యతే వై ముహూర్ముహుః| ఏతాసాం పావనార్ధాయ పంచయజ్ఞాః ప్రకీర్తితాః||

2. వరుణ ప్రఘాసము

[మార్చు]

3. పాకమేధము

[మార్చు]

4. సూనాసిరీయము

[మార్చు]

(5) ధర్మపూర్ణమాస్యం

[మార్చు]
  • హవిర్యజ్ఞములు చేయ వలయునన్న ఈ యజ్ఞము తప్పక చేయవలయును. ఆహితాహ్నులు శుక్ల పక్ష, కృష్ణ పక్ష పాడ్యమి దినముల యందు చేయవలసిన ఇష్టి భేదములను ధర్మపూర్ణమాస్యం అని అంటారు.

(6) విరూఢపశుబంధ

[మార్చు]

(7) సౌత్రాయణీ

[మార్చు]
  • ఈ యజ్ఞ అధిదేవత ఇంద్రుడు కనుక సౌత్రాయణీయము అని అంటారు.

సోమయజ్ఞములు

[మార్చు]
  • మొత్తము ఏడు.

(1) అగ్నిష్టోమము

[మార్చు]
  • అగ్నిని స్తుతించు ఋక్సముదాయము ఈ యజ్ఞములో అంత్యమునందు ఉండుట చేత అగ్నిష్ఠోమము అని పేరు వచ్చింది.

(2) అత్యగ్నిష్టోమము

[మార్చు]
  • అగ్నిష్ఠోమము కంటే అధిక ఫలములనిచ్చునది ఈ యజ్ఞము.

(3) ఉక్థ్యఃము

[మార్చు]
  • ఈ యజ్ఞము ఆ గీతమంత్ర సాధ్యములగు స్తోత్రముల ఛేత ఛేయబడును.

(4) అస్తోర్యామము

[మార్చు]
  • ఈ యజ్ఞము చేయుట వలన దేవతలు పశ్వాదికమును పొందిరి.
  • ఈ సంస్కారము ఒక రాత్రి కంటే ఎక్కువ సమయము చేయవలసిన యజ్ఞము.

(6) వాజపేయము

[మార్చు]
  • అన్నము, నెయ్యి ఈ యజ్ఞములో స్వీకరించతగినవి.

(7) షోడశీ/షోడశము

[మార్చు]
  • సోమ యాగ అంతర్గతమే ఈ షోడశ యజ్ఞము. సర్వ యజ్ఞ సంబదమగు తేజోవంత భాగమును 16 భేదములు గల దానినిగా ప్రజాపతి చేసెను.

పాకయజ్ఞములు

[మార్చు]
  • మొత్తము ఏడు.

(1) అష్టకా/అష్టకము

[మార్చు]
  • ఈ యజ్ఞము మాఘ బహుళ సప్తమి మొదలుగా మొత్తము మూడు రోజులు చేయుదురు. ప్రత్యేకముగా ఈ రోజులందు పితరులు భుజింతురు.

(2) అగ్రహాయణి/అగ్రహాయణియము

[మార్చు]

(3) ఆశ్వయుజి/ఆశ్వయుజము

[మార్చు]

(4) చైత్రీ/చైత్రీయము

[మార్చు]
  • చిత్త నక్షత్రముతో కూడిన పూర్ణిమ రోజున చేయు ఈశాన అర్చ్చనను చైత్రీ యజ్ఞము అంటారు.

(5) శ్రావణి/శ్రావణియము

[మార్చు]
  • శ్రవణ నక్షత్రముతో కూడిన పూర్ణిమ రోజున సర్పపూజ చేయుదురు.

(6) పార్వణ/పార్వణము

[మార్చు]
  • గృహస్థులు ప్రతి పాడ్యమి నాడు దీనిని చేయవలయును.

(7) శ్రాద్ధ/శ్రాద్ధము

[మార్చు]
  • శ్రద్ధగా పిత్రు దేవతల ప్రేతి కొరకు ప్రతి మాసము కృష్ణపక్షమునందు ఈ శ్రాద్ధము చేయునది.

వటువును ఉద్దేశించి ఆచార్యుడు చేయవలసిన సంస్కారాలు

[మార్చు]
  • మొత్తము నాలుగు.

(1) ప్రాజాపత్యం

[మార్చు]
  • వేదమునకు ఒక కాండఋషి అయిన ప్రజాపతి అనుగ్రహమున కొరకు చేయు వ్రతము.

(2) సౌమ్యం

[మార్చు]
  • సోముడు వేదమునకు మరొక కాండఋషి, అతని అనుగ్రహమున కొరకై చేయు వ్రతము.

(3) అగ్నేయం

[మార్చు]
  • వేదమునకు ఒక కాండఋషి అయిన అగ్ని అనుగ్రహమున కొరకు చేయు వ్రతము.

(4) వైశ్వదేవం

[మార్చు]
  • వేదమునకు విశ్వేదేవతలు కాండఋషులు కనుక వీరి యొక్క అనుగ్రహమున కొరకు చేయు వ్రతము.

స్వకృత్యములు

[మార్చు]
  • విద్య అనంతరము బ్రహ్మచారి అచరించవలసిన సంస్కారములు రెండు. ఒకటి సమావర్తనము లేదా స్నాతకము. మరొక సంస్కారము వివాహము.

సమావర్తనము అనగా స్నాతకము

[మార్చు]
  • బ్రహ్మచారి (వటువు) గురుకులములో తన విద్యను పూర్తి చేసుకుని గృహస్థాశ్రామమును స్వీకరించుట కొరకు తన ఇంటికి వచ్చునప్పుడు చేయు సంస్కారము,
  • దేవ, పితృ ఋణములు తీర్చుటకొరకు వివాహ సంస్కారము వలన యోగ్యత పొందుదురు.

భార్యకు జరిపించ వలసిన సంస్కారాలు

[మార్చు]
  • మూడు. అవి గర్బాధానము, పుంసవనము, సీమంతము.
  • ఈ సంస్కారము వలన గర్భములో విడిచిన (విడవబడు) వీర్యము బీజ దోషము, గర్భ దోషము పోగొట్టును.

పుంసవనము

[మార్చు]
  • పుత్రుని కలుగుటకు చేయు సంస్కారము. ఈ నాడు మాత్రము జరుపట లేదు.
  • గర్భముతో నున్న వివాహితకు చేయు సంస్కారము.

సంతాన శ్రేయస్సు కొరకు చేయవలసిన సంస్కారాలు

[మార్చు]
  • అయిదు. అవి జాతకర్మ, నామకరణము, అన్నప్రాశన, చౌలము, ఉపనయనము.

జాతకర్మ/జాతకర్మము

[మార్చు]
  • గర్భములో శిశువు చేయు గర్భ జల పాన దోషము తొలగుటకు ఈ సంస్కారము చేయుదురు.
  • ఈ సంస్కారము చేయుట వలన ఆయుర్వృద్ధి, తేజోవృద్ది, వ్యవహారసిద్ది కలుగుతాయి.
  • శిశువునకు ఆయువు, ఆరోగ్యము, తేజస్సు వృద్ది కొరకు ఈ సంస్కారము చేయుదురు.
  • ఈ సంస్కారము వలన బలము, ఆయువు, తేజోవృద్ది కలుగుతాయి.
  • ఈ సంస్కారము చేయుట వలన వేదాధ్యన అధికారము, ద్విజత్వ సిద్ది కలుగును.
  • ఈ నలుబది ఎనిమిది సంస్కారములలో ఎనిమిది (8) ఆత్మగుణ సంస్కారములు, ఇరువది రెండు (22) యజ్ఞములు ప్రస్తావన, ఆ తదుపరి మిగిలిన పదునెనిమిది (18) శారీరక సంస్కారములకు సంబంధించినవి. వీటిలో గర్బాధానము మొదలు వివాహ పర్యంతమున గలవి.
  • ఈనాడు కొన్ని సంస్కారములు మాత్రమే జరిపించుచున్నారు. వేదములకు సంబంధించిన సంస్కారములు మొత్తము మీద ఈ రోజుల్లో దరి దాపుగా లేవనే చెప్పుకోవాలి.
  • ఈ క్రింద ఉదహరించిన కొన్ని సంస్కారములు అక్కడక్కడ జరుపుచున్నారు.
  • వీనినే షోడశ సంస్కారములు అని కూడా వ్యవహరించెదరు. ఈ పదహారు సంస్కారములను తిరిగి జనన పూర్వ సంస్కారములు (పుట్టుకకు ముందు), జననానంతర సంస్కారములు (పుట్టిన తరువాత) అను రెండు విభాగముల క్రింద విభజించారు.

జనన పూర్వ సంస్కారాలు

[మార్చు]

జననానంతర సంస్కారాలు

[మార్చు]

సంస్కారాల సంఖ్యలో వివాదం

[మార్చు]

సిక్కు

[మార్చు]
  • సంస్కారములు మతపరమైన కర్మలు అనేవి సిక్కుమతంలో జీవితం యొక్క వివిధ ముఖ్యమైన దశలలో ఉన్నాయి. ఒక మనిషి వివిధ ప్రాపంచిక దశల్లో అతని లేదా ఆమె జీవితంలో కొన్ని సార్లు వివిధ వేడుకల ద్వారా తప్పక సాధించడం కోసం అనుసరించ వలసి ఉంది. ఈ సంఘటనలు వద్ద జరిగేటటువంటి వేడుకలను సంస్కారములు అని పిలుస్తారు.
  • అతను జీవితంలో 4 ప్రధాన సంస్కారములు లేదా వేడుకలు సిక్కులు మతములో ఉన్నాయి. అవి:

నామకరణం

[మార్చు]

అమృత సంస్కారం

[మార్చు]

ఆనంద్ కర్జ్

[మార్చు]

అంతమ సంస్కారం

[మార్చు]

గమనికలు

[మార్చు]
  • Pandey, R.B. (1962, reprint 2003). The Hindu Sacraments (Saṁskāra) in S. Radhakrishnan (ed.) The Cultural Heritage of India, Vol.II, Kolkata:The Ramakrishna Mission Institute of Culture, ISBN 81-85843-03-1, pp. 391–2
  • Translation by G. Bühler (1886). Sacred Books of the East: The Laws of Manu (Vol. XXV). Oxford. Available online as The Laws of Manu
  • Monier-Williams, Monier (1899). A Sanskrit-English Dictionary. Delhi: Motilal Banarsidass.

బయటి లింకులు

[మార్చు]

మూలములు

[మార్చు]
  • తిరుమల తిరుపతి దేవస్థానము వారి ప్రచురణముల నుండి గ్రహించబడినవి.