హిందువులపై అకృత్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


హిందువులపై మత ప్రాతిపదికన శతాబ్దాల తరబడి చేయబడుతున్న అకృత్యాలు ఈ వ్యాస విషయము. భారత ఉపఖండంలో చారిత్రికంగా ఇస్లామిక కాలములో,, గోవాలో పోర్చుగీసు వారి కాలములో హిందువులపై పలు అకృత్యాలు చేయబడ్డాయి. ప్రస్తుతకాలంలో కాశ్మీరు రాష్ట్రంలో, పాకిస్తాను, బంగ్లాదేశ్ మొదలైన దేశాల్లో ఉంటున్న హిందువులు అకృత్యాలకు గురవుతున్నారు.

భారత ఉపఖండంలో ఇస్లామిక కాలము

భారత ఉపఖండంలో ఇస్లాము సాధించిన విజయాల పరిణామక్రమంలో ఇస్లాము దృష్టిలో మతబాహ్యులు, నాస్తికులుగా పరిగణించబడ్డ హిందువులపై పలు మారణహోమాలు జరిగాయి. లక్షలాదిగా హిందువులు వధించబడ్డారు లేదా మతాంతరీకరణ చేయబడ్డారు. గత వేయి సంవత్సరాలుగా హిందువులపై జరుగుతున్న అకృత్యాలకు, ఉపద్రవవాల పరంపరకు ముఖ్య కారణాలను తైమూర్ లంగ్ తన ఆత్మకథలో వ్రాసిన కొన్ని వాక్యాలు సూచిస్తాయి [1][2].

పర్యవసానము చరిత్రకారుడు విల్ డ్యురాంట్ "భారతదేశంలో జరిగిన మహమ్మదీయ దండయాత్ర బహుశా చరిత్రలోనే అత్యంత రక్తసిక్తమైన కథ. ఇస్లామీయ చరిత్రకారులు, పండితులు సూక్ష్మంగా పరిశీలించి, గొప్ప గర్వంతో నమోదుచేసిన సంఘటనల్లో సా.శ.800 నుంచి 1700 వరకూ ఇస్లాం యోధులు చేసిన హిందువుల ఊచకోత, బలవంత మతమార్పిడులు, హిందూ మహిళలను, పిల్లలను అపహరించి బానిసల సంతలో అమ్మకం, ఆలయాల విధ్వంసం వంటివి ఉన్నాయి. లక్షలాది మంది హిందువులు ఈ దశలో కత్తి మెడమీద ఉండగా ఇస్లాంలోకి మారారు."[3]. భారతదేశములో జరిగిన మారణహోమమునకు చలించిపోయిన డ్యురాంట్ ఈ విధముగా మానవజాతిని హెచ్చరించాడు: "probably the bloodiest story in history ... a discouraging tale, for its evident moral is that civilization is a precious good, whose delicate complex order and freedom can at any moment be overthrown by barbarians invading from without and multiplying from within".

ఫ్రెంఛ్ చరిత్రకారుడు అలైన్ డెనియెలౌ మాటలలో: "From the time Muslims started arriving, around 632 AD, the history of India becomes a long, monotonous series of murders, massacres, spoilations, destructions. It is, as usual, in the name of 'a holy war' of their faith, of their sole God, that the barbarians have destroyed civilisations, wiped out entire races" [4].

మరియొక ఫ్రెంచ్ చరిత్రకారుడు, పాత్రికేయుడు గౌతియే మాటలలో:

"Let it be said right away: the massacres perpetrated by Muslims in India are unparalleled in history, bigger than the holocaust of the Jews by the Nazis; or the massacre of the Armenians by the Turks; more extensive even than the slaughter of the South American native populations by the invading Spanish and Portuguese"[5].

అధికారికంగా ఎంతమంది హిందువులు ముస్లింల చేతిలో వధించబడ్డారో గణాంకాలు లేవు. బ్రౌడెల్ మాటలలో ఒక మహమ్మారి వలె లక్షలాదిగా ప్రజలు వధించబడ్డారు. యుద్ధంలో గెలిచిన రాజులకు ప్రజల పేదరికం ఒక పెద్ద అడ్డంకిగా మారి ఇలాంటి అకృత్యాలకు దారితీసేది. అచార్య కె.ఎస్.లాల్ ప్రకారము క్రీ. శ. 1000, క్రీ. శ. 1500 మధ్యకాలంలో హిందూ జనాభా సుమారు 80 మిలియన్లు తగ్గినట్లుగా అంచనావేశారు[6].

హిందువులలో వెనుకబడిన కులాల వారు అమితంగా బాధించబడ్డారు. ఇలాంటి రాజులు, ఖుస్రౌ భంగీ ఖాన్, హేమచంద్ర, గర్హ-కటంగ వంటి వారిని గద్దెదించి ఉరితేసేవారు. వెనుకబడిన కులాలకు చెందిన నామదేవ్ వంటి సాధువులను నిర్భంధించేవారు.[7] కన్హోపాత్ర వంటి స్త్రీలను బలవంతంగా ఆత్మహత్య చేయించుకొనేవారు. ఘసడీలు అనేది ఒక ఉర్దూ బిరుదు.[8]

ఇస్లాం మతంలోకి స్వీకరించబడిన హిందువులు కూడా వివక్షకు గురయ్యారు. జియావుద్దీన్ అల్ బరానీ రచించిన భారతదేశంలోని ముస్లింల కులవ్యవస్థ ప్రకారం[9] ఇలాంటి మత మార్పిడి ద్వారా ఇస్లాంలో చేరినవారిని 'అజ్లఫ్' కులానికి చెందినవారిగా భావిస్తారు. వీరిని 'అష్రఫ్' కులాలతో పోల్చితే తీవ్ర వివక్ష కలదు[10].

అరబ్బులు

ఎనిమదవ శతాబ్దపు తొలి పాదములో భారతదేశముపై ఇస్లాము దాడి మొదలయ్యింది. ఇరాక్ పాలించుతున్న హజ్జాజ్ రాజునకు దాడి చేయుటకు ఒక పోరు సాకు (casus belli) దొరికింది. దేబాల్ తీరప్రాథములో నౌకాయానము చేస్తున్న అరబ్బు స్త్రీలను సముద్ర దొంగలు చెరబట్టి వారి సంపదను కొల్లగొట్టారు. ఈ దొంగలు సింధూ తీరప్రాంతము వారు. ముహమ్మద్ బీన్ కాసిమ్ ఆధ్వర్యములో 6000 సైనికులు క్రీ. శ. 712 లో సింధూప్రాంతముపై దాడి చేశారు. చాచ్ నామా ప్రకారము దేవాలయములు ధ్వంసము చేయబడ్డాయి. ఎదిరించిన సింధూ సైనికులు మూకుమ్మడిగా వధించబడ్డారు. వారి స్త్రీలు, పిల్లలు బానిసలు చేయబడ్డారు[11]. జాట్, మేద్, భుట్టో తెగలవారిని ప్రలోభబెట్టి వారి సహాయముతో గ్రామప్రాంతములను కాసిం లొంగతీసుకున్నాడు[12]. లోపాయికారీ ఒప్పందములతో పట్టణాలను వశపర్చుకున్నాడు. హజ్జాజ్ కు ఇది నచ్చలేదు. వైరిపక్షముపై కఠిన చర్యలకు ఆదేశించాడు[13].

"It appears from your letter that all the rules made by you for the comfort and convenience of your men are strictly in accordance with religious law. But the way of granting pardon prescribed by the law is different from the one adopted by you, for you go on giving pardon to everybody, high or low, without any discretion between a friend and a foe. The great God says in the Koran [47.4]: "0 True believers, when you encounter the unbelievers, strike off their heads." The above command of the Great God is a great command and must be respected and followed. You should not be so fond of showing mercy, as to nullify the virtue of the act. Henceforth grant pardon to no one of the enemy and spare none of them, or else all will consider you a weak-minded man"

తదుపరి ఆజ్ఞ ప్రకారము పురుషులను చంపి వారి పిల్లలను బందీలుగా చేయవలెనని ఆదేశించబడింది. ఆ విధముగా కాసిం బ్రాహ్మణాబాద్ నగరములొ 6,000 నుండి 16,000 వేల మధ్య ఎదిరించినవారిని వధించాడు[14].

చరిత్రకారుడు ఉపేంద్ర ఠాకూర్ హిందువులు, బౌద్ధులపై జరిగిన అత్యాచారములను ఉటంకించుతూ:[15]

"When Muhammad Kasim invaded Sind in 711 AD, Buddhism had no resistance to offer to their fire and steel. The rosary could not be a match for the sword and the terms Love and Peace had no meaning to them. They carried fire and sword wherever they went and obliterated all that came their way. Muhammad triumphantly marched into the country, conquering Debal, Sehwan, Nerun, Brahmanadabad, Alor and Multan one after the other in quick succession, and in less than a year and a half, the far-flung Hindu kingdom was crushed, the great civilization fell back and Sind entered the darkest period of its history. There was a fearful outbreak of religious bigotry in several places and temples were wantonly desecrated. At Debal, the Nairun and Aror temples were demolished and converted into mosques.[Resistors] were put to death and women made captives. The Jizya was exacted with special care.[Hindus] were required to feed Muslim travellers for three days and three nights"

చరిత్రకారుడు 'డి లీయూవ్' దేబల్ పట్టణ ఆక్రమణకు ముందు జరిగిన ఘటనలపై ఈ విధముగా వ్యాఖ్యానించాడు:[16].

"In fact, we have clear evidence that the Arabs were very tolerant towards both Buddhists and Hindus during the rest of the campaign and throughout the time they ruled Sind...Of course that does not mean that no monuments were ever destroyed, for war always means a certain amount of damage to buildings but it does prove that there was no wanton and systematic destruction of each and every religious center of the Buddhists and Hindus in Sind"

ఘజనీ మహమ్మదు

సింధూదేశములో అరబ్బుల ప్రవేశము పిదప రెండు వందల సంవత్సరముల వరకు భారతమునకు విరామము చిక్కినది. క్రీ. శ. 870లో కాబూల్ లోయలో మహమ్మదీయులు ప్రవేశించారు. క్రీ. శ. 963లో అప్తిజీన్ అను తురుష్కుడు కాబూల్ ఆక్రమించి హిందువులను బౌద్ధులను మిగుల బాధించాడు. ఆతని కొడుకు సబక్తజీను క్రీ. శ.977లో హిందూ రాజు జయపాలుని వధించి హిందువులను బౌద్ధులను ఊచకోత కోశాడు. కాసిం ఆగడాల పిదప జరిగిన రెండవ పెద్ద మారణహోమం ఇదే. ఖైబర్ కనుమ చేజిక్కడముతో భారతదేశపు మహాద్వారము తెరవబడింది. సబక్తజీను కొడుకు మహమ్మదు ఘజనీ ఆఫ్ఘాన్ పాలకుడయ్యాడు. అల్-ఉత్బీ, ఫెరిష్తా, మున్నగు మహమ్మదీయ చరిత్రకారులు ఆనాడు జరిగిన అకృత్యాలను గర్వముతో విపులముగా చిత్రించారు. నవంబరు 27, 1001 న మొదలైన 17 దాడులు 1027 సంవత్సరము వరకు సాగాయి. గంగా మైదాన ప్రాంతములో మథుర మున్నగు పలు దేవాలయములు ధ్వంసము చేసి తన చర్యలకు 'జెహాద్' ముద్ర వేశాడు[17]. ఈ దాడులలో వేలాది హిందువులను చంపి వారి పుర్రెలతో గుట్టలు పోసి వినోదించాడు[18][19]. మథుర దేవాలయ విధ్వంసము పిదప దొరికిన సంపద చెప్పనలవి గాదు.

"In the middle of the city there was a temple larger and finer than the rest, which can neither be described nor painted." The Sultan Mahmud was of the opinion that 200 years would have been required to build it. The idols included "five of red gold, each five yards high," with eyes formed of priceless jewels. "The Sultan gave orders that all the temples should be burnt with naphtha and fire, and leveled with the ground"

మహమ్మదు యుద్ధసమయములోనే రక్తము చిందించాడని, హిందువుల పట్ల సహనము చూపాడనీ, తన కొలువులో తిలక్ వంటి హిందువులకు పదవులిచ్చాడనీ హోల్ట్ వ్రాశాడు[20].

మహమ్మదుతో బాటు భారతదేశము వచ్చిన పారశీక చరిత్రకారుడు అల్ బిరూని మాటలలో[21]:

"Mahmud utterly ruined the prosperity of the country, and performed there wonderful exploits, by which the Hindus became like atoms of dust scattered in all directions, and like a tale of old in the mouth of the people. Their scattered remains cherish, of course, the most inveterate aversion toward all Moslems"

మహమూద్ దేశం యొక్క శ్రేయస్సును పూర్తిగా నాశనం చేసాడు, అక్కడ విలక్షణం అయిన దోపిడీలు చేశాడు, దీని ద్వారా హిందువులు అన్ని దిశలలో చెల్లాచెదురుగా ఉన్న ధూళి అణువులలాగా, ప్రజల నోటిలో పాత కథలాగా మారారు. వారి చెల్లాచెదురైన అవశేషాలు అన్ని ముస్లింల పట్ల చాలా విరక్తి కలిగిస్తాయి

మహమ్మదు తన చివరి దాడిలో (క్రీ. శ. 1026ల) సోమనాథ దేవాలయమును ధ్వంసము చేసి విలువైన వజ్రవైఢూర్యములను ఎనలేని సంపదను కొల్లగొట్టాడు. అచటి శివలింగమును బద్దలు గొట్టి ఆ ఖండములను ఘజనీ పట్టణములోని మసీదుకు మెట్లగా వేశాడు. ఈ దాడిలో 50,000 వేలమంది హిందువులు జట్టులు జట్టులుగా లింగమును రక్షించుటకు ఆత్మార్పణ గావించారు[22].

మహమ్మదు ఘోరీ

క్రీ. శ. 1030లో ఘజనీ మహమ్మదు మరణము పిదప ఘజనీ రాజ్యము బలహీనపడినది. 150 సంవత్సరముల తరువాత ఘోర్ నగరమును పాలిస్తున్న మహమ్మదు అను తురుష్కుడు 1186లో లాహోర్ పట్టణమును ఆక్రమించాడు. 1191లో పంజాబ్, రాజస్థాన్ ప్రాంతములను పాలిస్తున్న పృధ్వీరాజ్ ఛౌహాన్ అను రాజపుత్రుని చేతిలో చావు తప్పించుకున్నాడు. పట్టువదలని మహమ్మదు 1192లో 1,20,000 అశ్వికులతో మరలా వచ్చాడు. పృధ్వీరాజు తో సంధి చేసుకున్నట్లు నటించి, ఏమరుపాటుగా ఉన్న హిందూ సైనికులపైబడి ఊచకోత కోశాడు. వేలాది రాజపుత్ర స్త్రీలు అగ్నికి ఆహుతై సతీసహగమనము చేశారు[23]

తరాయిన్ లో జరిగిన మారణహోమం భారత చరిత్రలో ఒక మైలురాయి. పృథ్వీరాజు మరణముతో మహమ్మదునకు ఉత్తర భారతములో తిరుగులేక పోయినది. గంగా మైదానమును మూడు సంవత్సరములు అతలాకుతలము చేసి లక్షలాది హిందువులను బలాత్కారముగా మతాంతరీకరణ చేశాడు. గంగానది రక్తసిక్తమై ప్రవహించింది. జిజియా పన్నులు భరించలేక వేలాదిమంది బడుగు ప్రజలు ఇస్లాం స్వీకరించారు. పంజాబు నుండి వారణాసి వరకు వేయి దెవాలయములు ధ్వంసము చేసి మసీదులుగా మార్చాడు[24]. ఆలయముల స్థంభములు, ఖండములతోనే మసీదులు నిర్మించబడ్డాయి. అజ్మీరులో గుడి స్థంభములనే ఒకదానిపై ఒకటి పేర్చి మసీదు గోడలు కట్టబడ్డాయి.

ప్రముఖ చరిత్రకారుడు జాన్ కీయే మాటలలో[25]: "Scenes of devastation, plunder, and massacre commenced, which lasted through the ages; during which neraly all that was sacred in religion or celebrated in art was destroyed by these ruthless and barbarous invaders"

వినాశనం, కొల్లగొట్టడం, మారణకాండ వంటి దృశ్యాలు ప్రారంభమయ్యాయి, ఇది యుగాలలో కొనసాగింది; ఈ సమయంలో మతంలో పవిత్రమైన లేదా కళలో జరుపుకునేవన్నీ ఈ క్రూరమైన, అనాగరిక ఆక్రమణదారులచే నాశనం చేయబడ్డాయి

కుతుబుద్దీన్ ఐబక్

మహమ్మదు ఘోరీ వద్ద కుతుబుద్దీన్ ఐబక్ ఒక బానిస , ఆతని ఆగడములలో పాలు పంచుకున్న వాడు. 1206లో మహమ్మదు హత్యగావింపబడిన పిదప జరిగిన సంఘర్షణ పర్యవసానముగా ఐబక్ సుల్తాన్ అయ్యాడు. ఢిల్లీ లో 27 హిందూ, జైన దేవాలయములు ధ్వంసము చేసి ఆ రాళ్ళతో కుతుబ్ మీనారును, కువ్వతుల్ ఇస్లాం అను పెద్ద మసీదును నిర్మించాడు[26]. ఢిల్లీ సమీపమున గల మీరట్ పట్టణములోని గుడులు నేలమట్టము చేసి వాటిపై మసీదులు కట్టించాడు. ఆలీఘడ్ నగరములో వేలాది హిందువులను చంపించాడు [27]. ఐబక్ నాలుగు వర్షములు పాలించి గుర్రముపైనుండి పడి మరణిస్తాడు.

ఇల్ టుట్ మిష్

షమ్స్-ఉద్-దీన్ ఇల్ టుట్ మిష్ మరియొక తురుష్క బానిస సుల్తాను , కుతుబుద్దీన్ ఐబక్ అల్లుడు. తన 26 సంవత్సరముల పాలనలో ఎక్కువ కాలము మంగోల్ చెంఘిజ్ ఖాన్ ను అడ్డుకొనుటలోనే గడచింది. ఈతని కాలములో బెంగాలు, బీహారు ప్రాంతములో ఖిల్జీలు పెక్కు అకృత్యాలు చేశారు. నిస్సహాయులు, నిరాయుధులైన బౌద్ధ భిక్షువులను వేలాదిగా సంహరించారు. ఓదాంతపురి లోని బౌద్ధ విహారములు, గ్రంథాలయములు నేలమట్టము చేసి వేలాది సంస్కృత, ప్రాకృత, పాళీ పుస్తకములు తగులబెట్టారు. వారణాసిలో 1194 దండయాత్రల పిదప మిగిలియున్న గుడులను కూడ ధ్వంసము చేశాడు[28]. 1236లో ఇల్ టుమిష్ సహజ మరణము తరువాత ఆతని కుమార్తె రజియా సుల్తానా నాలుగు ఏండ్లు పాలించింది. ఈమె పాలనలో హిందువులపై అకృత్యాలు జరిగిన దాఖలాలు లేవు. బానిస సుల్తానులు మంగోలులను ఎదుర్కొనడములోనే ఎక్కువ సమయము గడపడము వల్ల హిందువులకు కొంత తెరిపి చిక్కినది.

అలాఉద్దీన్ ఖిల్జీ

బానిస సుల్తానుల పాలన అంతమైన పిదప ఖిల్జీలు పశ్చిమముగా కదిలి ఢిల్లీ పీఠము ఎక్కారు. సౌమ్యుడైన జలాలుద్దీన్ ఫిరోజ్ (మొదటి ఫిరోజ్ షా) కాలము ప్రశాంతముగా గడిచింది. ఆతని అల్లుడు అలాఉద్దీన్ మామకు తెలియకుండా 1296లో దక్షిణ భారతముపై దండెత్తుతాడు. యాదవ రాజు రామచంద్ర పాలించుచున్న దేవగిరి సిరిసంపదలతో తులతూగుతున్నది. ఉపద్రవము ఊహించని రామచంద్ర ఎనలేని సంపదను, యాదవ రాకుమారిని అప్పచెప్పి సంధి చేసుకుంటాడు. వార్త విన్న ఫిరోజ్ షా అల్లుడిని కలుసుకొనుటకు రాగా ఆతని తలను ఖండించి అలాఉద్దీన్ ఢిల్లీ పీఠమెక్కుతాడు. పంజాబ్, రాజస్థానములపై దండెత్తి రాజపుత్రులను ఓడిస్తాడు. తాను మనసుబడ్డ రాణీ పద్మిని రాజపుత్ర స్త్రీలతో బాటు అగ్నిలో దూకుతుంది. 275 వర్షముల క్రితము ఘజనీ మహమ్మదుచే ధ్వంసము చేయబడి, తిరిగి పుంజుకున్న సోమనాథ దేవాలయమును మరలా ధ్వంసము చేసి, లింగమును బద్దలుగొట్టి ఢిల్లీలోని ఒక మసీదుకు మెట్లగా వేయించాడు. ఈ దండయాత్రలో కంబయత్ పై చేసిన దాడిలో అలావుద్దీన్ కు ఒక నాజూకైన, అందగాడగు ఒక హిందూ బానిస దొరకుతాడు. అతనిపై అలావుద్దీన్ మనసు పడుతుంది. ఆతనిని మతము మార్చి, నిర్వీర్యుని గావించి (castration) తన కొలువులో పెద్ద పదవులిస్తాడు. అతడే మాలిక్ కాఫుర్.

అలాఉద్దీన్ పాలనలో హిందువులు బహు దయనీయ స్థితి ఎదుర్కొన్నారు[29]. జియావుద్దీన్ బరాని మాటలలో[30]:

ఎవరూ వారి తలెత్తుకోలేకపోయారు. వారి ఇళ్లలో బంగారం, వెండి, తాకాలు, జాటల్ లేదా మరే ఇతర సమృద్ధి కన్పించలేదు..... ఇలా దిక్కులేక వారితో నడిచే భార్యలు వెళ్లి ముసల్మాన్స్ ఇళ్లలో జీవనం కోసం నౌకరీచేశారు. "none of them could hold up his head and in their houses no signs of gold or silver, tankas and jital or any other superfluty was to be seen.....driven by destitution the wives went and served for life in the houses of the Mussulmans"

మాలిక్ కాఫుర్

మాలిక్ కాఫుర్ త్వరలో అలావుద్దీన్ సేనలకు అధిపతియై దక్షిణదేశ దండయాత్రలకు నాంది పలుకుతాడు. క్రీ. శ. 1296 నుండి 1312 వరకు జరిగిన ఈ దాడులలో పెక్కు దేవాలయములు నేలమట్టము చేయబడ్డాయి. వీటిలో ముఖ్యమైనవి ఓరుగల్లు, హలేబీడు, బేలూరు, మధుర, తంజావూరు, చిదంబరము, శ్రీరంగము, రామేశ్వరములలోని బహుప్రాచీన దేవాలయాలు[31]. బ్రాహ్మణులు వేలాదిగా మతము మార్చబడ్డారు. బంగారు విగ్రహాలు, వజ్రవైఢూర్యాలు మొదలగు ఎనలేనంత సంపద దొరికింది.

"He then determined to raze the magnificent temple to the ground. The beauty of this shrine was such that you might say it was the paradise of Shaddad.......The roof was covered with rubies and emeralds, and in short, it was a holy place of Hindus. Nevertheless, Malik Kafur dug it up from foundations, and the head of the Brahmans and idolaters danced from their necks and fell to the ground at their feet and blood flowed in torrents"

చిట్టచివరిగా సా.శ. 1311లో రామేశ్వరము చేరుకొని అచటి దేవాలయము లూటీ చేసి తిరుగు బాట పట్టాడు[32].

ఢిల్లీ తిరిగి వచ్చిన కాఫుర్, అతడు తెచ్చిన ఐశ్వర్యము చూసిన జియాఉద్దీన్ బరానీ లెక్క ప్రకారము 20,000 గుర్రములు, 612 ఏనుగులు, 96 మణుగుల బంగారము, విగ్రహములు, నాణెములు, వజ్రాలు, ఆభరాణాలు, ముత్యములతో నిండిన లెక్కలేనన్ని పెట్టెలు ఉన్నాయి. ఇప్పటి లెక్క ప్రకారము 241 టన్నుల బంగారము[33]. ఎవరూ కనీవినీ ఎరుగని అంత సంపద అప్పటివరకు ఏ దాడిలోనూ ఢిల్లీకి చేరలేదు[34]

"The old inhabitants of Delhi remarked that so much gold had never before been brought into Delhi. Noone could remember anything like it, nor was there anyhing like it recorded in history"

ఈ దాడుల పరంపరలో పెక్కు నగరాలు, గుడులు ధ్వంసమయ్యాయి. విగ్రహములు నాశనము చేయబడ్డాయి. అమాయకులైన స్త్రీలు, పురుషులు, పిల్లలు, ముదుసలులు చంపబడ్డారు. గృహములు తగులబెట్టబడ్డాయి. వేలాదిగా మతము మార్చబడ్డారు. హిందువుల పరిస్థితి బహు దయనీయముగా మారినది[35].

ఫిరోజ్ షా తుగ్లక్

తుగ్లకుల పరంపరలో ఫిరోజ్ షా మూడవ వాడు. తారిఖ్-ఇ-ఫిరోజ్ షా అను పారశీక గ్రంథములో ఈతని పాలనలోని ఘటనలు వర్ణించబడ్డాయి. బ్రాహ్మణులను ఇస్లామ్ మతము లోనికి మార్చుటకు పలు అకృత్యములు చేశాడు. లొంగని వారు బహువిధముల హింసింపబడ్డారు

"An order was accordingly given to the Brahman and was brought before Sultan. The true faith was declared to the Brahman and the right course pointed out, but he refused to accept it. A pile was risen on which the Kaffir with his hands and legs tied was thrown into and the wooden tablet on the top. The pile was lit at two places, his head and his feet. The fire first reached him in the feet and drew from him a cry and then fire completely enveloped him. Behold Sultan for his strict adherence to law and rectitude" [36].

క్రీ. శ. 1358 సంవత్సరములో వంగ, కళింగ దేశ దండయాత్రలలో జగన్నాథపురి ఆలయమును ధ్వంసము చేసి మూలవిగ్రహములను నాశనముచేశాడు. గుడిలో వందలాది బ్రాహ్మణులను వధించాడు. చిలకా సరస్సు తీరములో ఒక లక్షమంది హిందువులని సంహరించి వారి స్త్రీలను పిల్లలను బానిసలు చేశాడు[37].

తైమూర్ లంగ్

ఢిల్లీ సుల్తానుల కాలపు చివరి దశలో హిందువులు కనీవినీ ఎరుగని ఉపద్రవము వచ్చిపడింది. చెంఘిజ్ ఖాన్ క్రూరత్వము, ఘజినీ మహమ్మదు మతద్వేషము కలగలిసిన తైమూర్ డిసెంబరు 17, 1398న బలహీనుడగు ఢిల్లీ సుల్తానును ఓడించి నగర ప్రవేశము చేశాడు. లక్షలాది హిందువులను వేరుచేసి ఊచకోత కోశాడు[38]. భారత చరిత్రలో జరిగిన అతిపెద్ద భయంకర మారణహోమమిది[39]. తైమూర్ తన ఆత్మకథలో ఇదంతయూ అల్లాహ్ ఆజ్ఞ ప్రకారమే జరిగిందని వ్రాసుకున్నాడు[40].

దక్షిణ భారతము

ఉలుఘ్ ఖాన్ (మహమ్మదు బీన్ తుఘ్లక్) సా.శ. 1323లో ఓరుగల్లును సాధించి తెలుగు దేశముపై ముస్లిముల పాలనకు నాంది పలికాడు. అటు పిమ్మట జరిగిన అకృత్యములకు ఒక ప్రమాణము ముసునూరి ప్రోలయ నాయకుని విలస తామ్ర శాసనము (సా.శ. 1330)[41]:

ప్రతాపరుద్రుడను భానుడు అంతర్హితుడు కాగా లోకమున తురుష్కాంధకారము వ్యాపించింది. దేశము యవనాక్రాంతమైన పిదప ధనికులు అనేక పాపోపాయములచేత ధనము నిమిత్తము పీడింపబడినారు. తురకలను చూచీచూచుటతోనే కొందరు తమ ప్రాణములను వదిలినారు. ద్విజులు తమ యజ్ఞకర్మలను వదలుకొనవలసినవారైరి. దేవప్రతిమలు సమస్తము భగ్నములై పోయినవి. చిరకాలముగ మహాపండిత భుక్తములగుచున్న అగ్రహారములన్నియూ అపహృతములైనవి. పాపులైన యవనులు వ్యవసాయము చేసినందువలని పంటపర్యాయములను బలాత్కారముగా లాగుకొనుటచేత దరిద్రులు ధనికులు అను భేదములేక రైతు కుటుంబములన్నియు నాశనమయి పోయినవి. ఆ మహావిపత్కాలమున విత్తము, భార్య మొదలగు వేనియందును ప్రజలకు స్వాయత్తతాభావము పోయింది. కల్లు త్రాగవలెను. ఆవుమాంసము తినవలెను. బ్రాహ్మణులను చంపవలెను. ఇది యవనాధముల వృత్తి. వారి వ్యాపారము ఇట్లుండినపుడు ఇంక భూమిమీద ప్రాణిలోకము బ్రతుకుటెట్లు? ఈ విధముగ రాక్షసులవంటి తురుష్కుల వలన పీడింపబడిన త్రిలింగ దేశము రక్షించువారెవరును మనస్సుకు కూడా తట్టక కార్చిచ్చు చుట్టుకున్న అడవి వలె సంతపించిపోయినది (పంక్తులు 28-39) [42].

మహమ్మదీయులు దేవాలయములను విధ్వంసము చేసి దేవప్రతిమలను పగులగొట్టి ఆ దేవాలయయస్థానములందు మసీదులు కట్టించిరి. ఇట్టి మసీదులలో రాజమహేంద్రవరములోని పెద్ద మసీదు అతి ప్రాచీనమైనది. ఇది పూర్వ చాళుక్య రాజుల కాలములో నిర్మితమైన వేణుగోపాలస్వామి ఆలయము. ఉలుఘ్ ఖాను భటుడు సాలార్ ఉల్వి హిజిరా 724లో (సోమవారము, 10వ సెప్టెంబరు, క్రీ. శ. 1324) దేవాలయము పడగొట్టి మసీదు కట్టించాడు. పిమ్మట ఏలూరు, కొండపల్లి మున్నగుచోట్ల కూడా హిందూదేవాలయములు కూలద్రోయబడి వాని స్థానమున మసీదులు నిర్మితమైనవి [43].

మొఘలులు

మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ యుద్ధములలో సంహరించబడిన హిందువుల శిరములను గుట్టలుగా పోయించేవాడు[44]. బాబర్ గంగా మైదానములో వందలకొద్దీ గుడులు ధ్వంసము చేశాడు. ఆతని సేనాని మీర్ బకి అయోధ్య లోని శ్రీరామ దేవాలయమును ధ్వంసము చేసి మసీదు కట్టించాడు[45].

తదుపరి మొఘలుల కాలములో హిందువులపై అకృత్యాలు చాల వరకు తగ్గాయి. కాని చివరి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ (1679 - 1688) రెట్టించిన ఉత్సాహముతో హిందువులను కడు ఇక్కట్టులకు గురి చేశాడు. ఈతని మతద్వేషమునకు ముఘల్ సామ్రాజ్యపు పునాదులు కదిలాయి. ఔరంగజేబ్ హిందువుల పైన జిజియా (జుట్టు) పన్ను విధించాడు. హిందువుల పండుగ దీపావళిని నిషేధించాడు. ఇతడు దేశవ్యాప్తంగా సుమారు 60,000 హిందూ దేవాలయాల్ని కూల్చాడు. ఒక్క మథుర లోనే వెయ్యికి పైగా దేవాలయాలు నాశనమయ్యాయి. క్రీ. శ. 1661 లో శ్రీ కృష్ణుని దేవాలయము నేల మట్టము చేశాడు[46]. 1669 లో వారణాసిలో విశ్వనాథ దేవాలయము ధ్వంసము చేశాడు. దాని స్థానములో 71 మీటర్ల ఎత్తయిన మసీదు నిర్మింపచేశాడు[47]. వాటి స్థానంలో సుమారు 3,000 మసీదుల్ని నిర్మించాడు. సోమనాథ్ దేవాలయాన్ని మరొకసారి ధ్వంసం చేశాడు.

హైదరు ఆలీ, టిప్పు సుల్తాను

మైసూరు రాజ్యమును పాలించిన హైదర్ ఆలి కేరళలో చేసీన ఘాతుకములు పెక్కు. అచటి నాయర్లను వేలాదిగా వధించాడు. ఆతని మప్పిళ్ళ సైన్యము హిందువులను హింసించి, దోచుకొని, బానిసలు గావించి, ఇస్లామీకరణ చేసేవారు[48]. సా.శ. 1781లో తంజావూరు పై దాడి చేసిన సందర్భమున అచట జనజీవనమును అతలాకుతలము చేశాడు. తంజావూరు ప్రాంతము తిరిగి కోలుకొనుటకు వంద సంవత్సరములకు పైనే పట్టినది. ఈ అంధకార కాలమును తమిళులు ఇప్పటికీ 'హైదరకలాపం' అని అంటారు[49].

హైదర్ ఆలి కుమారుడు టిపు సుల్తాన్, మైసూరు, కూర్గ్, కేరళ ప్రాంతములలో హిందువులను మిగుల హింసించాడు. వేలమంది చంపించి అసంఖ్యాకముగా హిందువులను మతము మార్చాడు[48][50][51]. టిప్పు చేసిన దురాగతాలు పలు క్రైస్తవ యాత్రికులు, మిషనరీలు విపులముగా వ్రాశారు[52][53].

క్రైస్తవ యాత్రీకుడు బార్తొలోమియొ మాటలలో:

ఫ్రెంచ్ కమాండర్, ఎం. లాలీ ఆధ్వర్యంలో ఫీల్డ్-గన్ యూనిట్ తరువాత మొదట ప్రతి ఒక్కరినీ కసాయి చేసిన 30,000 మంది ఉన్న అనాగరికుల దళం. టిప్పు సుల్తాన్ ఏనుగుపై వెళుతుండగా దాని వెనుక మరో 30,000 మంది సైనికులు ఉన్నారు. కాలికట్‌లో చాలా మంది పురుషులు, మహిళలు ఉరి తీయబడ్డారు. మొదటి తల్లులను ఆ తల్లుల మెడకు కట్టిన పిల్లలను ఉరితీశారు. ఆ అనాగరికుడు టిప్పు సుల్తాన్ నగ్న క్రైస్తవులను, హిందువులను ఏనుగుల కాళ్ళతో కట్టి, నిస్సహాయ బాధితుల మృతదేహాలను ముక్కలుగా చేసే వరకు ఏనుగులను కదిలించేలా చేశాడు. దేవాలయాలు, చర్చిలను తగలబెట్టడం, అపవిత్రం చేయడం, నాశనం చేయాలని ఆదేశించారు. క్రైస్తవ, హిందూ స్త్రీలు మహమ్మదీయులను వివాహమాడవలసి వచ్చింది. అలాగే వారి పురుషులు మహమ్మదీయ స్త్రీలను వివాహమాడవలసి వచ్చింది. ఇస్లాంతో చేరటానికి నిరాకరించిన క్రైస్తవులు అప్పుడు అక్కడే ఉరి వేసి చంపమని ఆజ్ఞాపించారు, ఈ దారుణాల యొక్క పై సంస్కరణ టిప్పు సైన్యం నుండి తప్పించుకొని కార్మైచెల్ క్రిస్టియన్ మిషన్ కేంద్రంగా ఉన్న వరపుజ (అల్వే సమీపంలో) చేరుకున్న బాధితుల దుఖఃకరమైన కథనం నుండి పొందబడింది. నేను స్వయంగా అనేక మంది బాధితులను పడవల ద్వారా వరపూజ నదిని దాటడానికి సహాయపడ్డాను [54].

ఐరోపా దేశముల పాలన

భారతదేశమును పాలించిన ఆంగ్లేయులు హిందువులపై పెద్ద ఎత్తున దురాగతములు, అకృత్యములు చేసిన సంఘటనలు తక్కువ. మతాంతరీకరణ పలువిధములుగా ప్రోత్సహించబడినది గాని బలప్రయోగము చేసిన దాఖలాలు లేవు. పశ్చిమ తీరమున పోర్చుగీసు వారు సా.శ. 1560 నుందడి 1774 వరకు కొంకణ ప్రాంతము, గోవా, మంగళూరు ప్రాంతములలో దేవాలయములు పడగొట్టారు. వేలాదిగా హిందువులు క్రైస్తవ మతమునకు మార్చబడ్డారు.

నిజాం పాలిత హైదరాబాదు

హైదరాబాదు రాజ్యములో హిందువులు ప్రాథమిక హక్కులు నిరాకరింపబడి పలు రకాలుగా బాధించబడ్డారు. 88% జనాభా ఉన్న హిందువులపై బలవంతముగా ఉర్దూ భాష రుద్దబడింది. హిందువులను గద్దర్ (ద్రోహి) అని పరిగణించేవారు.రజాకార్లు తెలంగాణములో చేసిన అకృత్యాలు, ఆగడాలు తెలుగు దేశ చరిత్రలో మరువరాని దుర్ఘటనా భరితమైనవి[55].

ఖాసిం రజ్వీ

ఖాసిం రజ్వీ ఒక నర హంతకుడు.   నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ (అసఫ్ జాహ్ VII) ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడేందుకు లాతూర్ నుంచి వచ్చిన పరమ దుర్మార్గుడు. ఇతని ఆధ్వర్యంలో ఉన్న రజాకార్  సమూహం రక్తపిపాసులు. తెలంగాణములో వేలాది మందిని చిత్రహింసలుబెట్టి చంపారు. వృద్ధులలు, పిల్లలను ఏనుగులతో త్రొక్కించారు. స్త్రీలను మానభంగాలు చేశారు. రజాకార్ల అండతో ఆఖరి నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ లో కలిపేందుకు లేదా స్వతంత్ర రాజ్యంగా ఉండాలనే గట్టి ప్రయత్నం చేశాడు. సర్దార్ పటేల్ కఠిన నిర్ణయము వల్ల నిజాం 1948 సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. 1957 సెప్టెంబరు 11న జైలునుంచి విడుదలయ్యాక ఖాసిం రజ్వీ పాకిస్తాన్ వెళ్ళిపోయాడు.

దేశ విభజన

వ్యాసం: పాకిస్తాన్ లో హిందువులు

మత ప్రాతిపదికన భారతమును విభజించుటకు ముస్లిం లీగ్ మున్నగు పక్షాలు అల్లకల్లోలములు సృష్టించి హిందువులను సంహరించు ప్రక్రియ చేబట్టాయి (direct action). బ్రిటిష్ ప్రభుత్వము 1947 లో స్వాతంత్ర్యప్రదానముతో బాటు దేశ విభజన కావించింది. భారతదేశ విభజన తర్వాత వేలకొలదీ హిందువులను ముస్లింలు హతమార్చారు. ప్రతిరోజు పాకిస్తాన్ నుండి వచ్చే రైలు నిండా హిందువుల మృతదేహాలు భారతదేశం వచ్చేవి. ఈ మారణహోమంలో పది లక్షల హిందువులు చంపబడ్డారు[56]. 70 లక్షల హిందువులు, సిక్కులు శరణార్ధులుగా భారతదేశము వచ్చారు. దేశ విభజన ముందు ఉన్న 20% హిందు-సిక్కు జనాభా ప్రస్తుతము 1.8%. 1998 జనగణన ప్రకారము పాకిస్తాన్ లో హిందు-సిక్కులు 2,443,614. ప్రాథమిక హక్కులు నిరాకరింపబడి, బలాత్కార మతమార్పిడులు చేయబడుతూ, దేవాలయములు ధ్వంసము చేయబడి, అన్నివిధముల అకృత్యములకు ఎరయై చిన్నచూపు చూడబడుతున్నారు[57]. ఈ అమానుష ప్రవృత్తికి పరాకాష్ఠ స్వాత్ లోయలో జరుగుతున్న దారుణములు[58].

బంగ్లాదేశ్

1970 డిసెంబరు పాకిస్తాను ఎన్నికలలో ముజిబుర్ రెహమాన్ కు చెందిన అవామీ లీగ్ పక్షమునకు లభించిన అధిక్యత బంగ్లాదేశ్ ఆవిర్భావమునకు నాంది. పర్యవసానముగా పాకిస్తాన్ సైన్యము తూర్పు పాకిస్తాన్ లోని బాంగ్లా ముస్లిములను, హిందువులను, బౌద్ధులను మారణహోమం చేసింది. కోటి మించిన శరణార్ధులు పశ్చిమ బెంగాల్ లోకి వచ్చిపడ్డారు. భారతదేశానికి ఇది తలకు మించిన భారమయ్యింది. ముక్తి బాహినికి తోడ్పడి భారత సైన్యము బంగ్లాదేశ్ ను 1971న విముక్తి చేసింది.

పాముకు పాలు పోసిన చందాన అతి త్వరలో బంగ్లాదేశ్ భారతదేశానికి, హిందువులకు సమస్యగా మారినది. 1971 తరువాత బంగ్లాదేశ్లో ముస్లింల వేధింపులు భరించలేక అనేక మంది హిందువులు కాందశీకులుగా వలస వచ్చారు. మిగిలి వున్న హిందువులపై చెప్పనలవిగాని అకృత్యములు చేయబడ్డాయి. దేవాలయాలు ధ్వంసము చేయబద్దాయి. స్త్రీలు మానభంగములకు ఎర అయ్యారు[59]. బంగ్లాదేశ్ లో హిందువుల పై హింసకు, హిందూ స్త్రీలపై జరిగిన అకృత్యములకు వ్యతిరేకంగా, "లజ్జా" అనే నవల వ్రాసిన రచయిత్రి తస్లీమా నస్రీన్ హత్యకు ఫత్వా జారీ చేసి ఆమెను దేశం నుంచి వెళ్ళగొట్టారు[60].

సమకాలీన భారతము

కాశ్మీర్

చారిత్రకముగా కాశ్మీరము భారతదేశ సంస్కృతికి, ధర్మానికి, సాహిత్యమునకు పట్టుకొమ్మ. అట్టి ప్రదేశములో బౌద్ధులు, హిందువులు శతాబ్దముల తరబడి అకృత్యములకు ఎరయై, మతాంతరీకరణ చేయబడి స్వాతంత్ర్యము వచ్చునాటికి చిన్న సముదాయముగా మిగిలారు. ప్రత్యేక కాశ్మీర దేశానికి పోరాడుతున్న ముస్లింలు కొద్ది సంఖ్యలో మిగిలిఉన్న హిందువులను లోయనుండి తరిమివేశారు. చాలామంది నిరాశ్రయులై జమ్ము, ఢిల్లీ మొదలగు చోట్ల కాందిశీకులుగా దుర్భర జీవనము సాగిస్తున్నారు. 1980 తర్వాత అక్కడి ముస్లిం ఉగ్రవాదులు శతాబ్దాలుగా నివసిస్తున్న కాశ్మీర్ పండితులను నిర్దాక్షిణ్యంగా హతమార్చారు. వేల కొలదీ పిల్లలు అనాథలయ్యారు. వీరు కాశ్మీర్, సమీప జమ్ము ప్రాంతాలలో హిందూ యాత్రికులపై దాడిచేశారు.[61][62] చాలా మంది రాష్ట్రాన్ని వదలి కాందిశీకులుగా మిగిలిన రాష్ట్రాలలో తలదాచుకున్నారు. ఎన్నో సంఘటనలలో బస్సులలో, రైలులో ప్రయాణం చేస్తున్న యాత్రికుల్ని నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపారు. 1998లో జరిగిన వంధామ వినాశం (Wandhama Massacre) దీనికి ఒక నమూనా. ఆ సంఘటనలో 24 మంది కాష్మీరీ హిందువులను ఇస్లామీయులు భారత సిపాయిల వేషంలో వచ్చి హతమార్చారు. అమరనాథ్ సంఘటన ఇక్కడి హిందువులపై జరుగుతున్న అకృత్యాలకు మరొక ఉదాహరణ. [మూలాలు తెలుపవలెను]

ఈశాన్య భారతము

ఈశాన్య భారతములో వందలాది సంవత్సరాలుగా ప్రశాంత జీవితము గడుపుతూ, వారి వారి భాషలు మాట్లాడుతూ, తమ సంప్రదాయాలు, పండుగలు, వేడుకలు చేసుకుంటూ బ్రతికిన తెగలను బ్రిటిషు వారి పాలనలో క్రైస్తవ మిషనరీలు మత మార్పిడి చేశారు. స్వాతంత్ర్యానతరము ఈశాన్య భారతము ఒక అగ్ని గుండమైనది. హిందువులపై అత్యాచారములు ప్రారంభమయ్యాయి. నాగాలండ్ లో హిందువులు వందలాదిగా చంపబడ్డారు. పండుగలు చేసుకొనుట కూడా పాపమే. త్రిపురలో హిందూ దేవాలయములు ధ్వంసము చేయబడ్డాయి. త్రిపుర జాతీయ విముక్తి పక్షానికి బాప్టిస్ట్ చర్చ్ ధనము, ఆయుధములు సమకూర్చి హిందువులను, పసిపిల్లలను కూడా చంపుటకు ప్రోత్సహించింది[63].

కేరళ

కేరళలో 1921 సంవత్సరము ఖిలాఫత్ ఉద్యమము వల్ల ప్రభావితులైన మోప్లా ముస్లింలు సమస్యకు ఏవిధమగు సంబంధములేని హిందువులను వేలాదిగా సంహరించి, వేలాదిమందిని మతమార్పిడి చేశారు. కొన్ని ప్రాంతములను ఖిలాఫత్ రాజ్యములుగా ప్రకటంచి ఇస్లామిక్ ఖిలాఫేట్ బావుటా ఎగురవేశారు[64]. అప్పటి సంఘటనలు గమనించిన అన్నీ బీసెంట్ ఈ విధముగా వ్రాసింది: "వారు మోప్ల తెగవారిని హత్యచేసి, బహులంగా కొల్లగొట్టారు, మతభ్రష్టులు చేయని హిందువులందరినీ చంపారు లేదా తరిమికొట్టారు. సుమారు ఒక లక్ష (100,000) మంది ప్రజలు తమ ఇళ్ళ నుండి తమ బట్టలు తప్ప మరేమీ లేకుండా తరిమివేయబడ్డారు, ఉన్న ప్రతిదీ గుల్ల చేసేశారు ఈ సంఘటన వలన ఇస్లామిక్ పాలన అంటే మలబార్ మాకు నేర్పింది, భారతదేశంలో ఖిలాఫత్ రాజ్ యొక్క మరొక నమూనాను చూడటానికి మేము ఇష్టపడము" [65].

పంజాబు

1980 దశకములో పంజాబ్ వేర్పాటు వాదులు హిందువులను బాధించారు. అమృతసర్ లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ నేపథ్యములో సిక్కు ఉగ్రవాదులు లాల్రు సమీపములో బస్సులో ప్రయాణిస్తున్న 32 మంది హిందువులను బయటకు లాగి చంపారు[66].

ఇతర దేశములు

ఆఫ్ఘనిస్తాను

ఇండో-ఆర్యన్ జాతులు ఉత్తరమునుండి వచ్చి తొలుత అడుగిడిన ప్రాంతము ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్. వైదిక మతము, జోరాష్ట్రియన్ మతము, బౌద్ధ మతము ఇచట పరిఢవిల్లాయి. తొలి వేదము ఋగ్వేదము ఇచటనే ఉచ్చరింప బడింది. మహాభారతమునకు మూలాలు కూడా ఇచటివే. 10వ శతాబ్దిలో ఇస్లాం రాకతో హైందవము, బౌద్ధము, జోరాష్ట్రియన్ మతము దాదాపు తుడిచివేయబడ్డాయి. 1990 లో హిందూ-సిక్కుల జనాభా 3,00,000[67] .

2001లొ తాలిబన్లు హిందువులను చేతులపై పసుపు రంగు చిహ్నము ధరించవలెనని, హిందూ స్త్రీలు ఇస్లామిక వస్త్ర ధారణ చేయవలెనని, ఇండ్లపై గుర్తులు పెట్టవలెనని ఆదేశించారు. నాజీలు అవలంబించిన ఇట్టి పద్ధతులు తాలిబన్లు చేయుట చూసి ప్రపంచము నివ్వెర పోయింది[68][69][70]. ఆఫ్ఘన్ హిందువులు కాందిశీకులుగా ఇతర దేశములకు తరలివెళ్ళారు[71].

భూటాను

1991-92లో భూటాన్ ప్రభుత్వము లక్ష మంది నేపాలీ హిందువులను నేపాల్ కు తరిమివేసింది. వీరందరు శరణార్ఢులుగా బ్రతుకుతున్నారు. వీరికి అమెరికా ప్రభుత్వము అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మున్నగు దేశములలో స్థిర నివాసము ఏర్పాటుకు ప్రయత్నములు చేస్తోంది[72].

కజఖ్ స్తాను

2005-06లో కజఖ్ స్థాన్ ప్రభుత్వము అల్మాటీ వద్ద నున్న హరే కృష్ణ సంఘము వారి ఆశ్రమమును, సభ్యుల ఇండ్లను బలవంతముగా తొలగించింది. ఈ సంఘ సభ్యులను పలువిధములుగా వేధించింది[73]

మలేషియా

మలేషియాలో సుమారు 9 % జనాభా భారతీయులు ముఖ్యంగా తమిళనాడు నుండి వలస వెళ్ళినవారు, వారిలో 90 శాతం మంది హిందువులు. ఈ దేశంలో 2006 సంవత్సరంలో చాలా హిందూ దేవాలయాల్ని సిటీ హాల్ అథారిటీ కూల్చివేసింది,, హిందువులపై ఎన్నో హింసాత్మక చర్యలకు పాల్పడినది.[74] ఏప్రిల్ 21, 2006 తేదీన రాజధాని కోలాలంపూర్ లోని మలైమల్ శ్రీ సెల్వ కలీయమ్మన్ దేవాలయాన్ని సిటీ హాల్ బుల్ డోజర్లతో నేలమట్టం చేసింది.[75]

సెలంగోర్ రాష్ట్రంలోని వినియోగదారుల సంఘం ప్రెసిడెంట్ స్థానిక ముస్లిం అధికారులపై ఈ అకృత్యాలను ఆపడానికి ప్రయత్నిస్తున్నా కూడా ముస్లింల అధీనంలోని షా ఆలమ్ పట్టణంలో శతాధిక సంవత్సరాల పురాతనమైన హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు.[76] మే 11, 2006 తేదీన సాయుధ సిటీ హాల్ అధికారులు కౌలాలంపూర్ లోని వెయ్యికి పైగా హిందువులకు పవిత్రమైన 60-సంవత్సరాల పురాతనమైన దేవాలయంలోని భాగాన్ని కూల్చివేశారు. హిందూ హక్కుల పోరాట సమితి (Hindu Rights Action Force) ఈ దేవాలయాల కూల్చివేతల గురించి మలేషియా ప్రధాన మంత్రికి నివేదించింది.[77] చాలా హిందువులు దీనిని మలేషియాలో హిందువుల తొలగింపు కోసం జరుగుతున్న ప్రయత్నంగా భావించగా; అధికారులు మాత్రం ఇవి అక్రమ కట్టడాలుగా పేర్కొన్నది. అయితే కూల్చిన దేవాలయాలలో కొన్ని శతాబ్దాల పురాతనమైనవి.[77] హిందూ హక్కుల పోరాట సమితికి చెందిన ఒక న్యాయవాది ప్రకారం ప్రతి మూడు వారలకి ఒకటి చొప్పున మలేషియాలో హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడుతున్నాయి.[78] చట్టసభలలోని హిందూ ప్రతినిధుల్ని కూడా నిర్భంధించింది.

సౌదీ అరేబియా

అరేబియాలో ఇస్లాం మతమునకు చెందని వారికి ఏ విధమగు ధార్మిక హక్కులు లేవు. వేషభాషలలో ఇతర మతముల కట్టుబాట్లు నిషిద్ధము. ఇంటి లోపల, పరిసరములలో కూడా ఇతర మతముల దేవతలు, సూచనలు ఉండుట నేరము. ఉల్లంఘించిన వారికి కారాగార వాసము, కొరడా దెబ్బలు మొదలగు శిక్షలు అమలుచేయబడతాయి[79].

ఫిజీ

ట్రినిడాడ్

వియత్నాం

అకృత్యముల చిట్టా

  • జయపాలుని పెషావర్ వద్ద ఓడించి సబక్తజిన్ చంపిన హిందువులు (1001 నవంబరు 27) : 15,000; 5,00,000 బందీలుగా బంధువులు, పిల్లలు, స్త్రీలు[80].
  • కులచంద్రుని బులందషహర్ వద్ద్ ఓడించి సబక్తజిన్ చంపిన హిందువులు (1018 డిసెంబరు 2) : 50, 000, p. 42.
  • బ్రాహ్మణాబాద్ లో మహమ్మదు బీన్ కాసిం చంపిన హిందువులు: 16, 000[13]
  • సోమనాథ్ దేవాలయములో మహమ్మదు ఘజనీ చంపిన హిందువులు: 50,000 [81]
  • మహమ్మదు ఘోరీ:
  • కంబయత్ లో అలావుద్దీన్ ఖిల్జీ చంపించిన హిందువులు: 20,000, 20,000 స్తీలు బానిసలు[82]
  • చితోర్ లో అలావుద్దీన్ ఖిల్జీ వలన ఆత్మహత్య చేసుకున్న హిందూ స్త్రీలు: 20,000[82]
  • ఫిరోజ్ షా తుగ్లకు జాజ్ నగరు (ఒడిషా) లో చంపించిన హిందువులు: 1,00,000[83]
  • ఢిల్లీలో తైమూర్ లంగ్ చంపించిన హిందువులు: 1,00,000 [84][85]
  • దేవగిరిలో మాలిక్ కాఫుర్:
  • ఓరుగల్లులో ఉలుఘ్ ఖాన్:
  • మధుర దేవాలయములో మాలిక్ కాఫుర్:
  • మలబారులో మాలిక్ కాఫుర్:
  • విజయనగరములో గుల్బర్గా సుల్తాను మహమ్మదు షా చంపించిన హిందువులు: 5,00,000[86][87].
  • తళ్ళికోట యుద్ధము పిదప హంపిలో మారణహోమం: 1,00,000 మించి[88].
  • 1568లో అక్బర్ చితోర్ ఘడ్ లో చంపిన హిందువులు: 30,000; 8,000 స్త్రీల ఆత్మహత్య[89][90][91]
  • దక్షిణ దేశ దండయాత్రలలో ఔరంగజేబు చంపించిన హిందువులు (క్రీ. శ. 1681-1707) : 26,00,000[92]
  • మొఘలులకు మరాఠాలకు జరిగిన యుద్ధములలో (క్రీ. శ. 1646-1707) మరణించిన హిందువులు: సంవత్సరముకు లక్ష మంది[93]
  • కర్ణాటకములో హైదర్ ఆలీ:
  • కర్ణాటకములో టిప్పు సుల్తాను:
  • గోవాలో పోర్చుగీసువారు:
  • భారతవిభజన సమయము: 1,000,000[94].

ఇవి కూడా చూడండి

ఇస్లామిక్ తీవ్రవాదం
ఇస్లాం పై విమర్శలు

మూలాలు

  1. ".....: I was undetermined in my mind whether I should direct my expedition against infidels of China or against the infidels and polytheists of India. In this matter I sought an omen from the Koran and the verse to which I opened was this: O Prophet, make war upon infidels and unbelievers and treat them with severity"
  2. History of India: Vol. V - The Mohammedan Period as Described by Its Own Historians, Sir H. M. Elliot, 2008, ప్. 151; Cosimo, Inc.;ISBN 1605204986
  3. Will Durant, The Story of Civilization: Our Oriental Heritage, p. 459, Fine Communications, 1997, ISBN 1567310125
  4. Alain Danielou, A, Histoire de l'Inde, 1983, Fayard; Ed. rev. et augm edition; ISBN 2213012547 (ఫ్రెంచ్)
  5. Gautier, F. Rewriting Indian History, 1996, Vikas Publishing, New Delhi, ISBN 0-7069-9976-2
  6. Growth of Muslim Population in Medieval India (A.D. 1000-1800), K.S. Lal, 1973
  7. P. 88 The Rosary and the Lamp By Baburao Patel
  8. The Castes and Tribes of H.E.H. the Nizam's Dominions
  9. Caste in Muslim Society Archived 2011-08-11 at the Wayback Machine by Yoginder Sikand
  10. P. C. Aggarwal, Caste and Social Stratification Among Muslims in India, 1978, Manohar
  11. The Chach-nama: An Ancient History of Sind, English translation by Mirza Kalichbeg Fredunbeg, Delhi, 1979; (http://persian.packhum.org/persian/main?url=pf%3Ffile%3D12701030%26ct%3D18[permanent dead link])
  12. Wink, Andre, "Al-Hind, the Making of the Indo-Islamic World", Brill Academic Publishers, 2002, ISBN 0-391-04173-8 pg. 204
  13. 13.0 13.1 Trifkovic, S., The Sword of the Prophet: History, Theology, Impact on the World, 2002, Regina Orthodox Press
  14. Trifkovic, S., http://www.frontpagemag.com/Articles/Printable.aspx?GUID={401C6222-3668-4E4B-9824-D85A9D2B4B6A}[permanent dead link]
  15. ఉపేంద్ర ఠాకూర్ పుస్తకము: Sindhi Culture, U. T. Thakur, University of Bombay Publications, Bombay, 1959
  16. Lohuizen-de Leeuw, J. E., South Asian Archaeology, 1975, pg 152-153, Brill Academic Publishers, ISBN 90-04-05996-2
  17. Saunders, K. A Pageant of India, H. Milford, Oxford University Press, p. 162
  18. Karan, P. The Non-Western World: Environment, Development and Human Rights, Routledge, p. 344
  19. Barron, M. Minorities in a Changing World, 1967, Knopf, p. 54
  20. Holt, P.M. and Lewis, B., The Cambridge History of Islam, Cambridge University Press, 1977, ISBN 0-521-29137-2; p. 3-4
  21. Ancient India: English translation of Kitab-ul Hind by Al-Biruni, National Book Trust, New Delhi
  22. Kakar, S. The Colors of Violence: Cultural Identities, Religion, and Conflict, University of Chicago Press p. 50
  23. Keay, J, India: A History, 2001, Grove Press; ISBN 0802137970, గూగుల్ బుక్స్‌లో ఈ పుస్తకం
  24. Rashid, A., Society and Culture in Medieval India, 1206-1556 A.D. (Excerpt from Taj-ul-Maasir by Hasan Nizami,), 1969, Firma
  25. Keay, J, India: A History, 2001, Grove Press; p. 238ISBN 0802137970
  26. Maulana Abdul Hasan Nadwi, Hindustan under Islamic rule, Translation of "Hindustan Islami Ahad Mein" by Maulana Hakim Saiyid Abdul Hai
  27. హస్సన్ నిజామ్-ఇ-నైషాపురి, తాజ్ ఉల్ మాసిర్ (పారశీకము)
  28. Elliot, H. M., The History of India: as told by its own historians; the Muhammadan period, 1953, University of Michigan.
  29. History of the Khaljis, A.D. 1290-1320, Lal, K. S., 1967, Edition 2, 1967, Asia Publising House
  30. The Hisory of India as told by its own Historians, Elliot,H.M. and Dowson, J., Vol. III, 1867, Adamant Media Corporation; ISBN 1402182120
  31. History of India: Vol. V - The Mohammedan Period as Described by Its Own Historians, Sir H. M. Elliot, 2008, Cosimo, Inc., p. 151; ISBN 1605204986
  32. History of Medieval India: From 1000 A. D. to 1707 A. D. Chaurasia, R.S., 2002, Atlantic Publishers & Distributors, p.36;ISBN 8126901233
  33. Studies in Islamic History and Civilizaion, David Ayalon, BRILL, 1986, p.271; ISBN 965264014X
  34. Keay, J. India, 2001, Grove Press, ISBN 0802137970
  35. Modak, B. R., Sayana, 1995, Sahitya Academy, New Delhi. p. 4, ISBN 8172019408
  36. Banerjee, J., History of Firuz Shah Tughluq, 1967, Munshiram Manoharlal, Delhi
  37. Gupta, M. L., Glimpses of Indian History: Past and Present, Anmol Publications, New Delhi, p. 57; ISBN 8126111860
  38. Gupta, M. L., Glimpses of Indian History: Past and Present, Anmol Publications, New Delhi, p. 59; ISBN 8126111860
  39. The History of India, as Told by Its Own Historians. The Muhammadan Period; Sir H. M. Elliot, Edited by J. Dawson, 1867, Trubner Company,London
  40. తైమూర్ ఆత్మ కథ: Malfúzát-i Tímúrí, or Túzak-i Tímúrí: The Autobiography or Memoirs of Emperor Tímúr, Volume III: To the Year A.D. 1398, Chapter: XVIII, Page 389; http://www.infinityfoundation.com/mandala/h_es/h_es_malfuzat_frameset.htm
  41. ప్రోలయ నాయక విలస తామ్ర శాసనము: Venkataramanayya, N and Somasekhara Sarma, M. Epigraphica Indica, Volume 32, 1987, Delhi, pp. 239-268
  42. విజ్ఞాన సర్వస్వము, తెలుగు సంస్కృతి, దేశము-చరిత్ర, మొదటి సంపుటము, 1990, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, పుట 350
  43. విజ్ఞాన సర్వస్వము, తెలుగు సంస్కృతి, దేశము-చరిత్ర, మొదటి సంపుటము, 1990, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, పుట 351
  44. India as seen by Babur, AD 1504-1530, R. Nath, M.D. Publications Pvt. Ltd., 1996, p.3;ISBN 8175330007
  45. రామ మందిర విధ్వంసము; http://www.britannica.com/EBchecked/topic/46559/Ayodhya#ref=ref167295
  46. ఔరంగజేబ్ దేవాలయ విధ్వంసము: http://www.the-south-asian.com/Dec2000/Aurangzeb.htm
  47. దేవాలయ విధ్వంసము చిట్టా: http://www.hindunet.org/hindu_history/modern/temple_aurangzeb.html
  48. 48.0 48.1 హైదర్ ఆలి, టిప్పు సుల్తానుల దురాగతాలు; http://voi.org/books/tipu/ Archived 2010-07-21 at the Wayback Machine
  49. హైదర కలాపం: Subramanian, K. R., The Maratha Rajas of Tanjore, 1928, pp. 65.
  50. Tipu Sultan's Search for Legitimacy: Islam and Kingship in a Hindu Domain by Kate Brittlebank, Review by Wagoner, P. B., The Journal of Asian Studies Vol. 58, No. 2 (May, 1999) pp. 541–543
  51. Valath, V. V. K. (1981) Keralathile Sthacharithrangal (in Malayalam), Kerala Sahithya Academy. pp. 74–79
  52. Malabar Manual, William Logan
  53. Historical Sketches, Col. Wilks
  54. Voyage to East Indies, Fra Bartolomaeo
  55. మారోజు శ్రీహరి, Telangana Liberation: A People's Struggle; http://www.telangana.org/Papers/article11.asp Archived 2007-06-06 at the Wayback Machine
  56. India, S.A. Wolpert, University of California Press, 1999, p. 104; ISBN 0520221729
  57. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-11-24. Retrieved 2009-05-21.
  58. స్వాత్ లోయలో అకృత్యాలు: http://specials.rediff.com/news/2009/mar/18sld1-hindu-families-face-the-heat.htm
  59. Encyclopaedia of Bangladesh, N. K. Singh, Anmol Publications Pvt. Ltd; ISBN 8126113901
  60. Shifting Continents/colliding Cultures: Diaspora Writing of the Indian Subcontinent, R. J. Crane and R. Mohanram, Rodopi, 2000;ISBN 9042012714
  61. "Atrocities on Kashmiri Hindus by Pakistan-Trained Terrorists". Archived from the original on 2006-08-05. Retrieved 2006-08-26.
  62. Gill, Kanwar Pal Singh. "The Kashmiri Pandits: An Ethnic Cleansing the World Forgot". South Asian Terrorism Portal. Retrieved 2006-08-26.
  63. సుబీర్ భౌమిక్: http://news.bbc.co.uk/2/hi/south_asia/717775.stm
  64. O. P. Ralhan, Encyclopaedia of Political Parties: India, Pakistan, Bangladesh: National, Regional, Local., 1996, Anmol Publications Pvt. Ltd. p 297
  65. Besant, Annie. The Future Of Indian Politics: A Contribution To The Understanding Of Present-Day Problems, Kessinger Publishing, p. 252; ISBN 1428626050
  66. ఫిలడెల్ఫియా ఎన్ క్వైరర్, Gunmen Slaughter 38 on Bus in India in Bloodiest Attack of Sikh Campaign, జులై 7, 1987, p. A03
  67. Encyclopaedia Britanica, Volume V13, 1911, p. 478; http://encyclopedia.jrank.org/PAS_PER/HINDKI.html Archived 2010-08-11 at the Wayback Machine
  68. T. C. MalhOtraa, CNN News; http://www.cnsnews.com/ViewPrint.asp?Page=\ForeignBureaus\archive\200106\For20010615b.html Archived 2008-05-25 at the Wayback Machine
  69. Aziz Haniffa, Rediff: http://www.rediff.com/us/2001/jun/14us1.htm
  70. CNN News: http://archives.cnn.com/2001/fyi/news/05/22/taleban.hindus/index.html Archived 2007-02-21 at the Wayback Machine
  71. యూరోప్ లో ఆఫ్ఘన్ హిందువులు: http://www.pluralism.org/resources/slideshow/hindgerm/index.php Archived 2012-10-15 at the Wayback Machine
  72. http://www.unhcr.org/refworld/topic,463af2212,469f2cba2,469f386a1e,0.html
  73. అల్మాటీ లో హరే కృష్ణ: http://www.forum18.org/Archive.php?article_id=873
  74. Temple row - a dab of sensibility please,malaysiakini.com
  75. "Muslims Destroy Century-Old Hindu Temple,gatago.com". Archived from the original on 2006-11-04. Retrieved 2008-12-12.
  76. Pressure on multi-faith Malaysia,BBC
  77. 77.0 77.1 Hindu group protests 'temple cleansing' in Malaysia,Financial Express
  78. Malaysia ethnic Indians in uphill fight on religion Archived 2020-04-23 at the Wayback Machine Reuters India - November 8, 2007
  79. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2006-05-22. Retrieved 2006-05-22.
  80. The History of India: as told by its own historians, The Muhamadan Period, vol. 2; p. 29; Elliot, H. M. (Henry Miers), Sir; John Dowson (1871), London : Trübner & Co (http://www.archive.org/stream/cu31924073036729#page/n41/mode/2up)
  81. ఉత్బీ, Arikh-i-Yamini (పారశీకము)
  82. 82.0 82.1 Abdulla Wassaf, Tazjiyat-ul-Amsar wa Tajriyat (పారశీకము)
  83. Sirat-i-Firoz Shahi(పారశీకము)
  84. James Trager, The People's Chronology, 1992
  85. An Advanced History of India, by R.C.Majumdar, H.C.Raychaudhuri, K.Datta, 2nd Ed., MacMillan and Co, London, pp.336-37, 1965
  86. Robert Sewell, A Forgotten Empire: Vijayanagar: A Contribution to the History of India
  87. History of the Rise of Mahomedan Power in India, Briggs, J. Translation of 'Tarikh-i-Firishta' (Persian) by Ferishta, M. K., Vol., 1829, p. 327, Longman and others, London
  88. పోర్చుగీస్ యాత్రికులు పేస్, న్యూనెజ్ ప్రకారము: http://webpages.charter.net/anthropogene/arc_vol3_is8.html Archived 2007-10-11 at the Wayback Machine
  89. White, M. 2006, Twentieth Century Atlas: Historical Body Count
  90. Encyclopedia Britannica, 15 th Ed, Vol.21, p.65, 1987
  91. The Cambridge History of India, Vol.IV - The Mughul Period, by W.Haig & R.Burn, S.Chand & Co., New Delhi, pp. 98-99, 1963
  92. Stanley Wolpert, A New History of India, 4th ed
  93. Clodfelter, Maratha-Moghul Wars: 1646-1707
  94. Wolpert, S., India, University of California Press, 1999, p. 104; ISBN 0520221729