తస్లీమా నస్రీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తస్లిమా నస్రీన్

తస్లిమా నస్రీన్
జననం: 25 ఆగస్టు 1962
వృత్తి: రచయిత్రి, కవయిత్రి, కాలమిస్టు
జాతీయత:బంగ్లాదేశీ, స్వీడిష్
రచనా కాలము:1980 – ప్రస్తుతం
ప్రభావాలు:బేగమ్ రొఖయ్యా, సల్మాన్ రష్దీ
వెబ్‌సైటు:http://taslimanasrin.com/

తస్లీమా నస్రీన్ (బెంగాలీ: তসলিমা নাসরিন), బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత్రి, స్త్రీవాద మానవ హక్కుల కార్యకర్త, సెక్యులర్ వాది. తస్లీమా రచయిత్రిగా ప్రపంచ ప్రసిద్ధి పొందిననూ ముస్లిం చాంధసవాదుల నుంచి ముప్పు ఎదుర్కొంటుంది. ఆమెపై ఫత్వా జారీ చేయడమే కాక ఆమె తలపై వెల కట్టారు ముస్లిం చాంధసవాదులు.[1] బంగ్లాదేశ్ నుండి వచ్చి కోల్‌కతలో నివాసం ఏర్పర్చుకుంది. ఆ తరువాత చాందసవాదులు ఆందోళన చేయడంతో భారత ప్రభుత్వం ఢిల్లీలో ఆశ్రయం కల్పించింది.[2] 2008, మార్చి 20న భారత్‌ను వదిలి గుర్తుతెలియని ప్రదేశానికి పయనించింది.[2]

జీవితం[మార్చు]

1962, ఆగష్టు 25బంగ్లాదేశ్ లోని మైమెన్‌సింగ్ లో జన్మించింది. ముస్లిం కుటుంబంలో పుట్టి, ముస్లింగా పెరిగినప్పటికీ చదువు, వయస్సు పెరిగే కొద్దీ ఆమె హేతువాదిగా, నాస్తకురాలిగా మారింది.[1] 1994 వరకు ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేసింది. 1990 నుండి తన అభ్యుదయవాద రచనలతో ప్రపంచ ప్రసిద్ధి పొందింది. 1994లో స్వేచ్ఛా అభిప్రాయాలకు గాను యూరోపియన్ పార్లమెంటు నుంచి సఖరోవ్ బహుమతిని, 1996లో మానవతా అవార్డు పొందింది. ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపినందుకు ఇస్లాం లేఖనాలను విమర్శించినందుకు 1993 నుంచి ఇస్లాం ఛాందసవాదులు ఆమెను చంపాలని చూస్తున్నారు. 2007లో ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాదులో ఒక రచయితల సదస్సులో పాల్గొనడానికి వచ్చిన సందర్భంలో మజ్లిస్ పార్టీకి చెందిన ఇస్లాం చాందసవాదులు ఆమెపై దాడిచేశారు.[3] సెప్టెంబర్ 2007 లో పశ్చిమ బెంగాల్లో ఆమెను భారతదేశం నుంచి బహిష్కరించాలని ప్రదర్శనలు చేశారు. ఆమెకు భారత పౌరసత్వం ఇవ్వొద్దని ఇలాంటి వర్గాలే కోరుతున్నాయి [4]. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతిస్పందింస్తూ బంగ్లాదేశ్‌లో హిందువులపై ముస్లింలు జరిపిన దాడులకు వ్యతిరేకంగా వ్రాసిన లజ్జా అనే నవల కూడా చాలా వివాదాస్పదమయ్యింది.

రచనలు[మార్చు]

కవితా సంపుటాలు[మార్చు]

  • The Game in Reverse: Poems and Essays by Taslima Nasrin 1995
  • షికోరే బిపుల్ ఖుధా (Hunger in the Roots), 1986
  • నిర్బాషితో బాహిరే ఓంతొరే (Banished Without and Within ), 1989
  • అమర్ కీచూ జాయే అషే నే (I Couldn’t Care Less), 1990
  • అతోలే ఓంతొరిన్ (Captive In the Abyss), 1991
  • బాలికర్ గొల్లాచూత్ (బాలికల ఆట), 1992
  • బేహులా ఏక భాషియేచిలో భేల (Behula Floated the Raft Alone), 1993
  • ఆయ్ కొస్టో ఝేపే, జీబొన్ దేభో మేపే (Pain Come Roaring Down, I’ll Measure Out My Life for You), 1994
  • నిర్బాషితో నరీర్ కొబితా (నిర్వాసము నుండి పద్యాలు), 1996
  • జొలొపొద్యో (నీటికలువలు), 2000
  • ఖాళీ ఖాళీ లాగే (Feeling Empty), 2004
  • ఖిచ్చుక్కన్ థాకో ( కొద్దిసేపు ఉండు), 2005

వ్యాసాలు[మార్చు]

  • నిర్బాచితో కాలమ్ (ఎంపికచేసిన కాలమ్స్)
  • జాబో న కేనో జాబో (నేను వెళ్ళను; ఏందుకెళ్ళాలి?)
  • నొష్టో మేయేర్ నొష్టో గొద్దో (Corrupt prose of a corrupt girl)
  • ఛోటో ఛోటో దుఖ్ఖో కొథా (చిన్న చిన్న కష్టాల కథ)

నవలలు[మార్చు]

  • ఒపోర్‌పొఖ్ఖో (ప్రత్యర్థి) 1992
  • శోధ్ (ప్రతీకారము), 1992 (ISBN 978-81-88575-05-3)
  • నిమోంత్రణ్ (ఆహ్వానం) 1993
  • ఫేరా (పునరాగమనం) 1993
  • భ్రొమొర్ కైయో గియా (అతనికి రహస్యం తెలుపు) 1994
  • ఫొరాషీ ప్రేమిక్ (ఫ్రెంచి ప్రేమికుడు) 2002
  • లజ్జా (నవల) , (ISBN 978-0-14-024051-1)

స్వీయచరిత్రలు[మార్చు]

  • అమార్ మేయెబేల (నా బాల్యం), 1999
  • ఉతల్ హవా (Wild Wind), 2002
  • ఖా (Speak Up), 2003
  • ద్విఖోందితో (Split-up in Two), 2003
  • సెయ్ సొబ్ అంధోకార్ (All those darkness), 2004
  • మేయెబేల, మై బెంగాళీ చైల్డ్‌హుడ్ - A Memoir of Growing Up Female in a Muslim World, 2002 (ISBN 1-58642-051-8)
  • అమీ భాలో నెయ్, తుమీ భాలో థేకో ప్రియో దేష్ (I am not okay, but you stay well my beloved homeland), 2006.

సాధించిన అవార్డులు[మార్చు]

  • 1992 : ఆనంద అవార్డు
  • 1992 : బంగ్లాదేశ్ యొక్క నాత్యసవ అవార్డు
  • 1994 : యూరోపియన్ పార్లమెంటు నుంచి సఖరోవ్ బహుమతి
  • 1994 : ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి మానవహక్కుల అవార్డు
  • 1994 : స్వీడిష్ సంస్థ యొక్క కర్ట్ టుకోల్‌స్కీ అవార్డు
  • 1994 : మానవ హక్కుల పరిరక్షణ, అమెరికా నుంచి హెల్‌మన్-హామ్మెట్ గ్రాంట్
  • 1994 : నార్వే యొక్క Human-Etisk Forbund నుంచి మానవతావాది అవార్డు
  • 1994 : అమెరికా యొక్క ఫెమినిస్ట్ మెజారిటీ ఫౌండేషన్ నుంచి ఫెమినిస్ట్ ఆఫ్ ది ఇయర్ గుర్తింపు
  • 1995 : బెల్జియంకు చెందిన ఘెంట్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరణ
  • 1995 : జర్మన్ ఎక్స్ఛేంజ్ సర్వీస్ నుంచి స్కాలర్‌షిప్
  • 1996 : స్వీడన్ దేశపు ఉప్సలా విశ్వవిద్యాలయం నుంచి మోనిస్మానియన్ బహుమతి
  • 1996 : గ్రేట్ బ్రిటన్కు చెందిన ఇంటర్నేషనల్ హ్యుమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్ నుంచి మానవతా వాది అవార్డు
  • 1996 : అమెరికాకు చెందిన అంతర్జాతీయ మానవతా అకాడమీ నుంచి మానవతా అవార్డు, 1996
  • 2000: భారతదేశపు ఆనంద పురస్కారం
  • 2000 : ప్రపంచ ఆర్థిక ఫోరం నుంచి రేపటి ప్రపంచ నాయకులుగా గుర్తింపు
  • 2002 : జర్మనీకి చెందిన IBKA నుంచి ఎర్విన్ ఫిషర్ అవార్డు
  • 2002 : అమెరికాకు చెందిన ఫ్రీడమ్ ఫ్రమ్ రిలీజియస్ ఫౌండేషన్ నుంచి ఫ్రీ-థాట్ హీరోయిన్ అవార్డు
  • 2003 : అమెరికాకు చెందిన హార్వార్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నె్‌మెంట్ నుంచి ఫెలోషిప్
  • 2004 : ఓర్పు, అహింస కృషిచేసినందుకు యునెస్కో-మదన్‌జిత్ సింగ్ బహుమతి
  • 2005 : ఫ్రాన్సుకు చెందిన అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ పారిస్ నుంచి గౌరవ డాక్టరేట్
  • 2005 : బెల్జియంలో ఫ్రెంచ్ పార్లమెంటుచే గ్రాండ్ ప్రిక్స్ అంతర్జాతీయ కండోర్సెట్-ఎరాన్ 2005 గుర్తింపు
  • 2006 : శరత్‌చంద్ర సాహిత్య అవార్డు, పశ్చిమబెంగాల్.
  • 2008 : పారిస్ గౌరవ పౌరసత్వం.
  • 2008 : సైమ డి బొలీవర్ ప్రైజ్.
  • 2009 : న్యూయార్ విశ్వవిద్యాలయం ఫెలోషిప్.
  • 2009 : ఉడ్రోవిల్సన్ ఫెలోషిప్.
  • 2009 : ఫెమినిస్ట్ ప్రెస్ అవార్డు, అమెరికా.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 http://www.unesco.org/webworld/points_of_views/nasreen_121199.shtml
  2. 2.0 2.1 http://in.telugu.yahoo.com/News/National/0803/20/1080320017_1.htm[permanent dead link]
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-12-21. Retrieved 2007-12-05.
  4. Shunned writer Taslima Nasreen arrives in Indian capital Archived 2012-09-10 at the Wayback Machine, earthtimes.org / 23 November 2007