విల్ డ్యురాంట్
విలియం జేమ్స్ డురాంట్ (1885 నవంబరు 5 - 1981 నవంబరు 7) ఒక ప్రసిద్ధ అమెరికన్ చరిత్రకారుడు, తత్వవేత్త, ధార్మికుడు. డురాంట్ తన భార్య అరియల్ తో కలిసి వ్రాసిన 11 సంపుటముల "The Story of Civilization" 1935-1975 సంవత్సరముల మధ్య ప్రచురితమైంది. వీరిద్దరికీ 1967లో పులిట్జర్ పురస్కారము ప్రదానము చేయబడింది.
జీవితం
[మార్చు]విల్ డ్యురాంట్ అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రములో ఫ్రెంచ్-కెనడా దంపతులు జోసెఫ్ డ్యురాంట్, మేరీ అల్లార్డ్ లకు జన్మించాడు. తల్లితండ్రులు కెనడాలోని క్వెబెక్ రాష్ట్రము నుండి వలస వచ్చిన ఫ్రెంచ్ సంతతి వారు. 1900లో న్యూ జెర్సీ లోని క్రైస్తవ పాఠశాల, కళాశాలలలో విద్యాభ్యాసము చేశాడు.
బోధనాచార్యుడు
[మార్చు]తల్లి కోరిక ప్రకారము మతబోధకుడుగా శిక్షణ పొందవలెనని డ్యురాంట్ ఆశయము. కాని భవిష్యత్ లో ఒక గొప్ప తత్వవేత్తగా మారాడు. 1905లో సామ్యవాదమును మధించి అన్ని రాజకీయ పంథాల వెనుక అధికారవ్యామోహము నిద్రాణమై ఉంటుందని తేల్చాడు. 1907లో పట్టభద్రుడయ్యాడు. న్యూయార్క్ ఈవెనింగ్ జర్నల్ కు లేఖకునిగా వారానికి పది డాలర్ల జీతానికి కుదురుకున్నాడు. లైంగిక నేరములపై పలు వ్యాసాలు వ్రాశాడు. తరువాత న్యూజెర్సీ లోని సేటన్ హాల్ విశ్వవిద్యాలయములో ఆంగ్లము, లాటిన్, ఫ్రెంచ్ భాషల బోధకునిగా చేరాడు. అక్కడే గ్రంథాలయాధికారిగా కూడా పనిచేశాడు. 1911లో ఫెర్రర్ మోడర్న్ పాఠశాలలో బోధకునిగా చేరాడు. అచటనే తన జీవిత సహధర్మచారిణి ఛాయ కాఫ్ మన్ తటస్థపడింది. తన కన్నా 13 ఏండ్లు చిన్నదైన విద్యార్థిని ఛాయకు అరియల్ అని పేరు పెట్టాడు.
డ్యురాంట్ తన జీవిత మూడవ దశకములో ప్రేమ, తత్వశాస్త్రము, క్రైస్తవము, సామ్యవాదము కలగలిసిన ఒక విచారధారను రూపొందించాడు. 1913లో అధ్యాపక పదవి వదలి స్థానిక ప్రెస్బిటీరియన్ చర్చ్ లో 10 డాలర్ల చొప్పున ఉపన్యాసములు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈ ఉపన్యాసముల విషయములే భవిష్యత్ లో రాబోవు 'The Story of Civilization' కు ఆధారాలు.
1917లో తత్వశాస్త్రములో పి.హెచ్.డి పట్టా పొందాడు. తత్వశాస్త్రము-సాంఘిక సమస్య అను గ్రంథము వ్రాశాడు. తరువాత కొలంబియా విశ్వవిద్యాలయములో బోధకునిగా చేరాడు.
రచయిత
[మార్చు]డ్యురాంట్ వ్రాసిన ముఖ్య గ్రంథాలు:
తత్వశాస్త్ర గాథ (The Story of Philosophy) : ఇది చిన్న నీలపు రంగు పుస్తకాల మాలికగా ప్రారంభమై, విపరీతమగు ప్రజాదరణ పొంది 1926లో ఒకే పుస్తకముగా ప్రచురింపబడింది. ఈ పుస్తకము ద్వారా సంపాదించిన ధనముతో డ్యురాంట్ దంపతులు పలు దేశాల్లో పర్యటించి నాలుగు దశాబ్దాలు అవిశ్రాంతముగా 'సంస్కృతి గాథ' (The Story of Civilization) వ్రాయుటకు తోడ్పడింది. బోధనా వ్యాసంగము వదిలి పదకొండు సంపుటముల బృహత్ గ్రంథము వ్రాయబూనాడు.
సంస్కృతి గాథ:
మూలాలు
[మార్చు]యితర లింకులు
[మార్చు]- Will Durant Foundationమూస:Dead preserved at the Internet Archive
- The Will Durant Timeline Project
- Will Durant's list of One Hundred Best Books for an Education
- The Pulitzer Prizes: 1968
- "Durant, Will and Durant, Ariel." Encyclopædia Britannica from Encyclopædia Britannica Premium Service. (Accessed May 14, 2005)