ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి

వికీపీడియా నుండి
(ఉప్పులూరి గోపాల కృష్ణమూర్తి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి
జననం(1918-07-09)1918 జూలై 9
మచిలీపట్నం, భారతదేశం
మరణం2007 మార్చి 22(2007-03-22) (వయసు 88)
వృత్తితత్వవేత్త
బంధువులుసౌమ్య బొల్లాప్రగడ (మనవరాలు)

ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి (జులై 9, 1918 - మార్చి 22, 2007) ఒక సుప్రసిద్ధ తత్త్వవేత్త. యూజీగా సుప్రసిద్ధుడు.

ఆయన జులై 9, 1918 న కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందిన మచిలీపట్నంలో జన్మించాడు. గుడివాడలో పెరిగాడు. ఆయన తల్లి ఇతనికి జన్మనిచ్చిన ఏడురోజులకే కన్నుమూసింది. అప్పుడు ఆయన అమ్మమ్మ అతన్ని పెంచి పెద్దచేసింది. ఆమె ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పేరొందిన న్యాయవాది. దివ్యజ్ఞాన సమాజం కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉండేది. అలా యూజీకి కూడా బాల్యం లోనే ఆ సమాజంతో పరిచయం కలిగింది.

ఎక్కువకాలము విదేశాలలో గడిపి తనదైన తత్త్వాన్ని ప్రజలకు పంచిన వ్యక్తి యు.జి. మార్చి 22, 2007లో ఆయన మరణించారు. తర్వాతనె తెలుగువారు అటువంటి తత్త్వవేత్త ఒకరున్నారని తెలుసుకున్నారు. యు.జి. తత్త్వం ఏదీ అసత్యము కాదు.. ఏదీ సత్యము కాదు అంతా మిధ్య అన్నట్టుగా సాగుతుంది. జ్ఞానోదయం " అనేది లేనే లేదంటారు. దినవారీ కార్యక్రమాల నిర్వహణకు జ్ఞానము అవసరమే. ఐతే ఆ జ్ఞానము రావడమే జ్ఞానోదయమా! అని ప్రశ్నిస్తారు . ఆలోచనల ప్రభావం తాత్కాలికమే తప్పించి శాశ్వత పరిష్కారం చూపించే ఆలోచనలే లేవన్నారు. ఆలోచన అనేది ఏ రూపంలో ఉన్నా అంగీకరించలేదు. ఆలోచనాపరమైన విజ్ఞానము కూడా మిధ్యేనని అన్నారు.

సూచికలు

[మార్చు]

ఇవి చదవండి

[మార్చు]
  • Mukunda Rao, The Biology Of Enlightenment: Unpublished Conversations Of U. G. Krishnamurti After He Came Into The Natural State (1967–71), 2011, HarperCollins India.
  • Mahesh Bhatt, U.G. Krishnamurti: A Life, 1992, Viking. ISBN 0-14-012620-1.
  • Shanta Kelker, The Sage And the Housewife, 2005, Smriti Books. ISBN 81-87967-74-9.
  • Mukunda Rao, The Other Side of Belief: Interpreting U.G. Krishnamurti, 2005, Penguin Books. ISBN 0-14-400035-0.
  • K. Chandrasekhar, J. S. R. L. Narayana Moorty, Stopped In Our Tracks: Stories of UG in India. 2005, Smriti Books. ISBN 81-87967-76-5.

ఇతర లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.