భక్తి యోగము
Jump to navigation
Jump to search
ధారావాహిక లోని భాగం |
![]() ![]() |
---|
![]() |
హిందూమత పదకోశం |
భక్తి యొగమును గురించి భగవద్ గీతలో చక్కగ వివరించబడింది. భక్తి యోగము పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని యెడల అత్యంత ప్రేమ కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి.
నారద భక్తి సూత్రాలు[మార్చు]
తొమ్మిది రకాల భక్తిని నారద మహర్షి భక్తి సూత్రాలలో వివరించారు. వీటినే నవవిధభక్తులు అని పిలుస్తారు.