పుణ్యకుమారుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుణ్యకుమారుడు
జననంసా.శ. 625
ప్రసిద్ధిపోర్ముఖరామ, పురుష శార్దూల, మదనవిలాస, మదముదిత, ఉత్తమోత్తమ
మతంహిందువు
భార్య / భర్తవసంతపోరి
పిల్లలుపిల్లలు
తండ్రిమొదటి మహేంద్ర విక్రమ నవరామ ముదిత చేర చోళ పాండ్యాధిపతి

పుణ్యకుమారుడు రేనాటి చోళులలో ఒకడు. సూర్య వంశానికి చెందినవాడు. కశ్యప గోత్రస్థుడైన నందివర్మ ఇతనికి ముత్తాత. ఇతని కుమారుడైన ధనుంజయుడికి పుణ్యకుమారుడు మనుమడు. ఇతడు పల్లవ రాజులకు సామంతుడిగా వచ్చి ఉంటాడని పలువురు పరిశోధకులు పేర్కొన్నారు. ఎందుకంటే, ఇతని బిరుదులలో కొన్ని పల్లవులకు సంబంధించినవి. ఇతని సతీమణి పేరు వసంతపోరి. 'పోరి' అనే మాట చాళుక్య రాకుమార్తెలలో తప్ప ఇంకెక్కడా కనబడదు. పుణ్యకుమారుడు స్వతంత్ర రాజుగా రేనాడులో తన పాలనను కొనసాగించాడు. తన పూర్వీకుడైన కరికాల చోళుడి మాదిరిగా త్రైరాజ్య స్థితిని పొందినట్లు చెప్పుకున్నాడు.[1]

పుణ్యకుమారుడు ఎన్నో శాసనములను వేయించాడు. అందులో అతి ముఖ్యమైన పొట్లదుర్తి మాలెపాడు శాసనాన్ని తర్వాత కాలంలో తెలుగు పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ, నేలటూరి వెంకటరమణయ్య కలిసి సంపాదించారు. రెండు గ్రామాల మధ్య ఈ శాసనం దొరికింది (స.ఆం.సా. 1వ సం. పుట 36-42). ఇది తరిగిపోని కరిగిపోని ప్రాచీన పద సంపద. ఇతని శాసనాలన్నీ ఎర్రరాతి మీదే చెక్కి ఉండడం గమనార్హం.[2][3]

పుణ్యకుమారుడి భార్య వసంత పోరి వేయించిన శాసనంలో చోళ మహారాజు మొ|| ఇతని బిరుదులున్నాయి. ఇతను వేయించిన రామేశ్వర స్తంభ శాసనం ఇంకా శిథిలం కాలేదు.

మూలాలు, వనరులు[మార్చు]

  1. ఆరుద్ర, ఆరుద్ర (2009). సమగ్ర ఆంధ్ర సాహిత్యం. హైదరాబాద్: తెలుగు అకాడమి. Retrieved 11 December 2019.
  2. "తెలుగు సాహిత్య చంద్రికలు- వసుంధర |". sirimalle.com. Retrieved 2020-10-01.
  3. wikisource:te:తెలుగు శాసనాలు/పుణ్యకుమారుని తిప్పలూరి శాసనము

వెలుపలి లంకెలు[మార్చు]