పాటలీపుత్ర
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పాటలీపుత్ర | |
---|---|
ప్రాచీన నగరం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
ప్రాంతం | మగధ |
డివిజన్ | పాట్నా |
జిల్లా | పాట్నా |
Government | |
• Body | పాట్నా మునిసిపల్ కార్పొరేషన్ |
Elevation | 53 మీ (174 అ.) |
బౌద్ధ |
పర్యాటక ప్రాంతాలు |
---|
ప్రముఖ బౌద్ధ స్థలాలు |
లలితగిరి
|
పాటలీ పుత్ర - Pāṭaliputra, నేటి పాట్నా నగరానికి ఆనుకొని వున్న ప్రాచీన నగరమే ఈ పాటలీ పుత్ర. మగధ సామ్రాజ్యపు రాజైన అజాతశత్రు ఈ నగరాన్ని క్రీ.పూ. 490 లో ఒక చిన్న కోట "పాటలీగ్రామ" అనే పేరుతో నిర్మించాడు. ఈ నగరం గంగా నది తీరములో ఉంది.[1] నవీన పాట్నా సమీపంలో విస్తృతంగా పురావస్తు పరిశోధనా త్రవ్వకాలు జరిగాయి. పాట్నా చుట్టుపక్కల 20 వ శతాబ్దంలో త్రవ్వకాల ప్రారంభంతో పటిష్ఠమైన చెక్క పటకాల సహా పెద్ద కోట గోడలున్నట్టు స్పష్టమైన ఆధారాలు లభించాయి.
చరిత్ర
[మార్చు]ఉత్తర మధ్య భారతదేశంలో కేంద్ర స్థానంగా ఉన్న దీనిని పరిపాలనా రాజధానిగా నందాలు, మౌర్యులు, సుంగలు, గుప్తాలు వరుస రాజవంశ పాలకులుగా పాలించారు. గంగా, గంధక, పుత్ర నదుల సంగమం వద్ద గల పాటలీపుత్ర రూపం "నీటికోట లేక జలదుర్గం". దీని స్థానం మగధ యొక్క ప్రారంభ సామ్రాజ్య కాలంలో ఇండో గంగా మైదానాల నదీ వాణిజ్య ఆధిపత్యానికి సహాయపడ్డాయి. ఇది వర్గక, వాణిజ్యాలకు గొప్ప కేంద్రంగా ఉండేది, భారతదేశ నలుమూలల నుండి ప్రఖ్యాత చాణక్యుడు వంటి వ్యాపారులను, మేధావులను ఆకర్షించింది. రెండు ముఖ్యమైన ప్రారంభ భౌద్ధుల సమాఖ్యలు ఇక్కడ జరిగాయి, బుద్ధుని మరణ సమయంలో జరిగినది మొదటిది కాగా, రెండవది అశోకుని పాలన సమయంలో జరిగింది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Kulke, Hermann; Rothermund, Dietmar (2004), A History of India, 4th edition. Routledge, Pp. xii, 448, ISBN 0-415-32920-5.