విజయాదిత్యుడు
స్వరూపం
విజయాదిత్యుడు (సా.శ 696 - 733) చాళుక్య వంశానికి చెందిన రాజు. ఇతను తండ్రి వినయాదిత్యుని తర్వాత చాళుక్య సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతని దీర్ఘమైన పరిపాలనా కాలంలో రాజ్యం శాంతి, సౌఖ్యాలతో విలసిల్లింది. విజయాదిత్యుడు పలు దేవాలయాలు నిర్మింపజేశాడు. ఇతను పల్లవులతో యుద్ధం చేసి రెండవ పరమేశ్వరవర్మ దగ్గర కప్పం వసూలు చేశాడు. దక్షిణ కెనరాను పాలించిన విజయాదిత్యుని బావ, అళుప వంశానికి చెందిన అళుప చిత్రవాహనుడు చాళుక్యులకు అనుయాయులుగా ఉండేవారు. వీరు సా.శ 705 లో మంగుళూరుపై పాండ్య రాజుల దాడిని అడ్డుకున్నారు. విజయాదిత్యుని తర్వాత 733 లో అతని కుమారుడు రెండవ విక్రమాదిత్యుడు గద్దె నెక్కాడు. విజయాదిత్యుడు 18 ఏళ్ళ పాటు రాజ్యపాలన చేశాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ Nath sen, Sailendra (1999). Ancient Indian History and Civilization. Routledge. p. 395.
ఆధార గ్రంథాలు
[మార్చు]- Dr. Suryanath U. Kamat (2001). Concise History of Karnataka, MCC, Bangalore (Reprinted 2002).
- Nilakanta Sastri, K.A. (1935). The CōĻas, University of Madras, Madras (Reprinted 1984).
- Nilakanta Sastri, K.A. (1955). A History of South India, OUP, New Delhi (Reprinted 2002).
- Singh, Ram Bhushan Prasad (2008) [1975], Jainism in Early Medieval Karnataka, Motilal Banarsidass, ISBN 978-81-208-3323-4