Jump to content

తెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగం

వికీపీడియా నుండి
(తెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగము నుండి దారిమార్పు చెందింది)
తిక్కనసోమయాజి చిత్రపటం

తెలుగు సాహిత్యం

దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజన
నన్నయకు ముందు సా.శ. 1000 వరకు
నన్నయ యుగం 1000 - 1100
శివకవి యుగం 1100 - 1225
తిక్కన యుగం 1225 - 1320
ఎఱ్ఱన యుగం 1320 – 1400
శ్రీనాధ యుగం 1400 - 1500
రాయల యుగం 1500 - 1600
దాక్షిణాత్య యుగం 1600 - 1775
క్షీణ యుగం 1775 - 1875
ఆధునిక యుగం 1875 – 2000
21వ శతాబ్ది 2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యంతెలుగు నవల
తెలుగు కథతెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యంశతక సాహిత్యం
తెలుగు నాటకంపురాణ సాహిత్యం
తెలుగు పత్రికలుపద కవితా సాహిత్యము
అవధానంతెలుగు వెలుగు
తెలుగు నిఘంటువుతెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలుతెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధనఅధికార భాషగా తెలుగు

తెలుగు సాహిత్యంలో 1320 నుండి 1400 వరకు ఎఱ్ఱన యుగము అంటారు. ఈ యుగoలో ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డాయి. మహాభారతంలో అరణ్యపర్వశేషం తెలుగుచేయబడింది. నన్నయ తిక్కనాదుల కాలములో చెల్లిన గ్రాంధిక, పౌరాణిక భాష ఈ యుగంలో ఆధునికతను సంతరించుకోసాగింది.

తిక్కన మరణానికి సుమారు 10 సంవత్సరాలముందు (1280 ప్రాంతంలో) ఎఱ్ఱన జన్మించి ఉంటాడు. ఎఱ్ఱన మరణం 1360లో జరిగిఉండవచ్చును. 1365-1385 ప్రాంతంలో జన్మించిన శ్రీనాథుడు తరువాతి యుగకవిగా భావింపబడుతున్నాడు.

ఎఱ్ఱన పేరుమీద ఒక యుగం అవుసరమా? ఆ కాలాన్ని తిక్కన, శ్రీనాథ యుగాలలో కలుపకూడదా? అన్న సందేహానికి పింగళి లక్ష్మీకాంతం తెలిపిన అభిప్రాయం ఇది - "తిక్కన అనంతరం, శ్రీనాథునికి ముందు ఎఱ్ఱన, నాచన సోమన, భాస్కరుడు వంటి మేటికవులవతరించారు. అంతేగాక తెలుగు సారస్వతానికి త్రిమూర్తులైన కవిత్రయం తరువాతనే ఎంతటివారైనా పేర్కొనదగినవారౌతారు. ఆ మువ్వురును ఆంధ్ర కవి ప్రపంచానికి గురుస్థానీయులు. కనుక ఆ మువ్వురిపేరు మీద మూడు యుగాలుండడం ఉచితం. అంతేగాక ఆంధ్ర వాఙ్మయంలో ఆఖ్యాన పద్ధతిని నన్నయ, నాటకీయ పద్ధతిని తిక్కన ప్రారంభించినట్లే వర్ణనాత్మక విధానానికి ఎఱ్ఱన ఆద్యుడు. నన్నయ యొక్క శబ్దగతిని, తిక్కన యొక్క భావగతిని అనుసంధించి క్రొత్త శైలిని కూర్చిన మహానుభావుడు ఎఱ్ఱన. తెలుగుభాష పలుకుబడి, వాక్యనిర్మాణము ఈ కాలంలో ఆధునికతను సంతరించుకొన్నాయి. శ్రీనాథునివంటి అనంతరీకులు ముందుగా ఈ శైలినే అలవరచుకొని రచనలు సాగించారు. కనుక ఎఱ్ఱనను యుగకర్తగా సంభావించుట ఉచితం."[1]

రాజకీయ, సామాజిక నేపథ్యం

[మార్చు]

1323లో ఢిల్లీ సుల్తాను చేత పరాజితుడై ప్రతాపరుద్రుడు మరణించడంతో కాకతీయ సామ్రాజ్యం అంతమైంది. అయితే కాకతీయులకు విధేయులైన నాయకులు తిరిగి ఢిల్లీ సులతాను సేనలను ఓడించి ఆంధ్రాపధాన్ని హస్తగతం చేసుకోగలిగారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలలో ఆంధ్రదేశం చిన్న చిన్న భాగాలుగా నాయకుల పాలనలోకి వచ్చింది. కృష్ణానదికు ఉత్తరాన ముసునూరు నాయకులు, రేచెర్ల వెలమ నాయకులు, కృష్ణకు దక్షిణాన రెడ్డి రాజులు రాజ్యం చేశారు. అనంతరం బీజాపూరు బహమనీ రాజులతో జరిగిన యుద్ధంలో కాపయ నాయకుడు మరణించాడు. అద్దంకి రాజధానిగా ఉన్న ప్రోలయ వేమారెడ్డి 1325-1353 మధ్యకాలంలో రాజ్యం చేశాడు. అతని ఆస్థాన కవియే ఎఱ్ఱాప్రగడ.

ఈ యుగంలో భాష లక్షణాలు

[మార్చు]

ఈ యుగంలో తెలుగు లిపి

[మార్చు]

ముఖ్య కవులు, రచనలు

[మార్చు]

యుగకర్తయైన ఎఱ్ఱాప్రగడ హరివంశమును, భారత అరణ్య పర్వ శేషమును, నృసింహ పురాణమును వ్రాసాడు. రామాయణం కూడా వ్రాశాడు కాని అది లభించడంలేదు. భాస్కరుడు భాస్కర రామాయణమును, నాచన సోన ఉత్తర హరివంశమును వ్రాసారు. రావిపాటి త్రిపురాంతకుడు వ్రాసిన రచనలలో "త్రిపురాంతకోదాహరణము" మాత్రం లభిస్తున్నది. చిమ్మపూడి అమరేశ్వరుడనే మహాకవి "విక్రమసేనము" అనే మహాగ్రంధాన్ని వ్రాశాడట గాని అది లభించడంలేదు.

ముఖ్య పోషకులు

[మార్చు]

ఇతరాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం

వనరులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]