ఉజ్జిని యాదగిరిరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉజ్జిని యాదగిరిరావు

ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు
పదవీ కాలం
2009-2014
ముందు పల్లా వెంకట్ రెడ్డి
తరువాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
నియోజకవర్గం మునుగోడు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1956
గడియగౌరారం, చింతపల్లి మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత కమ్యునిస్టు పార్టీ
తల్లిదండ్రులు ఉజ్జిని నారాయణరావు (తండ్రి)[1]
జీవిత భాగస్వామి వి. పద్మ
నివాసం హైదరాబాదు, తెలంగాణ

ఉజ్జిని యాదగిరిరావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. భారత కమ్యునిస్టు పార్టీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు. సీపీఐ పార్టీ తరఫున నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుంచి 2009-2014 వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[2][3]

జననం[మార్చు]

యాదిగిరిరావు 1956లో తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, చింతపల్లి మండలంలోని గడియగౌరారం గ్రామంలో జన్మించాడు.[4] ఇతని తండ్రి ఉజ్జిని నారాయణరావు, మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుంచి 1985-99 కాలంలో సీపీఐ పార్టీ తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[5][6]

రాజకీయ జీవితం[మార్చు]

తన తండ్రి నుండి రాజకీయ వారసత్వాన్ని అందుకున్న యాదగిరిరావు, సీపీఐ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నాడు. ముఖ్యనేతగా ఎదిగాడు. 2009లో జరిగిన ఎన్నికల్లో  సీపీఐ, టీడీపీ, సీపీఎం, టీఆర్ఎస్ లు కూటమిగా ఏర్పడడంతో, సీపీఐ పార్టీ అభ్యర్థిగా యాదగిరిరావు పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్ రెడ్డిపై 3,594 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[7]

ఎన్నిక వివరాలు[మార్చు]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు ఓట్లు ప్రత్యర్థి పేరు ఓట్లు
2009 93 మునుగోడు జనరల్ ఉజ్జిని యాదగిరిరావు 57383 పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 53789

మూలాలు[మార్చు]

  1. Eenadu (28 November 2023). "ఆ తండ్రీ కొడుకులు.. మునుగోడు ఎమ్మెల్యేలు". Archived from the original on 28 November 2023. Retrieved 28 November 2023.
  2. "IndiaVotes AC Summary: Munugode 2009". IndiaVotes. Archived from the original on 2020-11-11. Retrieved 2022-04-13.
  3. "Munugode Assembly Constituency". www.onefivenine.com. Archived from the original on 2020-06-30. Retrieved 2022-04-13.
  4. "Vujjini Yadagiri Rao Affidavits (2009)" (PDF). Archived from the original on 2022-04-13. Retrieved 2022-04-13.
  5. Sakshi (13 July 2016). "మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు". www.sakshi.com. Archived from the original on 21 July 2021. Retrieved 2022-04-13.
  6. India, The Hans (2016-07-14). "CPI ex-MLA Narayana Rao". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2016-07-17. Retrieved 2022-04-13.
  7. narsimha.lode (2018-11-29). "కారణమిదే: ఆ స్థానంలో ఇంతవరకు టీడీపీ గెలవలేదు". Asianet News Network Pvt Ltd. Archived from the original on 2022-04-13. Retrieved 2022-04-13.

ఇతర లింకులు[మార్చు]