ఆలంపూర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామం కొరకు అలంపురం చూడండి.

ఆలంపూర్
ఆలంపూర్ దేవాలయాలు
ఆలంపూర్ దేవాలయాలు
ఆలంపూర్ is located in తెలంగాణ
ఆలంపూర్
తెలంగాణ రాష్టంలో ప్రాంతం
భౌగోళికాంశాలు : 15°52′38″N 78°08′07″E / 15.877139°N 78.135252°E / 15.877139; 78.135252Coordinates: 15°52′38″N 78°08′07″E / 15.877139°N 78.135252°E / 15.877139; 78.135252
పేరు
ఇతర పేర్లు: దక్షిణ కాశీ
హలంపురం
హటాంపురం
ప్రధాన పేరు : ఆలంపురం
ప్రదేశము
దేశము: భారత దేశము
రాష్ట్రం: తెలంగాణ
జిల్లా: మహబూబ్ నగర్
ప్రదేశము: ఆలంపూర్
ఆలయం యొక్క వివరాలు
ప్రధాన దైవం: శివుడు
ముఖ్య_ఉత్సవాలు: శివరాత్రి
నిర్మాణ శైలి మరియు సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య: 9
ఇతిహాసం
నిర్మాణ తేదీ: క్రీస్తు శకం 702
సృష్టికర్త: బాదామి చాళుక్యులు
ఆలంపూర్
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో ఆలంపూర్ మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో ఆలంపూర్ మండలం యొక్క స్థానము
ఆలంపూర్ is located in Telangana
ఆలంపూర్
తెలంగాణ పటములో ఆలంపూర్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°52′38″N 78°08′07″E / 15.877139°N 78.135252°E / 15.877139; 78.135252
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము ఆలంపూర్
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 41,220
 - పురుషులు 20,970
 - స్త్రీలు 20,250
అక్షరాస్యత (2001)
 - మొత్తం 51.61%
 - పురుషులు 64.40%
 - స్త్రీలు 38.54%
పిన్ కోడ్ 509152

అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశిగా అభివర్ణిస్తూ ఉంటారు. ఈ ప్రాంతం తెలంగాణాలో చేరి ఉన్న అలంపురం. అలనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకు 27 కిలో మీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌నగర్‌కి 90 కిలోమీటర్ల దూరంలోనూ, హైదరాబాద్‌కి 200 కిలో మీటర్ల దూరంలోనూ నెలకొని ఉన్న అలంపురం అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవది. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో బాదామీ చాళుక్యులు ఈ ఆలయాలను నిర్మించారు. అలంపురం చుట్టూ నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి. తుంగభద్ర నది ఎడమ గట్టున అలంపురం ఆలయం ఉంది. శాతవాహన, బాదామీ చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధిపతులు, గోల్కొండకి చెందిన కుతుబ్‌ షాహీ ల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. అలంపురాన్ని పూర్వం హలంపురంగానూ, హటాంపురంగానూ వ్యవహరించేవారని క్రీస్తు శకం 1101 సంవత్సరం నాటి శాసనం తెలియజేస్తోంది. ఈ శాసనం పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్య-4 కాలం నాటిది. జోగులాంబ, బ్రహ్మేశ్వరస్వామి వార్ల ఆలయాలు చారిత్రక ప్రసిద్ధి చెందినవి.

ఆలంపూర్, మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక గ్రామము, మరియు అదే పేరుతోగల ఒక మండలానికి కేంద్రం. పిన్ కోడ్: 509152. ఇది ఒక చారిత్రక ప్రాధాన్యం గల ప్రదేశం. ఇక్కడ ఏడవ శతాబ్దానికి చెందిన ప్రాచీన నవబ్రహ్మ ఆలయం ఉంది. భారతదేశంలోని 18 శక్తిపీఠాలలో ఇది ఒకటి.[1] ఇది హైదరాబాదు నకు సుమారుగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా భావింపబడింది. (సిద్ధవటం, త్రిపురాంతకం, ఉమామహేశ్వరంలు దక్షిణ, తూర్పు, ఉత్తర ద్వారాలుగా భావింపబడినాయి). తుంగభద్ర, కృష్ణా నదులు అలంపూర్ కు దగ్గరలో కలుస్తాయి. ఇక్కడి తొమ్మిది నవ బ్రహ్మ దేవాలయములు కూడా శివాలయాలే! అక్టోబరు 2, 2009న తుంగభద్ర నది ఉప్పొంగడంతో ఆలంపూర్ గ్రామం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అధికారులు గ్రామం మొత్తం ఖాళీచేయించారు.

అలంపూర్ ఆలయాలు[మార్చు]

నవబ్రహ్మ ఆలయాలు[మార్చు]

నవబ్రహ్మ దేవాలయములు బాదామి చాళుక్యులు నిర్మించారు. వీరు సుమారుగా ఆరవ శతాబ్ద మధ్య కాలం నుండి రెండువందల సంవత్సరములు పాలించారు. ఈ బాదామి చాళుక్యులు కర్ణాటక, తెలంగాణ లలో చాలా దేవాలయములు నిర్మించారు. ఇక్కడి కొన్ని శిల్పాలను దగ్గరలోని సంగ్రహాలయంలో ఉంచారు. తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ అనునవి ఆ తొమ్మిది దేవాలయములు. ఇవి అన్నీ కూడా తుంగభద్రానది ఒడ్డున ఉన్నాయి. వీటిలో బాల బ్రహ్మేశ్వరాలయం పెద్దది, ఇక్కడి శాసనాల ఆధారంగా దీనిని క్రీస్తు శకం 702 కాలం నాటిదిగా గుర్తించారు. ఇక్కడ శివరాత్రి పండుగను ఘనంగా చేస్తారు.

  • తారక బ్రహ్మ దేవాలయం పాక్షికంగా శిథిలాలలో ఉంది. దీని గర్భగుడిలో ఎటువంటి విగ్రహంకూడా లేదు! దీనియందు ఆరు, ఏడవ శతాబ్దాలకు చెందిన తెలుగు శాసనాలు ఉన్నాయి.
  • స్వర్గ బ్రహ్మ దేవాలయం అలంపూర్ లోని దేవాయలములలో సుందరమైనదిగా చెప్పబడుతున్నది. ఇది చాళుక్య ప్రభువుల నిర్మాణ కౌశల్యానికి ఓ మచ్చుతునక. ఇందులో ఎనిమిదవ శతాబ్దానికి చెందిన చాలా శాసనాలు ఉన్నాయి.
  • పద్మ బ్రహ్మ దేవాలయం. ఇది కూడా పాక్షికంగా శిథిలమైపోయినది, ఇందులో ఓ అద్భుతమైన స్పటిక శివలింగం ఉంది.
  • విశ్వబ్రహ్మ దేవాలయం చాలా మంచి చూడ చక్కని నిర్మాణం, ఇక్కడ రామాయణ మహాభారతాలనుండి దృశ్యాలను శిల్పాలపై మహాకావ్యాలుగా చెక్కినారు.
  • బాల బ్రహ్మేశ్వరాలయం నవ బ్రహ్మ ఆలయాలలో ముఖ్యమైనది. జోగులాంబాలయం పునర్నిర్మాణం జరిగే వరకు ఇక్కడ ప్రధానార్చకాలయం ఇదే. జోగులాంబ పూర్వపు గుడి విధ్వంసం జరిగాకా, కొత్త ఆలయం నిర్మించేదాకా ఈ స్వామి ఆలయంలోనే పూజలందుకున్నది. ఈ దేవాలయం చుట్టూ బహిఃప్రదిక్షణాపథాన్ని, ప్రాకారాన్ని, ముఖమంటపాన్ని చాళుక్య విజయాదిత్యుడు కట్టించినట్లు తెలుస్తుంది. ఈ నిర్మాణాలలో శిల్పి ఈశాన్యాచారుడి కృషి చెప్పుకోదగినదని అంటారు.

జోగులాంబ ఆలయం[మార్చు]

జోగులాంబ ఆలయం అలంపురంలో ఆగ్నేయదిశగా నెలకొని ఉంది. జోగులాంబ ఆలయాన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు ధ్వంసం చేయగా, జోగులాంబ, చండి, ముండి విగ్రహాలను బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో భద్రపర్చారు. కొద్ది సంవత్సరాల క్రితం జోగులాంబ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన (ఐదవ శక్తిపీఠం) జోగుళాంబ ఆలయం ఉంది. అమ్మవారిపై దవడ పంటితో ఇక్కడ పడినట్టు పురాణకథనం. జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన, అలంపురం స్థితమాత, సర్వార్థ ఫల సిద్ధిద అని జోగులాంబ దేవిని ప్రార్థిస్తారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ, ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. 2008 లో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని అక్కడకు తరలించారు. బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూసేవారు.

  • 9 వ శతాబ్దానికి చెందిన సూర్యనారాయణస్వామి దేవాలయం కూడా ఇదే ప్రాంగణంలో ఉంది. ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ విజయనగర రాజు అయిన కృష్ణదేవరాయలకు చెందిన ఒక నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. అలంపూర్ దగ్గరలో పాపనాశనం అను ఇరవైకి పైబడిన శివాలయములు వివిధ ఆకారం, పరిమాణాలలో ఉన్నాయి. ఇందులో పాపనాశేశ్వర దేవాలయం ప్రధానమైనది.
  • శక్తిపీఠాన్ని సందర్శించడానికి వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు.

సంగమేశ్వరాలయం[మార్చు]

అలంపూర్‌కు ఈశాన్యంలో కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రాంతంలో కూడవెల్లి అను గ్రామం ఉండేది. ఇక్కడే సంగమేశ్వరాలయం ఉండేది. ఈ గ్రామం, ఆలయం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వలన ముంపుకు గురయ్యాయి. ఈ గ్రామంలోని ప్రజలు సమీప గ్రామాలలో పునరావాసాన్ని ఏర్పాటు చేసుకోగా, ఇక్కడి సంగమేశ్వరాలయాన్ని తరలించి అలంపూర్‌లో పునర్నిర్మించారు. గ్రామంలో జూనియర్ కళాశాలకు సమీపంలో ఈ ఆలయాన్ని పునఃనిర్మించారు. ఈ ఆలయ శిల్పసంపద ఆకట్టుకుంటుంది. ఈ దేవాలయం కూడా చాళుక్యుల నిర్మాణ శైలిలోనిదే. శివరాత్రి పర్వదినాన ఇక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విశాలమైన తోటలో ఆలయం అలరారుతుంది.

పాపనాశనం[మార్చు]

అలంపురం సమీపంలోని పాపనాశంలో ఇరవై దేవాలయాలు ఒకేచోట ఉండటం వల్ల అలంపురం ఆలయాల పట్టణంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఏడవ శతాబ్ది నుంచి 17వ శతాబ్ది వరకూ దక్షిణాపథాన్ని పరిపాలించిన రాజవంశీయుల శాసనాలు ఇక్కడ ఉన్నాయి. ప్రాచీన శిల్పకళకు కాణాచి అయిన ఈ ఆలయం అడుగడుగునా విజ్ఞాన విశేషాలకు ఆలవాలంగా ఉంది. వైదిక మతానికి చెందిన ఆలయాలు, జైన, బౌద్ధుల కాలం నాటి శిల్పనిర్మాణాలు ఇక్కడ ఎన్నో దర్శనమిస్తాయి.

ఆలయం తోటను ఆనుకుని ఉన్న ప్రదేశంలో ఇటీవల త్రవ్వకాలు జరపగా, శాతవాహనుల కాలం నాటి నాణాలు, పూసలు, శంఖాలు, పాత ఇటుకలు, మట్టి పాత్రలు బయటపడ్డాయి. ఈ ఆలయం మహాద్వారాన్ని రాష్ట్ర కూటుల హయాంలో నిర్మించినట్టు చారిత్రక కథనం. కాకతీయుల కాలంలో ఇక్కడ మండపాలను నిర్మించారు. శ్రీకృష్ణ దేవరాయులు రాయచూర్‌ నుంచి ఈ ఆలయానికి వచ్చి కొన్ని దానాలు చేసినట్టు కూడా చారిత్రక కథనం. గతంలో ఇక్కడ ప్రసిద్ధమైన విద్యాపీఠం ఉండేదనీ, మహావిద్వాంసులు ఎంతో మంది ఉండేవారని కూడా చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి.

ఆలంపూర్ పురావస్తు ప్రదర్శనశాల[మార్చు]

ఆలంపూర్ జోగుళాంబ దేవాలయ సమీపంలో పురావస్తు ప్రదర్శనశాల ఉంది. దీనిని 1952లో ఏర్పాటుచేశారు. ఇందులో క్రీ.శ.6 వ శతాబ్దము నుంచి క్రీ.శ.12వ శతాబ్దము వరకు కాలానికి సంబంధించిన పురాతన, చారిత్రక శిల్పాలు భద్రపర్చబడ్డాయి. ఉదయం గం.10.30 నుంచి సాయంత్రం గం.5.00 వరకు దీనిని సందర్శకులకై తెరిచి ఉంచుతారు. దేవాలయానికి వచ్చే యాత్రికులు దీనిని కూడా సందర్శిస్తారు.

రక్షణ గోడ[మార్చు]

అలంపూర్ పట్టణానికి చుట్టూ అన్ని వైపులా రక్షణ గోడ ఉంది. నిజానికి శ్రీశైలం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలలో అలంపూర్ కూడా ఒకటి. కాని ముంపుకు గురై పట్టణాన్ని వేరేచోట నిర్మిస్తే, పట్టణంలోని ఆలయాలు పాడై, పునర్నిర్మాణ అసాధ్యమై, వాటి ప్రాభవాన్ని కోల్పోతాయని భావించి, అది ఊరికి అరిష్టంగా తలచి, అప్పటి ఆలయ ధర్మకర్త, ప్రముఖ కవి, చారిత్రక పరిశోధకులు గడియారం రామకృష్ణ శర్మ గారు ఊరి పెద్దలను ఒప్పించి, గ్రామ పున నిర్మాణానికి దక్కే నష్టపరిహారపు సొమ్మును వినియోగించి పట్టణం చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటుచేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించి, నిర్మించారు. ఈ రక్షణ వలయం ఊరి చుట్టూ ఉన్నప్పటికి పశ్చిమం వైపు ఎత్తు తక్కువగానూ, తూర్పు వైపు నది ఉండటం వలన అత్యంత ఎత్తులోనూ ఉండి, కోటగోడను తలపిస్తుంది, వర్షా కాలంలో నది జోరుగా ప్రవహించినా ఈ నిర్మాణం వలన నీరు పట్టణంలోకి రాదు. పట్టణంలోని మురికి నీరంతా ఊరి మధ్యలోని జోగులాంబ వాగులోకి చేరుతుంది. ఈ నీరు తుంగభద్ర వైపు వెలుతుంది. అయితే రక్షణ గోడ అడ్డు ఉండటం వలన నీటిని మోటారులతో ఎత్తి నదిలోకి చేరుస్తుంటారు.

అక్టోబరు 2009 వరదలు[మార్చు]

అక్టోబరు 2, 2009 న తుంగభద్ర నది ఉప్పొంగడంతో ఆలంపూర్ గ్రామం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.[2] అధికారులు గ్రామం మొత్తం ఖాళీచేయించారు. తుంగభద్ర నది ఒడ్డున నిర్మించిన రక్షణ గోడపై నుంచి నీరు ప్రవహించడంతో వరదనీరు గ్రామంలోనికి ప్రవేశించి గ్రామస్థులందరినీ నిరాశ్రయులుగా చేసింది. పురాతన ఆలయాలు అన్నీ నీటమునిగాయి.

ప్రయాణ వసతులు[మార్చు]

అలంపురానికి హైదారాబాదు, కర్నూలు, మహబూబ్‌ నగర్‌ ల నుంచి బస్సు సర్వీసులు ఉన్నాయి.

మాంటిస్సోరి విద్యాలయం[మార్చు]

మాంటిస్సోరి విద్యాలయం జిల్లాలోనే అతి పెద్ద గురుకుల విద్యాలయం.

మండలగణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 41,220 - పురుషుల సంఖ్య 20,970 - స్త్రీల సంఖ్య 20,250
అక్షరాస్యత (2001) - మొత్తం 51.61% - పురుషుల సంఖ్య 64.40% - స్త్రీల సంఖ్య 38.54%
మండల కేంద్రము ఆలంపూర్గ్రా.........మాలు 20

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 245
  2. ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009


"https://te.wikipedia.org/w/index.php?title=ఆలంపూర్&oldid=2053107" నుండి వెలికితీశారు