అలంపూర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అలంపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]

అలంపూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్ జిల్లా, అలంపూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్ జిల్లా, అలంపూర్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 15°52′38″N 78°08′07″E / 15.877139°N 78.135252°E / 15.877139; 78.135252
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రం అలంపూర్
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2001)
 - మొత్తం 51.61%
 - పురుషులు 64.40%
 - స్త్రీలు 38.54%
పిన్‌కోడ్ 509152

ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం గద్వాల రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

మండల జనాభా[మార్చు]

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 41,220 - పురుషుల సంఖ్య 20,970 - స్త్రీల సంఖ్య 20,250, అక్షరాస్యత మొత్తం 51.61% - పురుషుల సంఖ్య 64.40% - స్త్రీల సంఖ్య 38.54%,మండల కేంద్రం:ఆలంపూర్, మండలంలోని రెవెన్యూ గ్రామాలు:15

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవిన్యూ గ్రామాలు[మార్చు]

 1. అలంపూర్
 2. బైరంపల్లి
 3. ఇమాంపూర్
 4. కాశీపూర్
 5. బుక్కాపూర్
 6. కోనేరు
 7. సింగవరం
 8. గొందిమళ్ళ
 9. ఊట్కూర్
 10. భీమవరం
 11. లింగనవాయి
 12. క్యాతూర్
 13. ర్యాలంపాడు
 14. సుల్తాన్‌పూర్
 15. జిల్లెళ్ళపాడు

నిర్జన గ్రామాలు[మార్చు]

 • కూడవెల్లి :ఈ గ్రామం ఇప్పుడు పూర్తిగా అంతర్ధానమైపోయింది. ఒకప్పుడు కృష్ణ, తుంగభద్రల సంగమ ప్రాంత సమీపాన ఈ గ్రామం ఉండేది. ఈ గ్రామానికి సమీపంలో గొందిమళ్ళ, ఉప్పలపాడు గ్రామాలు ఉండేవి.శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వలన ఈ గ్రామం, దాని శివారు భూములు పూర్తిగా ప్రాజెక్టు జలాల్లో మునిగిపోవడం వలన గ్రామం పునర్నిర్మాణానికి నోచుకోలేదు. ఈ గ్రామానికి చెందిన ప్రజలు సమీప ప్రాంతాలైన అలంపూర్, గొందిమళ్ళ, బుక్కాపూర్ మొదలగు ప్రాంతాలలో స్థిరపడ్డారు.
 • ఉప్పలపాడు (అలంపూర్ మండలం) :ఈ గ్రామం ఇప్పుడు పూర్తిగా అంతర్ధానమైపోయింది.

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
 2. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు[మార్చు]