రాజోలి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజోలి
—  మండలం  —
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, రాజోలి స్థానాలు
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, రాజోలి స్థానాలు
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, రాజోలి స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జోగులాంబ జిల్లా
మండల కేంద్రం రాజోలి (జోగులాంబ గద్వాల జిల్లా)
గ్రామాలు 11
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 128 km² (49.4 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 35,451
 - పురుషులు 18,063
 - స్త్రీలు 17,388.
పిన్‌కోడ్ {{{pincode}}}


రాజోలి మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.

ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 30 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలం కర్నూలు జిల్లా సరిహద్దులో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[1] ఇందులో 11 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం రాజోలి.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 128 చ.కి.మీ. కాగా, జనాభా 35,451. జనాభాలో పురుషులు 18,063 కాగా, స్త్రీల సంఖ్య 17,388. మండలంలో 8,210 గృహాలున్నాయి.[3]

2016 లో ఏర్పడిన మండలం[మార్చు]

లోగడ రాజోలి గ్రామం లోగడ మహబూబ్ నగర్ జిల్లా, గద్వాల రెవెన్యూ డివిజను పరిధిలోని వడ్డేపల్లి మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా రాజోలి గ్రామాన్ని (1+10) పదకొండు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా జోగులాంబ గద్వాల జిల్లా,గద్వాల రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. పడమటి గార్లపాడు
  2. రాజోలి
  3. తూర్పు గార్లపాడు
  4. తుమ్మిళ్ళ
  5. మాన్‌దొడ్డి
  6. ముండ్లదిన్నె
  7. పెద్ద తాండ్రపాడు
  8. పచ్చర్ల
  9. నస్నూర్
  10. చిన్న ధన్వాడ
  11. పెద్ద ధన్వాడ

మూలాలు[మార్చు]

  1. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  2. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 244 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]