ఉండవెల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉండవెల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]

ఉండవెల్లి
—  మండలం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జోగులాంబ గద్వాల
మండలం ఉండవెల్లి
ప్రభుత్వం
 - మండలాధ్యక్షులు
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గతంలోమానోపాడ్ మండలానికి చెందిన గ్రామంగా ఉండేది.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] ఇందులో 15 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం గద్వాల రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. తెలంగాణలో నూతన జిల్లాలు ఏర్పాటుచేసిన సందర్భంలో ఈ గ్రామాన్ని ఇదే పేరుతో ప్రకటించబడిన నూతన మండలానికి కేంద్రంగా ప్రకటించారు[4].ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 19 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 15   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ ఉండవెల్లి గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, గద్వాల రెవిన్యూ డివిజను పరిధిలోని మానోపాడ్ మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా ఉండవెల్లి గ్రామాన్ని (1+14) పదిహేను గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా జోగులాంబ గద్వాల జిల్లా,గద్వాల రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[5]

మండలం ఉనికి[మార్చు]

ఉండవెల్లి మండలానికి తూర్పున అలంపూర్ మండలం, దక్షిణాన తుంగభద్రా నది ఉత్తరాన కృష్ణానది, పశ్చిమాన మానోపాడ్,వడ్డేపల్లి మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1332 ఇళ్లతో, 5740 జనాభాతో 1981 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2967, ఆడవారి సంఖ్య 2773. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1660 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 11. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576417[6].

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. ఉండవెల్లి
 2. ఎ.బుర్దిపాడ్
 3. చిన్న ఆముద్యాలపాడు
 4. కంచుపాడు
 5. పుల్లూర్
 6. కలగొట్ల
 7. మెన్నిపాడు
 8. బొంకూర్
 9. ఇటిక్యాలపాడు
 10. మారమునగాల
 11. సేరిపల్లి
 12. ప్రాగటూర్
 13. తక్కశిల
 14. భైరాపూర్
 15. బస్వాపూర్

మండలంలోని రైల్వే స్టేషన్లు[మార్చు]

మండలంలోని ప్రసిద్ధ దేవాలయాలు[మార్చు]

మండలంలో ఉన్నత పాఠశాలలు ఉన్న గ్రామాలు[మార్చు]

మండల రక్షక భట నిలయాలు[మార్చు]

మండలానికి చెందిన ప్రముఖులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
 2. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
 3. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
 4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-06-19. Retrieved 2017-06-21.
 5. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 244 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 6. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు[మార్చు]