అక్షాంశ రేఖాంశాలు: 15°57′50″N 77°56′28″E / 15.96397°N 77.941039°E / 15.96397; 77.941039

మనోపాడ్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మనోపాడ్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]

మానవపాడ్
—  మండలం  —
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, మానవపాడ్ స్థానాలు
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, మానవపాడ్ స్థానాలు
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, మానవపాడ్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 15°57′50″N 77°56′28″E / 15.96397°N 77.941039°E / 15.96397; 77.941039
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జోగులాంబ జిల్లా
మండల కేంద్రం మనోపాడ్
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 170 km² (65.6 sq mi)
జనాభా (201)
 - మొత్తం 51,543
 - పురుషులు 28,132
 - స్త్రీలు 25,411
అక్షరాస్యత (201)
 - మొత్తం 47.46%
 - పురుషులు 60.65%
 - స్త్రీలు 33.81%
పిన్‌కోడ్ 509128

ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 28 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.ఇది అలంపూర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉంది. మండల కేంద్రం మానవపాడ్.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1063 ఇళ్లతో, 5013 జనాభాతో 1754 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2547, ఆడవారి సంఖ్య 2466. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1283 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 33. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576405.[3]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 170 చ.కి.మీ. కాగా, జనాభా 31,481. జనాభాలో పురుషులు 15,965 కాగా, స్త్రీల సంఖ్య 15,516. మండలంలో 7,335 గృహాలున్నాయి.[4]

సరిహద్దులు

[మార్చు]
సురవరం ప్రతాపరెడ్డి చిత్రపటం

ఈ మండలానికి ఉత్తరాన కృష్ణానది, దక్షిణాన తుంగభద్ర, తూర్పున అలంపూర్ మండలం, పశ్చిమాన ఇటిక్యాల, వడ్డేపల్లి మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

విద్యావకాశాలు

[మార్చు]
జివికె రెడ్డి స్మారక ప్రభుత్వ జూనియర్ కళాశాల, మానోపాడు

ఈ మండలంలో విస్తీర్ణంలోనూ, జనాభా పరంగానూ 4 పెద్ద గ్రామాలు ఉన్నాయి. అవి ఉండవెల్లి, జల్లాపూర్,పుల్లూర్, చెన్నిపాడు. ఈ గ్రామాలన్నిటిలోనూ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.వీటితో పాటు మండల కేంద్రమైన మానోపాడులో ఉన్నత పాఠశాలతో పాటు, ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది. మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తాలోనూ ప్రభుత్వేతర ఉన్నత పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.

మండలం లోని ఆలయాలు

[మార్చు]

మండలంలోని కంచుపాడు గ్రామంలో ప్రసిద్ధి చెందిన జమ్ములమ్మ(ఎల్లమ్మ) ఆలయం ఉంది. మండలంలోని గ్రామ ప్రజలే కాకుండా సమీపంలో ఉన్న ఆలంపూర్, ఇటిక్యాల మండలాలలోని గ్రామ ప్రజలు కూడా ప్రతి మంగళ, శుక్ర వారాలలో పెద్ద ఎత్తున తరలివచ్చి, పూజించి వెళ్తుంటారు.

మండలానికి చెందిన ప్రముఖులు

[మార్చు]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

నిర్జన గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు

[మార్చు]