Jump to content

బోరవెల్లి

వికీపీడియా నుండి

బోరవెల్లి, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, మానవపాడ్ మండలంలోని గ్రామం.[1]

బోరవెల్లి
—  రెవెన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జోగులాంబ
మండలం మనోపాడ్
ప్రభుత్వం
 - సర్పంచి గోపాల్
జనాభా (2011)
 - మొత్తం 3,277
 - పురుషుల సంఖ్య 1,647
 - స్త్రీల సంఖ్య 1,630
 - గృహాల సంఖ్య 772
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన మానోపాడ్ నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కర్నూలు నుండి 28 కి. మీ. దూరంలో హైదరాబాద్ నుండి కర్నూలుకు వెళ్ళు 7 వ నెంబరు (కొత్త సంఖ్య 44వ నెంబరు) జాతీయ రహదారి మార్గంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] రహదారిపై ఎడమవైపు కర్నూలుకు 25 కిలో మీటర్లకు ముందుగానే ఈ గ్రామం స్టేజి వస్తుంది. అక్కడి నుండి ఉత్తరానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 772 ఇళ్లతో, 3277 జనాభాతో 1320 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1647, ఆడవారి సంఖ్య 1630. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 549 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 29. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 576398.[3]

గ్రామ సరిహద్దులు

[మార్చు]

ఈ గ్రామానికి ఉత్తరాన పల్లెపాడు, రాజశ్రీగార్లపాడు గ్రామాలు, దక్షిణాన మానోపాడ్, నారాయణ్‌పూర్ (ఎంజర్లపాడు) గ్రామాలు, తూర్పున జల్లాపూర్ గ్రామం, పశ్చిమాన ధర్మవరం గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి. ప్రధానంగా ఈ గ్రామానికి ఒక కిలో మీటరు దూరంలోనే జల్లాపురం గ్రామం ఉంది. రెండు గ్రామాలు జంటగ్రామాలుగా ఉంటాయి. రెండిటిని వేరు చేస్తూ వర్షాకాలంలో ఓ పెద్ద వాగు ప్రవహిస్తుంటుంది.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఈ గ్రామానికి గొప్ప చారిత్రిక నేపథ్యం ఉంది. గద్వాల సంస్థానానికి ముందే బోరవెల్లి సంస్థానంగా ఓ వెలుగు వెలిగిన గొప్ప ప్రాంతమిది. ఎందరో కవి పండితులను పోషించిన నేల ఇది. ఈ సంస్థానానికి మూల పురుషుడు నల్లారెడ్డి[4]. మిడిమిళ్ళ గోత్రజులు. వీరి ఇలవేల్పు పోల్గంటి సోమేశ్వరుడు. ఇతనికి మల్లాంబ, తిమ్మాంబ అను ఇద్దరు భార్యలు ఉండేవారు. మల్లాంబకు పెద సోమభూపాలుడు, తిమ్మాంబకు చిన సోమభూపాలుడు అను కుమారులు కలిగారు. పెద సోమభూపాలుని భార్య లక్ష్మమ్మ, వీరి కుమారుడు వెంకటపతి. చిన సోమభూపాలుడి భార్య గిరియమ్మ. ఈమె గద్వాల సంస్థానానికి చెందిన ఆడపడుచు. గద్వాల సంస్థానాధిపతి అయిన పెద శోభనాద్రి, ఆయన భార్య లింగమాంబలు గిరియమ్మ తల్లిదండ్రులు. బోరవెల్లి చిన సోమభూపాలుడు, గిరియమ్మ దంపతులకు సంతానం లేకపోవడంచే పెద సోమభూపాలుని కుమారుడైన వేంకటపతిని దత్త పుత్రునిగా తీసుకున్నారు. గిరియమ్మ తన పుట్టినింటివారిలాగే ఎందరో కవిపండితులను పోషించి మంచి కవిపోషకులుగా పేరు సంపాదించారు. వేంకటపతి కూడా తల్లికి తగ్గ కుమారుడిగానే కవులను పోషించారు. ఈ వెంకటపతే బోరవెల్లి సంస్థానాన్ని 1668 లో గద్వాల సంస్థానంలో విలీనం చేసాడు. తరువాత గద్వాల, బోరవెల్లి ఉమ్మడి సంస్థానాలకు ఏలికయ్యాడు[5]. దీనితో ఇక్కడి కవులు గద్వాల సంస్థానానికి బదిలీ అయ్యారు. అందుకే ' గద ' ( గదాయుధం), 'వాలం ' (కత్తి) కలిగిన సంస్థానానికి ' గంటం ' (కలం) జోడించిన ఖ్యాతి బోరవెల్లికి దక్కిందంటారు.

బోరవెల్లి సీమ కవులు

[మార్చు]

బోరవెల్లి సీమలో ఎంతో మంది కవులు తమ ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించి ప్రభువుల ఆదరణకు నోచుకున్నారు. గద్వాల సంస్థానానికి ముందే కవి పండితులకు నిలయమిది. దత్తన్న, మల్లన మంత్రి, కృష్ణప్ప, బోరవెల్లి నృసింహకవి, పూడూరు కృష్ణయామాత్యుడు, రేటూరి రంగరాజు, చింతలపల్లి ఛాయాపతి, లయగ్రాహి గరుడాచల కవి వంటి ఎందరో కవులు ఇక్కడివారే.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. 8 వ తరగతి దాకా చదువుకొనె అవకాశం ఉంది. తదుపరి ఉన్నత పాఠశాల విద్యకొరకు విద్యార్థులు సమీపంలోని జల్లాపురం గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలకు వెళ్ళవలసి వస్తుంది.గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉంది.బాలబడి మానోపాడ్లోను, మాధ్యమిక పాఠశాల జల్లాపూర్లోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల మానోపాడ్లోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు కర్నూలులోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల కొండేర్లోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు కర్నూలులోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉండవెల్లిలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు కర్నూలులోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

బోరవెల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గద్వాల, కర్నూలు ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం ఉంది. 7 వ నంబర్ జాతీయ రహదారికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

బోరవెల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 75 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 14 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 117 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 169 హెక్టార్లు
  • బంజరు భూమి: 323 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 619 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 961 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 150 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

బోరవెల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 126 హెక్టార్లు* ఇతర వనరుల ద్వారా: 24 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

బోరవెల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, జొన్న, ప్రత్తి, మీరప

ప్రజల జీవనాధారం

[మార్చు]

ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయమే. పత్తి, మిరప, కందులు, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, మొక్కజొన్న, జొన్న మొదలగు పంటలు పండిస్తారు.

దేవాలయాలు/ప్రార్థనాలయాయలు

[మార్చు]

గ్రామంలో అన్ని మతాల ప్రార్థనాలయాలు ఉన్నాయి. హిందువులకు సంబంధించి శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, శివాలయం, శ్రీచెన్నకేశవస్వామి ఆలయం ఉన్నాయి. అన్ని ఆలయాలు ఒకే ఆవరణలో ఉన్నాయి. శివాలయం, కేశవాలయం పాతకాలపు కట్టడాలు. బోరవెల్లి సీమ ప్రభువుల ఏలుబడిలో నిర్మించబడినవి. వీటిలో కేశవాలయం ప్రసిద్ధి చెందినది. ఇక్కడి కేశవస్వామికి బోరవెల్లి సంస్థాన కవులైన చింతలపల్లి ఛాయాపతి 'రాఘవాభ్యుదయం ', లయగ్రాహి గరుడాచల కవి ' కౌసలేయ చరిత్రం ' అంకితమియబడినవి. ఈ దేవాలయంపై ఆకర్షణీయమైన శిల్పాలు ఉన్నాయి. గుడి వెనుకపైపు భాగంలో కనిపించే ఓ శిల్పం ప్రత్యేకమైనది. ఇది జైన, వైష్ణవ సంప్రదాయ సమ్మిళితంగా కనిపిస్తుంది. కేశవాలయం ముందు భాగంలోని మండపం, ఆంజనేయస్వామి ఆలయం ఇటీవల కాలంలో నిర్మించబడినవి. గ్రామంలో బస్సు నిలయం దగ్గర ముస్లింల మజీదు ఉంది.

రాజకీయాలు

[మార్చు]

2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా గోపాల్ ఎన్నికయ్యాడు.[6]

చిత్రమాలిక

[మార్చు]

ఆటలు

[మార్చు]

ప్రతి సంవత్సరము ఆటల పొటీలు నిర్వహిస్థారు ఈ సంవత్సరము 24-01-2016 న

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-83
  5. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశం, 3 వ సంపుటం, పుట -305
  6. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 24-07-2013

వెలుపలి లింకులు

[మార్చు]