బోరవెల్లి నృసింహకవి
Jump to navigation
Jump to search
బోరవెల్లి నరసింహకవి సా.శ. 1650 ప్రాంతానికి చెందినవాడు. బోరవెల్లి సీమకు చెందిన కవి. దత్తన్న, మల్లన మంత్రి లకు మనుమడు. కృష్ణప్ప కవికి కుమారుడు. గద్వాల సంస్థానంలో అల్లసాని పెద్దనలా భాసిల్లిన కాణాదం పెద్దనకు భావమరిది. నృసింహ విలాసం అను కావ్యాన్ని రాసినట్లు తెలుస్తుంది[1]. కాని ఇది అలభ్యం. నృసింహకవి సౌపర్ణోపాఖ్యానంను రచించి ఆలంపూరులోని నరసింహస్వామికి అంకితమిచ్చాడు[2]. ఇతను రాజ సభలకు వెళ్లేటప్పుడు లేఖకులు, పాఠకులు వెంట నడిచేవారట. ఉక్తపదార్థగౌరవాలు అడుగుతూ నడిచేవారట. ఇతను రాజ గురువు కూడా. రాజకవి ఐన పెద పానుగల్లు దుర్గాధిపతి కుమార వేంకటరాయలు నృసింహకవికి శిష్యుడు. నృసింహకవి ప్రోత్సాహంతో ద్రౌపదీ కల్యాణం అను ప్రబంధాన్ని రచించాడు.
మూలాలు
[మార్చు]- ↑ గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-64
- ↑ సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 11 వ సంపుటం, నాయకరాజుల యుగం-2 రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1967, పుట-265