Jump to content

పి. భాస్కరయోగి

వికీపీడియా నుండి
Dr. P. Bhaskara Yogi
పి. భాస్కరయోగి
జననండాక్టర్ పసుపుల భాస్కరయోగి
16-07-1977
గ్రామం : బుద్ధసముద్రం, మండలం : తిమ్మాజి పేట
నివాస ప్రాంతంమహబూబ్ నగర్ భారత దేశముIndia
ప్రసిద్ధికవి, సంపాదకులు, సాహిత్య పరిశోధకులు
మతంహిందూ
వెబ్‌సైటు
https://bhaskarayogi.blogspot.in/

డాక్టర్ పి. భాస్కరయోగి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి, రచయిత, సాహిత్య పరిశోధకులు.

జీవిత విశేషాలు

[మార్చు]

భాస్కరయోగి 1977 లో మహబూబ్ నగర్ జిల్లా పోతిరెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. వారి స్వగ్రామం బుద్ధసముద్రం. చిన్నతనం నుండి ఆధ్యాత్మికసంస్కారం కలిగిన ఈయన, కళాశాల చదివే రోజుల్లో తాళపత్ర పరిశోధకులు శ్రీరుష్యశివయోగి వద్ద (1996లో) 'యోగదీక్ష' స్వీకరించారు. వారిద్వారానే గోరంట్ల పుల్లయ్యతో పరిచయమేర్పడింది. ఆ తర్వాత హైద్రాబాదులోనే స్థిరపడ్డారు. ఎన్నో గ్రంథాలను పరిశోధించారు. వివిధ ఆధ్యాత్మిక పత్రికల్లో, దినపత్రికల్లో దాదాపు 300 పైగా సాహిత్య, ధార్మిక వ్యాసాలు ప్రకటించారు. ఈ యోగి కేవలం రచనా వ్యాసంగమే కాకుండా ఆధ్యాత్మిక చర్చలు, ఉపన్యాసాలు చేయడంలో కూడా విశేషకృషి చేస్తున్నారు. ఎన్నో ఆధ్యాత్మిక సభల్లో అనేకాంశాలపై వందలకొద్ది ప్రసంగాలు చేసారు. పత్రాలను సమర్పించారు. అదే విధంగా ఈయనకు మహాత్ములన్నా, పండితులన్నా, పుస్తకాలన్నా ఎంతో ఇష్టం. అందుకే చిన్నవయస్సులో ఎన్నో గ్రంథాలను చదివారు. ఎందరో మహాత్ములను దర్శించారు.

రచనలు

[మార్చు]

1. ధర్మజిజ్ఞాస

[మార్చు]

వివిధ ఆచారాలు, సంప్రదాయాలు, దైవికంశాలకు సంబంధించి సందేహాల నివృత్తి కోసం సుమారు 300 ప్రశ్నలకు జవాబుల రూపంగా వచ్చిన ఈ పుస్తకం 2009లో ముద్రించబడింది. ఇది వివిధ ఆగమ శాస్త్రాలు, ప్రాచీన, ఆధునిక గ్రంథాల నుండి ఆధారంగా ఈ పుస్తకం వెలువరించారు. ఇది విద్వజనుల ప్రశంసలు పొందింది. మనధర్మం పట్ల ఆసక్తిని, అనురక్తిని కలిగించడానికి ధార్మికులైన వారి మనస్సులోని సందేహాలను 'ధర్మజిజ్ఞాస' రూపంలో మనకు అందిస్తున్నారు. అద్భుతమైన వివరణలతో, పఠనీయతో కూడిన ఈ గ్రంథాన్ని తెలుగు ప్రజలు చక్కగా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం. మహాభారతం సపాదలక్షగ్రంధంకాగా ఈనాడు పాఠకులకు ఒక్కొక్కదానిపై సవాలక్షసందేహలున్నవి. వాటిని తీర్చడానికి ఈనాడు ధార్మికపత్రికలు ఈ ప్రజావేదికను పెట్టి ఎందరో పాఠకుల సందేహాలను శాస్త్రీయమైన సమాధానాలు పండితులచేత యిప్పిస్తున్నవి. ఈ భాస్కరయోగి పాఠకుల సందేహాలను తీర్చడానికి 'ధర్మజిజ్ఞాస' నందిస్తున్నాడు.[1]ఈ గ్రంథానికి గాను భాస్కర యోగికి ఓగేటి అచ్యుతరామ శాస్త్రి సాహిత్య పురస్కారం 2012 ప్రధానం చేయబడింది.ఈ గ్రంథం 2015లో రెండవ ముద్రణ పొందింది.

2. పాలమూరు జిల్లా సంకీర్తన సాహిత్యం

[మార్చు]

ఇది సంకీర్తన సాహిత్యంపై వెలువడిన పరిశోధన గ్రంథం. ఈ పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు 2011లో వీరికి డాక్టరేట్ ప్రధానం చేసింది. 300 పుటల ఈ గ్రంథము పాలమూరు సంకీర్తన సాహిత్యానికి సంబంధించిన ఏన్నొ ఆజ్ఞత విషయాలను వెలుగులోకి పలువురు విద్వాంసుల ప్రశంసను పొందింది. పాలమూరు సీమ పూర్వకాలం నుంచి నేటి వరకు సాహిత్య, రాజకీయ సాంస్కృతిక రంగాలలో ఖ్యాతిగాంచినదనీ, ఇన్నాళ్లూ చరిత్రకు అందని ఎన్నో సాహిత్య పరిమళాలను వెలుగులోకి తెచ్చారు భాస్కరయోగి. తెలంగాణ జిల్లా గ్రామీణ ప్రపంచంలో ఉన్న సారవంతమైన సంస్కృతికి నిదర్శనంగా ఉన్న సంకీర్తన సాహిత్యాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి.

3. పాలమూరు జిల్లా వాగ్గేయకారులు

[మార్చు]

పాలమూరు సాహిత్య పరిమళాన్ని పదిమందికి పంచాలనే స దుద్దేశ్యంతో ఎంతో శ్రమించి ఎందరో అజ్ఞాత సంకీర్తన కవుల జీవితాలను వెలుగులోకి తెచ్చారు కవి, రచయిత భాస్కరయోగి. భాస్కరయోగి పేరుకు తగ్గట్టుగానే అపారమైన తపస్సు లాంటిది చేసి ఈ గ్రంథాన్ని రూపొందించారు. పల్లె జీవితంతో వాగ్గేయకారుల జీవితాలను తెలుసుకోగోరు వారంతా తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. పాలమూరు జిల్లా వాగ్గేయకారులు పుస్తకాన్ని పి.భాస్కరయోగి రచించాడు. 2011లో ముద్రించిన ఈ పుస్తకంలో భాస్కరయోగి పాలమూరు జిల్లా పరిశోధనలు చేసి వాగ్గేయకారుల జీవితచరిత్రలు, వారి కీర్తనలు పొందుపర్చారు. ప్రముఖ కవి కపిలవాయి లింగమూర్తి అభివీక్షణం పేరుతో దీనికి ముందుమాట రాశారు. జిల్లాలోని 160 వాగ్గేయకారుల జీవితచరిత్రలను సంక్షిప్తంగా వివరించడమే కాకుండా ప్రతి వ్యాసం చివరన వారి కీర్తనలు కూడా రచయిత ఇచ్చాడు.[2] చాలామంది వాగ్గేయకారుల చిత్రాలను కూడాపొందుపర్చడం జరిగింది. తెలుగులో తొలి వాగ్గేయకారుడు 13వ శతాబ్దికి సంతాపూర్ గ్రామవాసి అయిన సింహగిరి కృష్ణమాచార్యులు అని ఇతనితోనే సంకీర్తనా సాహిత్యం ప్రారంభమైందని[3] రచయిత వివరించాడు. 13వ శతాబ్ది నుంచి నేటి వరకు జిల్లాలో నివసించిన 137 వాగ్గేయకారులే కాకుండా పూర్తి వివరాలు లభించని మరో 30 వాగ్గేయకారుల గురించి పుస్తకం చివరన సంక్షిప్తంగా వివరించబడింది. ఇందులో వందలాది కీర్తనలు చేసిన వారి నుంచి రెండు-మూడు కీర్తనలు చేసిన రచయితల గురించి కూడా సాధ్యమైనంత వరకు వివరాలు సేకరించడం జరిగింది. పాలమూరు జిల్లా వాగ్గేయకారుల చరిత్రను అక్షరబద్ధం చేయడం హర్షణీయమని ప్రముఖ సాహిత్య పరిశోధకుడు వైద్యం వేంకటేశ్వరాచార్యులు పదార్చన పేరుతో వ్రాసిన ముందుమాటలో పేర్కొన్నాడు.[4] ఈ మహత్తర గ్రంథానికి వీరికి బి.ఎన్ శాస్త్రి కల్చరల్ ఎక్స్లెన్స్ అవార్డ్ 2012లో ప్రకటించింది.

4. ధర్మధ్వజం

[మార్చు]

సమాజంలో అవినీతి పెరిగిపోయింది. విలువలు పతనమవుతున్నాయి. ఎక్కడ చూసినా సామాజిక అశాంతి పెరిగిపోయిం ది. మరోవైపు ఈ దేశ గాలి పీల్చి పరదేశీ పాటపాడుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నదని భాస్కరయోగి కలవరంతో చేసిన రచనలు ఇవి.[5]

5. సమత్వ సాధనలొ సౌజన్య మూర్తులు

[మార్చు]

భారతదేశంలో కూలతత్వాన్ని నిర్ములించడానికి, మానవతా తత్వాన్ని నెలకొల్పడానికి కృషి చేసిన ఎందరో సంఘ సంస్కర్తల సాహిత్యం, జీవితాల ఆధారంగా వ్రాయబడిన గ్రంథం ఇది. ఈ ముప్పై సంవత్సరాల కాలం లోనే సుమారుగా 400 మందికి పైగా గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి లో సమరసతా సాధనలో పని చేసిన వారి పేర్లు భాస్కర యోగి గారు పేర్కొన్నారు. దీనిని హిందీలోకి అనువదించారు. తెలుగులో రెండవ ముద్రణ పొందింది.

6. యాదాద్రి సంకీర్తనాచార్యుడు ఈగ బుచ్చిదాసు

[మార్చు]

తిరుపతి శ్రీవేంకటేశ్వరునికి అన్నమయ్య పదసేవ చేసినట్టుగా, భద్రాచల రామునికి కంచర్ల గోపన్న దాసుడయినట్టుగా యాదాద్రి నృసింహస్వామిని ఈగ బుచ్చిదాసు సేవించారు. ఆయన కీర్తనలు, రెండు శతకాలు, మంగళహారతులు, స్తోత్రాలు భాస్కరయోగి సంకలనకర్తగా ఈగ బుచ్చిదాసు సమగ్ర సాహిత్యం రచనలను 2017 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించింది.[6]

7. హిందువుల పండుగలు

[మార్చు]

భారతదేశంలో జరుపుకొనబడే వివిధ హిందూ పండుగల పరిచయం, సంక్షిప్త వివరణతో వచ్చిన ఉద్గ్రంథం ఇది. ఈ పుస్తక ముద్రణకు పూర్వం ఆయా పండుగల పుట్టు పూర్వోత్తరాలు ఆధారాలు సంపాదించడానికి నిర్విరామ కృషి చేసారు.

8. తెలంగాణా సాహిత్య సౌరభాలు

[మార్చు]

తెలంగాణా సాహిత్యం పై విమర్శనాత్మక గ్రంథం ఇది. ఇందులో వచ్చిన వ్యాసాలు తెలంగాణా సాహిత్యంపై విమర్శనాత్మక చర్చ జరిపాయి. ఈ గ్రంథాన్ని తెలుగు అకాడమీ వారు ప్రచురించారు.

9. ఒక నియంత తలవంచిన రోజు

[మార్చు]

భారత స్వాతంత్ర్య దినోత్సవం నుండి హైద్రాబాదుపై సైనిక చర్య వరకు మధ్యకాలంలో తెలంగాణ ప్రజలు రజాకార్ల వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులు, పడిన కష్టాలను వారు సాగించిన తెలంగాణ విమోచన పోరాటాల కథలను కళ్ళకు కడుతుంది ఈ గ్రంథం.

10. ఫోర్త్ ఎస్టేట్

[మార్చు]

ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రభూమిలో భాస్కరవాణి పేరుతో సామాజిక రాజకీయ అంశాలపై జాతీయవాద దృక్పథంతో వెలువడిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి.

సంపాదకత్వం & కాలమిస్ట్

[మార్చు]

భాస్కర యోగి ప్రస్తుతము మలయాళ స్వామి ఆశ్రమము, గంగాపురం మహబూబ్ నగర్ జిల్లా వారి వారి ద్వారా ప్రచురితమవుతున్న గీత జ్ఞానయోగ సమాచార్ ఆధ్యాత్మిక పత్రికకు సంపాదకులుగా ఉన్నారు.2015 నుంచి జాగృతి వారపత్రికలో 39వపేజీలో మాటకు మాట శీర్షికలో సమకాలీన అంశాలపై డాక్టర్. పి. భాస్కర యోగి గారి వ్యంగ్య వ్యాఖ్యానం వస్తుంది. 2016 నుంచి ప్రతి శుక్రవారం ఆంధ్రభూమి దినపత్రిక మెయిన్ పేపర్లో పేజీ నెంబర్ 4లో సంపాదకీయం పేజీలో భాస్కరవాణి శీర్షికలో సమకాలీన అంశాలపై డాక్టర్. పి. భాస్కర యోగి గారి వ్యాసాలు వస్తున్నాయి. 2017 నుంచి ప్రతిరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక మెయిన్ పేపర్లో పేజీ నెంబర్ 2లో పరంజ్యోతి శీర్షికలో డాక్టర్. పి. భాస్కర యోగి గారి ఆధ్యాత్మిక వ్యాసాలు వస్తున్నాయి. 2018 ఏప్రిల్ నెల నుండి ప్రతిరోజూ ఆంధ్రభూమి దినపత్రిక మెయిన్ పేపర్లో పేజీ నెంబర్ 11లో ధర్మభూమి డైలీ ఫీచర్లు విభాగంలోధర్మధ్వజం శీర్షికలో డాక్టర్. పి. భాస్కర యోగి గారి ఆధ్యాత్మిక వ్యాసాలు వస్తున్నాయి.

ఇతరాలు

[మార్చు]

డాక్టర్. ఫై. భాస్కరయోగి ఇప్పటి వరకు ౩౦౦ పైగా వ్యాసాలు వ్రాయగా వాటిలో ధార్మిక ఆధ్యాత్మిక, సామాజిక అంశాలు ఉన్నాయి. వీటితోపాటు భాస్కరయోగి వందల సంఖ్యలో ఉపన్యాసాలు ఇవ్వడం వివిధ సాంస్కృతిక, ధార్మిక వేదికలపై పరిశోధన పత్రాలు సమర్పించడం జరిగింది.

మూలాలు

[మార్చు]
  1. [1] ధర్మజిజ్ఞాస,
  2. పాలమూరు జిల్లా వాగ్గేయకారులు
  3. పాలమూరుజిల్లా వాగ్గేయకారులు, పేజీ 19
  4. "ఆన్లైన్ లో భాస్కరయోగి పుస్తకాలు". Archived from the original on 2015-06-13. Retrieved 2018-02-02.
  5. ధర్మధ్వజం
  6. యాదగిరి సంకీర్తనాచార్యుడు : నమస్తే తెలంగాణ, దినపత్రిక : డిసెంబర్ 2 2017