అత్తాను రామానుజాచార్యులు
Appearance
"'అత్తాను రామానుజాచార్యులు"' మహబూబ్ నగర్ జిల్లా లోని మునిపల్లె గ్రామానికి చెందిన వారు[1]... పాండురాజు వంశస్థుడు. మదనగోపాల భక్తుడు. ' రుక్మిణీ కల్యాణం ' ను కురవంజి రూపంలో రచించాడు. ఇందులో దవళాలు, సువ్వాలలు, మంగళహారతులు మొదలగు దేశి రచనలు ఉన్నాయని పరిశోధకులు తేల్చారు.[2] ఈ రుక్మిణి కురవంజి ప్రతి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి కార్యాలయంలో ఉంది. రుక్మిణీ కురవంజిలో ఓ మచ్చుతునక....
కొట్నాలు దంచేటప్పుడు పాడే సువ్వాల
"వన్నె సన్న నూది పచ్చ గన్నెరాలు కృష్ణ భోగి
సన్న రాజనాలు జీల సర్లు దంపు చూ
ఉబ్బి నిక్కి జంగ జూచి ఉవిదలెల్ల చెమట జార
గబ్బి గుబ్బ లదగాను కలయదంచిరీ
మూలాలు
[మార్చు]- ↑ సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 12 వ సంపుటం, కడపటిరాజుల యుగం, రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1968, పుట-39
- ↑ మరుగునపడిన మాణిక్యాలు, రచన: బిరుదురాజు రామరాజు, పుట-65